తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరు మారలేదు
తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చడం లేదని, అలాంటి ఆలోచన లేదని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఈ కళాక్షేత్రం పేరులోని తుమ్మలపల్లి, క్షేత్రయ్య పేర్లు తొలగించాలంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై వివరణ ఇచ్చారు.
తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం పేరును మార్చడం లేదని, అలాంటి ఆలోచన లేదని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ఈ కళాక్షేత్రం పేరులోని తుమ్మలపల్లి, క్షేత్రయ్య పేర్లు తొలగించాలంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై వివరణ ఇచ్చారు. పేరు మార్చారని చేసిన ప్రచారంలో నిజం లేదన్నారు. 2021 డిసెంబరులో కొన్ని పునరుద్ధరణ పనులు చేపట్టిన కారణంగా కేవలం సాంస్కృతిక కార్యక్రమాల కోసమే హాల్ ఉద్దేశించబడిందన్న విషయాన్ని తెలియచేసేందుకు గ్లోసైన్ బోర్డులో కళాక్షేత్రం పేరును పెట్టామన్నారు. తుమ్మలపల్లి వారి క్షేత్ర య్య కళాక్షేత్రం పేరుతో బోర్డుని త్వరలో ఆవిష్కరిస్తామన్నారు. ఈ బోర్డును తయారు చేయిస్తున్నామని, త్వరలో భవనానికి అమర్చుతామన్నారు.
విజయవాడలోని ఈ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం… తెలుగు సాహితీ, కళాప్రియులకు సుపరిచితం. దీని పేరును మార్చారంటూ వార్తలు వచ్చాయి. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ పేరులోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య పేరు మాయమైంది. కేవలం కళాక్షేత్రం అని మాత్రమే ఉంది. దీంతో పేరు మార్చారనే వార్తలు వచ్చాయి. గతంలో పలు విశ్వవిద్యాలయాలు, పథకాల పేర్లును మార్చింది వైసీపీ ప్రభుత్వం. కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చింది. వరుసగా పేర్లు మార్చుతుండటం.. అలాగే, బోర్డు పైన పేర్లు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఆడిటోరియం స్థలాన్ని నిర్మాణం కోసం డాక్టర్ తుమ్మలపల్లి శ్రీహరి నారాయణ పంతులు దానమిచ్చారు. దీంతో తుమ్మలపల్లి వారి ఆడిటోరియంగా పిలిచారు. ఆ తర్వాత ప్రముఖ వాగ్గేయకారుడు క్షేత్రయ్య పేరు జత చేసి… తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంగా పిలుస్తున్నారు.