• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘పదివేల సభ్యత్వాల నమోదు లక్ష్యం’

SKLM: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామని నరసన్నపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బలగ ప్రవీణ్ తెలిపారు. గురువారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. గతంలో 3300 సభ్యత్వాలు నమోదు చేశామన్నారు. అధినేత ఆదేశాల మేరకు మార్చి పదో తేదీ లోగా 10 వేల సభ్యత్వాలు లక్ష్యంగా చేసుకోవడం జరిగిందని వివరించారు.

February 26, 2026 / 09:30 AM IST

మదనపల్లెలో పోలీసుల కార్డెన్ సెర్చ్

అన్నమయ్య: మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ఆధ్వర్యంలో 150మంది పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, ఎస్టీఎఫ్, స్పెషల్ పార్టీ సిబ్బందితో రంగంలోకి దిగారు. కాట్లాటపల్లి, రోడ్డు, రామిరెడ్డిలేఔట్లో ప్రతి ఇంటిని పరిశీలించారు. 20 బైక్లను సీజ్ చేశారు.

February 26, 2026 / 09:30 AM IST

మానవత్వం చాటుకున్న అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ

KRNL: అస్వస్థతతో మృతి చెందిన గుర్తుతెలియని అనాధ వ్యక్తికి పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు మానవతా దృక్పథంతో అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. ఎమ్మిగనూరు (మం) గోనెగండ్ల బైపాస్ రోడ్ హిందూ స్మశాన వాటికలో పూలమాలలు వేసి అంతక్రియలు పూర్తి చేశారు. సింగనేటి నరసన్న మహారాజ్ ఆధ్వర్యంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 26, 2026 / 09:30 AM IST

GOOD NEWS: బస్సు ఛార్జీలు తగ్గింపు

TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో డీలక్స్ బస్సులు, ఈ-మెట్రో AC సర్వీసుల్లో టికెట్ ధరలను తగ్గిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. మార్చి 1 నుంచి మే ఆఖరు వరకు తగ్గింపు ధరలు అమల్లో ఉండనున్నాయి. మెట్రో డీలక్స్ బస్సులో గతంలో 4 కి.మీల ప్రయాణానికి రూ.30 ఛార్జీ ఉండగా.. ప్రస్తుతం రూ.25కి తగ్గింది. అదే దూరానికి ఈ-మెట్రో AC సర్వీసులో గతంలో రూ.35 ఉండగా రూ.25కి తగ్గించారు.

February 26, 2026 / 09:30 AM IST

అసెంబ్లీ క్రీడా పోటీల్లో క్యారమ్స్ విజేతగా నిలిచిన ఎమ్మెల్యే

TPT: సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అసెంబ్లీ క్రీడా పోటీల్లో క్యారమ్స్ విజేతగా నిలిచారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన క్యారమ్స్ సింగిల్స్ పోటీల్లో పాల్గొన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అత్యంత ప్రతిభ కనబరచి విజేతగా నిలిచారు.

February 26, 2026 / 09:28 AM IST

పంచాయతీ బకాయిలు రావడంలేదని ఆందోళన

GDWL: ఇటిక్యాల మండలంలో పంచాయతీల బకాయిలు విడుదలకావడంతో క్రిత సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలను నెట్టుకుంటున్నారు. 32 గ్రామాలు ఉన్న మండలంలో ఒక్కో పంచాయతీకి సుమారు రూ.20–25 లక్షల బకాయిలు రావాల్సినప్పటికీ, పారిశుద్ధ్య, సీసీ రోడ్, ట్రాక్టర్ పనులకు ఖర్చు చేసిన పెండింగ్ బిల్లులు ఇంకా రావడం లేదని అధికారులు, సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

February 26, 2026 / 09:28 AM IST

HYDలో మసాజ్ పేరుతో వ్యభిచారం..!

HYD: మహానగరంలో “మసాజ్ సెంటర్ల” పేరుతో వ్యభిచారం నడుస్తున్నట్లు పలు కేసుల్లో వెలుగుచూసింది. రూ. లక్ష వరకు ఇస్తామని చెప్పి బంగ్లాదేశ్, థాయిలాండ్ ప్రాంతాల నుంచి మహిళలను నిర్వాహకులు రప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యూటీ పార్లర్ ముసుగులోనూ ఈ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇలాంటి వాటిపై పోలీసులు నిరంతర నిఘా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.

