• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రధాని మోడీకి ప్రజల మీద ధ్యాస లేదు : కేజ్రీవాల్

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ మీద విరుచుకుపడ్డారు. మోడీకి దేశ అభివృద్ధి గురించి ధ్యాస లేదన్నారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులపైకి ఈడీ, సీబీఐ దాడులు చేసేందుకు కుట్రలు చేస్తారు. ఎమ్మెల్యేలను కొనడం, విపక్ష పార్టీల ప్రభుత్వాలను పడగొట్టాలనే ఆలోచిస్తుంటారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టించేందుకు వచ్చిందని విమర్శించ...

January 18, 2023 / 05:19 PM IST

బీజేపీకి కంటిరోగం వచ్చింది.. ఒకటే రంగు కనిపిస్తోంది

పుష్పగుచ్ఛంలో అన్నిరకాల పూలు ఉంటేనే బాగుంటుందని, కానీ బీజేపీకి ఒకే రంగు పూవు ఉండాలని ఇది సరికాదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎద్దేవా చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో తొలి మార్పుకు సంకేతమన్నారు. మనం దేశం అందమైన పూలమాల వంటిదని, అందులో అన్ని రకాల పూవులు ఉంటాయని, కానీ బీజేపీకి ఒకే రంగు పూలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. బీజేపీ కొన్నిచోట్ల దొడ్డిదారిన ...

January 18, 2023 / 05:20 PM IST

కాలేజ్ నుంచి బండి సంజయ్ కుమారుడు సస్పెండ్

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు భగీరథ్ హాట్ టాపిక్ గా మారారు. భగీరథ్ కాలేజీలో తోటి విద్యార్థిని కొడుతూ.. బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్తా పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భగీరథ్ ని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన పలు రాజకీయ పార్టీల నేతలు బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఆర్జీవీ సైతం భగీరథ్ ని నియం...

January 18, 2023 / 04:54 PM IST

మన టాస్క్ అదొక్కటే.. బీజేపీపై ఊగిపోయిన డీ రాజా

గణతంత్ర భారతం ఇప్పుడు ప్రమాదంలో ఉందని, అందుకే బీజేపీని ఓడించడమే మన ముందున్న టాస్క్ అని కమ్యూనిస్ట్ నేత డీ రాజా పిలుపునిచ్చారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరన్నారు. భారత్ లౌకికవాద దేశమని కానీ బీజేపీ హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజలకు విద్య, ఉద్యోగం కనీస అవసరాలు అన్నారు. కానీ బీజేపీ వీటిని పక్కన పెట్టి మతాన్ని బీజేపీ ఉప...

January 18, 2023 / 06:13 PM IST

బండి సాయి భగీరథ్‌కు స్టేషన్ బెయిల్

బండి సాయి భగీరథ్‌కు స్టేషన్ బెయిల్ వచ్చింది. మహీంద్రా వర్సిటీలో తోటి విద్యార్థిపై బండి భగీరథ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్ బుధవారం రోజున దుండిగల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత ఆయనకు షరతులతో కూడిన స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దాడికి సంబంధించి విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి విచ...

January 18, 2023 / 04:35 PM IST

బీజేపీని తరిమికొడదాం.. రోజులు లెక్కబెడుతోంది: అఖిలేష్ యాదవ్

బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం తెలంగాణ నుండి ప్రారంభం కావాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. తాను ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్నారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని ఆరోపించారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందన్నారు. ప్రతిపక్షాలపై దర్యాఫ్తు సంస్థలను వినియోగిస్తూ, జేబు సంస్థగా ఉపయోగించుకుంటున్నాయన్నారు. మోడీ ప్...

January 18, 2023 / 06:12 PM IST

ఖుష్బూ సీన్ల షూట్ కి అంత ఖర్చయిందా.. మరి ఎందుకు లేపేశారు?

కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ నటించిన వారిసు.. తమిళ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా.. అజిత్ ‘తునివు’ సినిమాకు పోటీగా జనవరి 11న రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్ అందుకుంది. అయితే తెలుగులో జనవరి 13న రిలీజ్ అయిన వారసుడు పెద్దగా సౌండ్ చేయలేదు. అయినా మంచి కలెక్షన్లే రాబడుతున్నాడట. ఇదిలా ఉంటే.. వారసుడు సినిమాలో 10 కోట్లు ఖర్చు పెట్టి తీ...

