నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాల పరంగా దూకుడు పెంచింది సమంత. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది సామ్(Samantha). అలాగే ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్, డీకెలతో కలిసి మరోసారి వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో జోడి కట్టనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే అమెరికాలో ట్రైన్ అయింది సామ్. ఇక తెలుగులో గుణ శేఖర్ ‘శాకుంతలం’.. యశోద(Yashoda) అనే లేడీ ఓరియేంటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది.
అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి సినిమాలోను నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవడానికి రెడీ అవుతోంది సామ్. వీటిలో ముందుగా యశోద సినిమా రిలీజ్ కానుంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ‘యశోద’తో హరి, హరీష్ అనే కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను నవంబర్ 11న, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.