»Lovers Day Man Kills Stuff Girlfriends Body In Fridge Goes To Marry Another Woman Delhi
lovers day: ఫ్రిజ్‌లో ప్రియురాలి శవం..మరో మహిళతో పెళ్లి
ప్రేమికుల రోజు(lovers day)న దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో విషాద ఘటన చేటుచేసుకుంది. నైరుతి ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ధాబా రిఫ్రిజిరేటర్లో ఉంచి, ప్రేమికుల రోజున మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ప్రేమికుల రోజు(lovers day)న దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నైరుతి ఢిల్లీలో 24 ఏళ్ల వ్యక్తి తన ప్రియురాలి గొంతు కోసి హత్య చేశాడు. అంతేకాదు ఆమె మృతదేహాన్ని తన ధాబా రిఫ్రిజిరేటర్లో ఉంచి, అదే రోజు మరో మహిళను మనువాడాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నైరుతి ఢిల్లీలోని మిత్రాన్ గ్రామానికి చెందిన నిందితుడు సాహిల్ గెహ్లాట్(Sahil Gahlot)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన ప్రేమికుల రోజున వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన నాలుగు రోజుల తరువాత మంగళవారం ఉదయం 23 ఏళ్ల మహిళ మృతదేహాన్ని ధాబా వద్ద ఉన్న రిఫ్రిజిరేటర్(refrigerator)నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరో మహిళతో పెళ్లి
మరో యువతితో పెళ్లి నిశ్చయమైందన్న విషయాన్ని నిందితుడు తన ప్రియురాలు నిక్కీ యాదవ్(nikki yadav)కు చెప్పకుండా దాచిపెట్టాడని పోలీసులు తెలిపారు. అతని పెళ్లి గురించి తెలుసుకున్న నిక్కీకి నిందితుడితో తీవ్ర వాగ్వాదం జరిగి హత్యకు దారితీసిందని అన్నారు. మరో మహిళను పెళ్లి చేసుకుంటే తనపై పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని అతని ప్రియురాలు(lover) బెదిరించడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది.
కొన్నేళ్లుగా రిలేషన్
ఇక ఈ జంట గత కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారని, ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఫిబ్రవరి 9, 10 మధ్య రాత్రి తన వివాహం గురించి అతడిని నిక్కీ ప్రశ్నించిన క్రమంలో చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. ఆ క్రమంలో అతను తన కారులోని మొబైల్ ఫోన్ డేటా కేబుల్(data cable) ఉపయోగించి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత నిందితుడు మృతదేహాన్ని(dead body) తన వాహనంలో చాలా కాలంగా పనిచేయని దాబా వద్దకు తీసుకెళ్లాడు. మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత దాబాకు తాళం వేసి తిరిగి వచ్చాడని పేర్కొన్నారు. మృతదేహం రిఫ్రిజిరేటర్((refrigerator) ) లోపల అలాగే ఉందని, క్రమంగా కుళ్ళిపోయే స్థితికి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఆమె శరీరంపై గొంతును పిసికినట్లుగా గుర్తులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అయితే హత్య జరిగిన ప్రదేశం ఇంకా నిర్ధారించలేదు.
ప్రియురాలు ఒత్తిడి
ఫిబ్రవరి 9న అతనికి నిశ్చితార్థం జరిగినప్పుడు, ఆమె అతనికి ఫోన్ చేసి ఉత్తమ్ నగర్(uttam nagar)లోని తన ఫ్లాట్‌కు రమ్మని చెప్పింది. నిందితుడు తన కారులో బాధితురాలి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆమెను తీసుకొచ్చాడు. ఆ క్రమంలో ఆమె తనని కాదని మరోకరిని పెళ్లి చేసుకోవద్దని ప్రియురాలు అతడిని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. మరోవైపు ఆమె అతనితో కలిసి గోవాకు వెళ్లాలని ముందే ప్లాన్ చేసి ఫిబ్రవరి 9న టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసులను పక్కదారి
ఫిబ్రవరి 10న సాహిల్ గెహ్లాట్ అనే వ్యక్తి తన ప్రియురాలిని హత్య(murder) చేసి, హత్య జరిగిన రోజునే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు రహస్య సమాచారం అందిందని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర సింగ్ యాదవ్(ravinder singh yadav) తెలిపారు. నిందితుడు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అతని వివరాలు తెలుసుకున్న పోలీసులు అతని గ్రామానికి చేరుకున్నారు. అతను ఇంట్లో కూడా లేకపోవడంతో సమీప ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా.. నిందితుడు కైర్ ప్రాంతంలో దొరికినట్లు అధికారులు వెల్లడించారు. విచారణ(investigation) సమయంలో నిందితుడు మొదట పోలీసులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించాడని, కానీ తరువాత అతను ఫిబ్రవరి 9, 10 మధ్య రాత్రి తన ప్రియురాలని చంపి మృతదేహాన్ని తన దాబాలో రిఫ్రిజిరేటర్లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. నిక్కీతో తనకున్న అనుబంధం గురించి చెబుతూ 2018 జనవరిలో ఉత్తమ్ నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో ఎస్ఎస్సి(SSC) పరీక్షలకు సిద్ధమవుతున్న క్రమంలో తనకు పరిచయమైందని నిందితుడు తెలిపాడు. ఆ క్రమంలో వారిద్దరూ రోజూ ఒకే బస్సులో తమ తమ ఇన్స్టిట్యూట్లకు వెళ్లేవారని, తర్వాత క్రమంగా స్నేహితులుగా మారారని, ఆ తర్వాత ప్రేమలో పడ్డారని చెప్పారు.