భారత టెన్నిస్ క్రీడీకారిణి సానియా మీర్జా… పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే… వీరిద్దరూ విడిపోయారని… మీరు విడాకులు తీసుకున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఇద్దరూ స్పందించలేదు. కానీ… వారు విడాకులు తీసుకున్నారని గట్టిగా పుకార్లు వచ్చాయి. అయితే… అందులో నిజం లేదని తాజాగా తెలిసింది.
వారిద్దరూ విడిపోవడం లేదని… ఓ షో కి ప్రచారం కలిపించేందుకు… ఈ విడాకుల నాటకం ఆడారని తెలియడం గమనార్హం. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి ఓ టాక్ షో చేస్తున్నారన్న వార్త మరోమారు హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్థాన్‌లోని ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇద్దరూ కలిసి ఓ టాక్ షో నిర్వహించబోతున్నట్టు ఆ సంస్థ సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించింది.
సానియా-షోయబ్ విడిపోతున్నట్టు అటు ప్రధాన మీడియాలోను, ఇటు సోషల్ మీడియాలోనూ వార్తలు వెల్లువెత్తున్నప్పటికీ వీరిద్దరూ ఇప్పటి వరకు నేరుగా ఈ విషయమై స్పందించలేదు. అయితే…ఈ సమయంలో షోయబ్ కూడా ఒక పాక్ హీరోయిన్‌తో కలసి కనిపించడం, ఆ వార్తలు నిజమనే అందరూ నమ్మారు. కాని సడన్‌గా ఒక ఊర్దూ ఓటిటి యాప్ మాత్రం.. ‘ది మీర్జా మాలిక్ షో’ వస్తోందంటూ ప్రకటన ఇచ్చేసింది.
ఒక ప్రక్కన ఈ ప్రకటనను ఎండార్స్ చేస్తూ అటు షోయబ్ కానీ ఇటు సానియా కాని ఒక్క ట్వీట్ లేదా ఇనస్టాగ్రామ్ పోస్ట్ చేయకపోవడం ఆశ్చర్యకరంగానే ఉన్నా కూడా, అసలు డైవర్స్ అంటూ వార్తలొచ్చాక ఇలా ప్రోగ్రామ్ ఎనౌన్స్మెంట్ ఏంటంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
అంటే జనాల్లో హైప్ క్రియేట్ చేయడానికి సానియానే ఇటువంటి డైవర్స్ రూమర్లను పుట్టించి, దాని చుట్టూ జనమందరూ డిస్కస్ చేసుకుంటున్న తరుణంలో ఈ కొత్త టాక్-షో గురించి పబ్లిసిటీ మొదలుపెట్టిందా అంటూ అవాకులు చివాకులు పేలుతున్నారు నెటిజన్లు. అయితే సానియా ఎంత చేసినా కూడా, ఒక పాకిస్తానీ షో కోసం ఇటువంటి హడావుడి చేస్తుందా అంటూ మరో వర్గం విమర్శిస్తోంది.