ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూకశ్మీర్‌లోని ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కశ్మీర్లో ప్రజల మధ్య RSS, BJP చిచ్చు పెడుతోందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలను విభజించడమే వాళ్ల పని అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు.