జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి కాల్పులతో విరుచుకుపడ్డారు. ఆ క్రమంలో చెందిన సంజయ్ శర్మ అనే మైనారిటీ పౌరుడు మృతి చెందాడు. అతను స్థానిక మార్కెట్‌కు వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నాడు. తన ప్రియురాలు మిథాలీ పారుల్కర్ ను పెళ్లాడుతున్నాడు. వీరి వివాహం ఈ నెల 27న ముంబైలో జరగనుంది.
గాంధీ హాస్పిటల్ (Gandhi hospital) లో పేషంట్ వెంట వచ్చే బంధువులకు ఒకరు లేదా ఇద్దరికే అనుమతి ఇస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు (Raja Rao) తెలిపారు. కొన్నిసార్లు వారిని చూడటానికి 6 నుంచి 10 మంది వరకు కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు రావడం, గేట్ల వద్ద సిబ్బందితో గొడవలకు దిగి దుర్భాషలాడటం, కొట్టడం లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన తెలిపారు.
నటీనటులు రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాత హాల్దీ వేడుక పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రేమించుకున్న ఈ జంట ఇటీవల ఒక్కటయ్యారు. ఆకట్టుకుంటున్న వీరి పెళ్లి ఫొటోలను ఓ సారి చూసేయండి మరి.
చిత్తురు (Chittoor) జిల్లాలోని శెట్టిపల్లి సమీపంలో ఘెర రోడ్డు ప్రమాదం (road accident) చోటు చేసుకుంది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. శెగడిపల్లి మండలం గట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్(HCA) వేడుకల్లో భాగంగా ఫేమస్ దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) ఓ అమెరికన్ బాలనటి వైలెట్ మెక్‌గ్రా(Violet McGraw)తో సెల్ఫీ(selfie) ఫోటోలకు ఫోజులిచ్చారు. 11 ఏళ్ల అద్భుతమైన నటి మెక్‌గ్రా తనకు అవార్డు అందించడం పట్లు జక్కన్న సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన ఇన్ స్టా వేదికగా ఆ చిత్రాన్ని పంచుకున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ (HCU ) ఎన్నికల్లో SFI కూటమి ఘన విజయం సాధించింది. SFI, ASA, DSU సంఘాల కూటమి తరుపున పోటీ చేసిన అభ్యర్థులందరూ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి ఏబీవీపీ (ABVP )పై ఘన విజయం సాధించింది. అధ్యక్షుడుగా ప్రజ్వల్ 608 ఓట్ల మెజార్టీతో గెలవగా, ఉపాధ్యక్షుడిగా పృధ్వీ 700, ప్రధాన కార్యదర్మిగా కృపరియా గెలిచారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సూసైడ్ అటెమ్ట్ కోసం ప్రయత్నించిన ప్రీతి ఫోన్ కాల్ సంచలన సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనిలో సైఫ్ వేధించినట్లు స్పష్టంగా ప్రీతి తన తల్లితో చెప్పడం బయటకు వచ్చింది. సీనియర్లు అందరూ ఒక్కటిగా ఉన్నారని, సైఫ్ తనతోపాటు అనేక మందిని వేధించినట్లు ఫోన్ సంభాషణలో తెలిపింది.
28 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జిమ్ కు వెళ్లి ఆకస్మాత్తుగా కూప్పకూలిపోయాడు. గమనించిన తన తోటి మిత్రులు అతన్ని లేపి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషాద ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఐటీ అధికారులమని 50 లక్షలు దోచుకున్న దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 లక్షల రూపాయలకు గాను రూ.48.30 లక్షల నగదు, అరకిలో గోల్డ్ కు గాను 132 గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఇంప్రూవ్ అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు సార్ల కంటే ఎక్కువ గెలిచే అవకాశం లేదని అంటున్నారు. ఇంకెం విశేషాలు చెప్పారో తెలియాలంటే ఈ పూర్తి ఇంటర్వ్యూను చూసేయండి
జపాన్(Japan)లో శనివారం భారీ భూకంపం(Huge Earthquake) సంభవించింది. జపాన్(Japan)లోని హుక్కయిడో ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో ఈ భూకంపం(Earthquake) సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే, జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.
మహిళల ఐపీఎల్ ఇంకొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ తరుణంలో శనివారం ముంబయి ఇండియన్స్ జట్టు తొలుత మహిళల ప్రీమియర్ లీగ్ జెర్సీని రిలీజ్ చేసింది. ఆ జెర్సీలో ముంబైలోని సూర్యుడు, సముద్రం సహా నీలం, బంగారు, లేత ఎరుపు రంగులను కలిగి ఆద్భుతుంగా ఉందని చెప్పవచ్చు.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల క్రితం డెలివరీ కోసం ఓ మహిళ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేసిన మహిళా డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. గత ఐదేళ్లుగా నరకం అనుభవించిన మహిళ ఇటీవల స్కాన్ చేయించుకోగా అసలు విషయం తెలిసింది.