ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘ది ఘోస్ట్’ అక్టోబర్ 5న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. దాంతో ప్రమోషన్స్ స్పీడప్ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ కోసం నాగ్‌తో పాటు హీరోయిన్ సోనాల్ చౌహాన్ తీసుకున్న ట్రైనింగ్ వీడియోను విడుదల చేశారు. అలాగే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 25న కర్నూలులోని ఎస్టీబీసీ గ్రౌండ్లో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ ఈవెంట్‌కు పెద్ద ఎత్తున అక్కినేని ఫ్యాన్స్ రానున్నారు. అయితే ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇది పక్కాగా అక్కినేని ఈవెంట్‌లా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకే ఈ ఈవెంట్‌కు నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ రాబోతున్నట్టు తెలుస్తోంది. తండ్రి సినిమా కోసం తనయులు వస్తుండడంతో.. అక్కినేని ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపుతోంది. అలాగే చాలా రోజుల తర్వాత ఈ ముగ్గురూ ఒకే వేదికను పంచుకుంటే.. ది ఘోస్ట్ పై మరింత హైప్ క్రియేట్ అవనుందని చెప్పొచ్చు. దాంతో ది ఘోస్ట్‌తో నాగ్ హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇంకా ఈ సినిమాకు ఇంకా కొంత షూటింగ్ బ్యాలన్స్ ఉందట. దాంతో ప్రస్తుతం దర్శకుడు చిన్న చిన్న ప్యాచ్ వర్క్‌తో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని చూస్తున్నారట. మరి నాగ్ ఈసారి ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.