Latest News : మద్యం తాగడం విషయంలో పోటీ పెట్టుకొని ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ కి చెందిన 45ఏళ్ల జై సింగ్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో ఛాలెంజ్ పెట్టుకున్నాడు. కేవలం 10 నిమిషాల్లో లోకల్ మందును మూడు క్వార్టర్లు తాగాలంటూ ఛాలెంజ్ చేశారు. తాగకపోతే... ఆరోజు వారు తాగిన మందు బిల్లు అంతా కట్టాలని వారు బెట...
తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చడం లేదని, అలాంటి ఆలోచన లేదని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఈ కళాక్షేత్రం పేరులోని తుమ్మలపల్లి, క్షేత్రయ్య పేర్లు తొలగించాలంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై వివరణ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) బుధవారం కడప స్టీల్ ప్లాంటుకు (Steel plant) భూమిపూజ నిర్వహించారు. జిందాల్ స్టీల్ (Jindal Steel) చైర్మన్ సజ్జన్ జిందాల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఉక్కు పరిశ్రమ నమూనాను పరిశీలించారు.
10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌జిపిటి(ChatGPT)ని ఉపయోగించడాన్ని నిషేధించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెల్లడించింది. విద్యార్థులు ఉపయోగించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
మూడు రాజధానులు ఏమీ లేవని, విశాఖనే తాము రాజధానిగా చేయబోతున్నామన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy) వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సజ్జల క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి, రాద్దాంతానికి తెరదించాలని భావించారు.
అదానీ గ్రూప్ సంస్థపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ సంస్థపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్, సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్‌లకు రెండు వేర్వేరుగా లేఖలు రాస్తూ డిమాండ్ చేశారు.
ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అదే సమయంలో వివాదాస్పదంగానూ కనిపిస్తోంది. తన పెంపుడు కుక్క ప్లోకీని ట్విట్టర్ సీఈవో కుర్చీలో కూర్చోబెట్టారు.
Thakre - Komati Reddy : తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయన చేసే పనులు, మాట్లాడే మాటలు... పార్టీకి తిప్పలు తెచ్చిపెడుతున్నాయి.
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ అభివృద్ధి పనులు జరగాలని సీఎం కేసీఆర్ సూచించారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయికే కొండగట్టు బాధ్యతలు కూడా అప్పగించారు. సీఎం ఆదేశాలతో ఆనంద్ సాయి రెండు రోజులుగా కొండగట్టులో బస చేశారు. ఆలయాన్ని మొత్తం పరిశీలించారు. ప్రకారాలు, ప్రహరీ, ఆలయం లోపల అన్నింటిని పరిశీలించి ఒక అంచనాకు వచ్చారు. కొండగట్టు మాస్టర్ ప్లాన్ తయారీ, పర్యవేక్షణ బాధ్యతలు ఆనంద...
ఇలాంటి విన్యాసాలు, సాహసాలు చాలా నమోదయ్యాయి. కాకపోతే జంటలు తమ వ్యక్తిగత ప్రైవసీ నేపథ్యంలో వీటిని బహిర్గతం చేయలేదు. కాగా భూతల స్వర్గంగా మాల్దీవులు దీవులు పేరు గాంచాయి. సుందరమైన ప్రదేశాలు, నీటి అందాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున మాల్దీవులకు వెళ్తున్నారు. మన దేశానికి చెందిన సినీ నటీనటులు, ప్రముఖులు అక్కడకి వెళ్లి సేద తీరి వస్తున్నారు.
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయాల్లో (BBC) వరుసగా రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) అధికారులు సర్వే చేస్తున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతోందనే అనుమానంతో ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు.
CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్ల పల్లెను చేరుకుంటారు.
ప్రేమికుల రోజు(lovers day)న దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో విషాద ఘటన చేటుచేసుకుంది. నైరుతి ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ధాబా రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, ప్రేమికుల రోజున మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Turkey Earth Quake : టర్కీలో సంభవించిన భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. టర్కీ, సిరియాలో సంభవించిన ఈ భూకంపం వలన సుమారు రూ. 7 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. మరణాల సంఖ్య 72 వేలు దాటే అవకాశం ఉందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. శిధిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతున్నది.