TG: TGSPDCL కార్యాలయం దగ్గర 2000 మంది ఆర్టిజెన్స్ ధర్నాకు దిగారు. ఈ ధర్నాతో మింట్ కాంపౌండ్‌లోని కార్యాలయం దద్దరిల్లింది. ఆర్టిజన్లను రెగ్యులర్ చేసిన తరువాతనే JLM, సబ్ ఆర్డినెట్స్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని, విద్య అర్హతను బట్టి ప్రమోషన్ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టిజెన్స్ను రెగ్యులర్‌గా చేయాలని, అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని సూచించారు.