సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) గారాలపట్టి సితార చిన్నప్పటి నుంచే మల్టీ టాలెంట్ చూపిస్తోంది. ఇప్పటికే తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్న వీడియోలతో పాపులరైన సితార(Sitara).. అప్పుడప్పుడూ డాన్స్ వీడియోలతోనూ సత్తా చాటుతోంది. తాజాగా సాయిపల్లవి సాంగ్‌కు తను డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. టాలీవుడ్ (Tollywood) స్టార్ కిడ్స్‌లో ప్రముఖంగా వినిపించే పేరు సితార. పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, వీడియోలతో పాపులరైన సీతూ పాప.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మిలియన్‌కు పైగా ఫాలోవర్లను సంపాదించింది. ఇక తరచూ తండ్రి మహేశ్ బాబు నటించిన లేదా ఇతర సినిమాల్లోని పాటలకు తను డాన్స్ చేసిన వీడియోలను ఇన్‌స్టా(Insta)లో అప్లోడ్ చేస్తుంటోంది.
చదవండి :ACB:కి చిక్కిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా
తాజాగా లవ్‌స్టోరీ (love story) చిత్రంలోని సారంగదరియా సాంగ్‌కు అద్భుతంగా డాన్స్ చేసింది సితార. ఈ వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.. 4.40 లక్షల మందికిపైగా లైక్ చేయడం గమనార్హం. అంతేకాదు ఈ పాటలో తన పెర్ఫార్మెన్స్కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. సితార ఫ్యూచర్లో హీరోయిన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చూస్తుంటే ఇప్పటి నుంచే ఆ దిశగా శిక్షణ తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది.
పైగా తండ్రి మహేశ్ బాబు నటించిన సర్కారువారి పాట (Sarkaruvari paṭa) చిత్రంలోని పెన్నీ సాంగ్ ప్రోమోలో సితార కనిపించింది. ఓ డాన్స్ ప్రోగ్రామ్‌కు తండ్రితో హాజరైన సితార పాప.. తన స్పాంటెనిటీతో ఆకట్టుకుంది. ఇక మహేశ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు (Chinababu) నిర్మిస్తున్న చిత్రంలో పూజా హెగ్డే,(Pooja Hegde) శ్రీలీల ఫిమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రంలో జగపతి బాబు, సునీల్, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజు, రఘుబాబు, మహేశ్ ఆచంట, జయరాం తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.