Turkey Earth Quake : టర్కీలో భూకంపం.. నష్టం రూ.7 లక్షల కోట్లు…!
Turkey Earth Quake : టర్కీలో సంభవించిన భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. టర్కీ, సిరియాలో సంభవించిన ఈ భూకంపం వలన సుమారు రూ. 7 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. మరణాల సంఖ్య 72 వేలు దాటే అవకాశం ఉందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. శిధిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతున్నది.
టర్కీలో సంభవించిన భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. టర్కీ, సిరియాలో సంభవించిన ఈ భూకంపం వలన సుమారు రూ. 7 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. మరణాల సంఖ్య 72 వేలు దాటే అవకాశం ఉందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. శిధిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతున్నది.
పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టం కావడంతో, శిధిలాల తొలగింపునకు ఆలస్యం జరుగుతున్నది. ప్రపంచంలోని అనేక దేశాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. శిధిలాల క్రింద వేల సంఖ్యలో మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బయట పడుతున్న మృతదేహాలు గుర్తు పట్టలేకుండా కుళ్ళిన స్థితిలో ఉంటున్నాయని సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారు చెబుతున్నారు.
భారత్ తో సహా పలు దేశాలు ఈ సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తామున్నామనే ధైర్యాన్ని అందిస్తున్నారు. క్షతగాత్రులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. బాధితులకు మనోధైర్యం అందిస్తున్నారు. టర్కీ, సిరియాలో జరిగిన నష్టం ఆ రెండు దేశాల జీడీపీలో 10 శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రెండు దేశాలను ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఐరాస పిలుపునిచ్చింది.