Amitab Batchan ఆ బ్రాండ్ కి ప్రచారం చేయకండి.. బిగ్ బీకి సజ్జనార్ స్పెషల్ రిక్వెస్ట్..!
Amitab Batchan : సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్స్‌గా వెలుగొందుతోన్న హీరోలు, హీరోయిన్లు యాడ్ ప్రమోషన్స్ చేయడం కొత్తేమీ కాదు. వీరు సినిమాలతో పాటు పలు కంపెనీల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అలా యాడ్ ప్రమోషన్స్ ద్వారా కోట్ల ఆదాయం..వస్తుంది
సినీ తారలకు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ లుగా పనిచేయడం సర్వ సాధారణం. దానికోసం ప్రచారం కూడా చేస్తుంటారు. తమ ఫేవరేట్ హీరోలు, హీరోయిన్లు ప్రచారం చేయడంతో అభిమానులు కూడా వాటిని కొనేస్తూ ఉంటారు. ఇలాంటి కొన్ని బ్రాండ్స్ కి బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్..ఆమ్ వే అనే సంస్థకు ప్రచార కర్తగా ఉన్నారు. దీన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తప్పుబట్టారు. గొలుసుకట్టు సంస్థలకు ప్రముఖులు ఎవరూ ప్రచారం చేయొద్దంటూ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
తాజాగా ఆమ్ వే సంస్థకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రచారం చేయడంపై ఆయన్ను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘‘గొలుసుకట్టు సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాయి. ఇలాంటి సంస్థలను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం కానీ.. వాటికి మద్దతు ఇవ్వడం కానీ చేయొద్దు’’ అని సజ్జనార్ సలహా ఇచ్చారు. మరి సజ్జనార్ రిక్వెస్ట్ ఫై బిగ్ బి ఏమైనా స్పందిస్తారా.. ? అనేది చూడాలి.