ప్రస్తుతం అఖిల్ ‘ఏజెంట్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో అఖిల్ మాసివ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే బీస్ట్‌లా మేకోవర్ అయ్యాడు అఖిల్. ఏజెంట్ టీజర్లో మాన్స్టర్ను తలపిస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ ఈ ఏడాది ఎండింగ్ లేదా సంక్రాంతికి ఏజెంట్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపించినా ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్‌తో అఖిల్ సినిమా చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. దర్శకుడు పిఎస్ మిత్రన్ కార్తితో తెరకెక్కించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘సర్దార్’ దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ కానుంది. ఈ సినిమాను తెలుగులో అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది.
సర్దార్(sardar) ప్రమోషన్లో భాగంగా.. అఖిల్‌తో ఒక సినిమా చేసే ఆలోచన ఎప్పటి నుండో వుందని.. అఖిల్ కోసం కథ రాస్తున్నానని చెప్పుకొచ్చాడు మిత్రన్. ఒకవేళ అఖిల్‌కు కథ నచ్చితే ఈ కాంబినేషన్లో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. ఇక కార్తీ ‘సర్దార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 19న, అంటే ఈ రోజు సాయంత్ర మాదాపూర్‌లోని దసపల్లా కన్వెన్షన్‌లో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కింగ్ నాగార్జున(nagarjuna akkineni) చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారు. దీంతో సర్దార్ పై మంచి బజ్ ఏర్పడుతోంది.