January 18, 2023 / 06:12 PM IST

తెలుగు నేలపై జనించి, కేంద్రంలో చక్రం తిప్పిన ఉద్దండులు

తెలుగు నేలపై జన్మించి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. ఒక్కో నేతది ఒక్కో స్టైల్ పాలిటిక్స్. ఒకరు ప్రధాని పదవీ చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి కాగా, మరొకరు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, అధికారం చేపట్టారు. ఆరు దశాబ్దాల కలను నెరవేర్చిన నేత మరొకరు. ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ఆ ముగ్గురు పీవీ నరసింహారావు, నందమూరి తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలుగు రాష్...

January 18, 2023 / 06:12 PM IST

విమానంలో ఫోన్ ఎందుకు వాడొద్దంటే.. నేపాల్ ప్రమాదంతో మళ్లీ తెరపైకి ఈ ప్రశ్న

ఇటీవల నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 72 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరగడానికి కొద్ది సెకన్ల ముందు విమానంలో పరిస్థితి ఎలా ఉంది అనే విషయం ఇప్పటికే ప్రజలు వీడియో రూపంలో బయటకు వచ్చింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పెట్టిన ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆ వీడియో బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ కి చెందిన సోను జైస్వాల్  అనే వ్యక్తి ఫోన్ […]

January 18, 2023 / 06:11 PM IST

మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేరళ సీఎం

ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ పెడరల్ స్ఫూర్తికి భిన్నంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. కార్పోరేటర్లకు కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సి ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ అద్భుతంగా పోరాడుతున్నారని, ఈ పోరాటం తెలంగాణ నుండే ప్రారంభం కావాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు అందరూ బీజేపీకి వ్యతి...

January 18, 2023 / 06:11 PM IST

టీడీపీ ఒక పార్టీ మాత్రమే కాదు..: బాలకృష్ణ

తెలుగుదేశం కేవలం ఓ పార్టీ మాత్రమే కాదని, ఇది ఒక పెద్ద వ్యవస్థ అని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీకి ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆ...

January 18, 2023 / 02:54 PM IST

‘ఆదిపురుష్‌’ పై మళ్లీ ట్రోలింగ్!

ప్రభాస్ నటిస్తున్నఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్.. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే టీజర్‌లో గ్రాఫిక్స్ చూసిన నెటిజన్స్.. దర్శకుడిపై మండిపడ్డారు. ఇదేం గ్రాఫిక్స్.. ఇదేం సినిమా.. అని తేల్చేశారు. దాంతో ఎప్పటిలాగే మరోసారి ఆదిపురుష్‌ని పోస్ట్ పోన్ చేశారు. జనవరి 12 నుంచి జూన్‌ 16కి వాయిదా వేశాడు. వీఎఫ్‌ఎక్స్ బెటర్మెంట్ కోసం మరింత సమయం క...

January 18, 2023 / 02:53 PM IST

నా మాటలు వక్రీకరించారు.. నేనలా అనలేదు: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల ఎమ్మెల్యేలను మార్చాలని అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాను అలా అనలేదని మంత్రి క్లారిటీ ఇస్తున్నారు. మరో 20 మంది ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేయాలని చెప్పానని తెలిపారు. తన మాటలను మార్చారని పేర్కొన్నారు. కష్టపడాలని చెబితే.. మార్చాలని అన్నట్టు వక్రీకరించారని మండిపడ్డారు. తాను అలా అనలేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 80 సీట్లు పక్కగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోం...

January 18, 2023 / 02:51 PM IST

తెలంగాణపై బీజేపీ లెక్క సరిపోతుందా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. 2023లో తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికలు ఉండగా, చివరగా డిసెంబర్ నెలలో తెలంగాణలో జరగనున్నాయి. మరో పది నెలలు ఉన్న సమయంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. తనను తాను జాతీయ నేతగా ప్రమోట్ చేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే, బీజేపీ కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా గట్టెక్కా...

January 18, 2023 / 02:27 PM IST

తీవ్ర విషాదంలో రఘు కుంచె

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు రఘు కుంచె కుటుంబంలో విషాదం నెలకొంది. రఘు తండ్రి కుంచె లక్ష్మీనారాయణ రావు (90) మంగళవారం కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడకు చెందిన లక్ష్మీనారాయణరావు హోమియో వైద్యుడు. స్థానిక సాగునీటి సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. లక్ష్మీనారాయణ రావుకు భార్య వరహాలమ్మ, కుమారుడు రఘు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాల మధ్య జరిగిన మరుసటి...

January 18, 2023 / 02:15 PM IST