February 26, 2026 / 09:26 AM IST

కలుషిత నీటి తొట్టెతో కాలనీవాసుల్లో ఆరోగ్య ఆందోళన

VKB: పులుమడ్డిలోని ఎస్సీ కాలనీలో తాగునీటి తొట్టె నెలలుగా శుభ్రం చేయకపోవడంతో నీరు నాచుపట్టి దోమల పెంపక కేంద్రంగా మారింది. దీనివల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు. సమస్యపై పలుమార్లు తెలియజేసినా స్పందన లేదని తెలిపారు. వెంటనే తొట్టెను శుభ్రం చేసి స్వచ్ఛమైన నీరు అందించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

February 26, 2026 / 09:23 AM IST

ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప అవార్డు బృందం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను బుధవారం కాయకల్ప అవార్డు బృందం సందర్శించారు. డాక్టర్ విజయ శంకర్ ఆధ్వర్యంలోని బృందం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు, ఆస్పత్రిలో మౌలిక వసతులు, మందుల నిలువలు, శుభ్రత, శానిటేషన్, ప్లాంటేషన్, పరిసరాల పరిశుభ్రతను వారు పరిశీలించారు.

February 26, 2026 / 09:23 AM IST

నెల్లూరుకు వైఎస్ జగన్

AP: మాజీ సీఎం జగన్ ఇవాళ నెల్లూరులో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన నెల్లూరుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం తిరుగు పయనమవుతారు.

February 26, 2026 / 09:22 AM IST

BREAKIN: భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

TG: రాష్ట్రంలో 45 మంది IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ స్పెషల్ CSగా సంజయ్ కుమార్, ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్, ఎండోమెంట్ కమిషనర్‌గా హనుమంతరావు, ఫైనాన్స్‌శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్, హనుమకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్ బదిలీ అయ్యారు.

February 26, 2026 / 09:21 AM IST

బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి బదిలీ

VZM: బొబ్బిలి డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జీ. భవ్యారెడ్డిని అమరావతిలోని DGP కార్యాలయానికి బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 2018 గ్రూప్-1 అధికారులపై వచ్చిన ఆరోపణలపై వాళ్ళందరిని ఆప్రధాన్యత కలిగిన పోస్టులలో ఉంచాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమెను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

February 26, 2026 / 09:20 AM IST

ఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు ట్యాబ్‌లు అందజేత

కడప జిల్లాలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ అభ్యర్థులు ఓబులేసు, హర్షసాయి వర్ధన్‌లకు బుధవారం కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి UPSC ప్రిలిమ్స్ కోచింగ్ కోసం డిజిటల్ ట్యాబ్‌లను అందజేశారు. ఈ ట్యాబ్‌లలో UPSC స్టడీ మెటీరియల్ ముందుగానే ఇన్‌బిల్ట్ చేయబడి ఉంది. ఇది వారి సివిల్స్ ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

February 26, 2026 / 09:20 AM IST

మాదకద్రవ్యాల రవాణాపై గట్టిగా నిఘా పెట్టాలి: కలెక్టర్

MBNR: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో విద్య పోలీసు ఎక్సైజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హై స్కూల్ ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థుల కార్యకలాపాలపై పర్యవేక్షణ కొనసాగించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

February 26, 2026 / 09:20 AM IST

సీతానగరం రోడ్డుపై ప్రయాణం ఇక సుఖవంతం

EG: సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి సీతానగరం వరకు గురువారం తారురోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. గత 6,7 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పెద్దపెద్ద గోతులతో గుంతలమయంగా ఉండేదని స్కూల్ విద్యార్థులు, వ్యవసాయ కూలీలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొనేవారమని స్థానికులు వాపోతున్నారు. ఈ రహదారి అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే బలరామకృష్ణకి అభినందనలు తెలిపారు.

February 26, 2026 / 09:19 AM IST