గూగుల్ (Google) మళ్లీ ఉద్యోగులకు షాకిచ్చింది. ఇప్పటికే ఉద్యోగాలు తొలగించిన ఐటీ దిగ్గజం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఉద్యోగులు (employees) వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని గూగుల్ స్పష్టం చేసింది. కరోనా(Corona) సంక్షోభం సమయంలో దిగ్గజ కంపెనీలు వర్క్ ఫ్రం హోం (Work from home) బాట పట్టడం తెలిసిందే. కార్యకలాపాలు మందగించకుండా, ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేసేలా కంపెనీలు ప్రోత్సహించాయి. అయితే ఇప్పుడు కరోనా పరిస్థితులు లేవు. దాంతో కంపెనీలు మళ్లీ కార్యాలయాలు తెరిచి ఉద్యోగులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ నిబంధనను అంగీకరించని ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని గూగుల్ హెచ్చరించింది.
ఈ నిబంధన పాటించని ఉద్యోగుల పనితీరుకు తక్కువ గ్రేడింగ్ (Grading) ఇస్తామని తెలిపింది. ఈ మేరకు తన నూతన వర్క్ పాలసీని గూగుల్ ప్రకటించింది. హాజరు విషయంలో తాము రాజీపడబోమని గూగుల్ సీపీవో ఫియోనా సిక్కోనీ (Fiona Cicconi) స్పష్టం చేశారు. ఆఫీసులకు దగ్గరగా నివసిస్తున్న ఉద్యోగులు ఈ నిబంధన తప్పక పాటించాలని సూచించారు. ఉద్యోగులందరూ ఆఫీసులకు వచ్చేయాలని ఇప్పటికే ఆదేశాలు (Orders) జారీ చేసేసింది.ఈ మేరకు తన నూతన వర్క్ పాలసీని గూగుల్ ప్రకటించింది. హాజరు విషయంలో తాము రాజీపడబోమని గూగుల్ సీపీవో ఫియోనా సిక్కోనీ స్పష్టం చేశారు. ఆఫీసులకు దగ్గరగా నివసిస్తున్న ఉద్యోగులు ఈ నిబంధన తప్పక పాటించాలని సూచించారు.