CTR: నివాసాల ప్రదేశంలో నిర్మిస్తున్న పాల డైరీ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఆ ప్రాంతవాసులు కోరారు. శుక్రవారం MPDO అప్పాజీకి వినతి పత్రం అందజేశారు. పుంగనూరు మండలం రాంపల్లి సమీపాన గల వెంకటాద్రి కాలనీలో పాల డైరీ నిర్మిస్తున్నారని చెప్పారు. డైరీలో నుంచి బయటకు వచ్చే వ్యర్థపు నీటి వల్ల దోమలు తీవ్రత ఎక్కువ అవుతాయని స్థానికులు తెలిపారు.
NZB: మోపాల్ మండలం కంజర తెలంగాణ సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను పీఎంశ్రీ సభ్యుడు ఐడీఏఎస్ జాయింట్ సెక్రటరీ దేవేందర్ కుమార్ రాయ్ ఇవాళ సందర్శించారు. విద్యార్థినులతో సంభాషించి పాఠశాలలో అమలవుతున్న పీఎంశ్రీ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ విజయ లలితను అభినందించారు.
గుంటూరు: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం తొలి సమీక్షా సమావేశం జరిగింది. సంస్థ చైర్‌పర్సన్ భీమనేని వందనాదేవి, కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ దీన్ని నిర్వహించారు. పాత ఫర్నిచర్ తొలగింపునకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని, సెస్ నిధులు సంస్థకు జమ అయ్యేలా చూడాలని ఛైర్‌పర్సన్ ఆదేశించారు. సిబ్బందికి డిజిటల్ బోర్డులు అందజేశారు.
TG: హైదరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హోటల్స్ కిచెన్‌లలో సీసీ కెమెరాలు పెట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలన్నారు. హోటల్స్‌కు రేటింగ్, సర్టిఫికేట్ ఇచ్చే విధానాన్ని పరిశీలించాలన్నారు.
కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో పరిపాలన ప్రధాన కార్యదర్శి శ్యామలరావు అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి 1వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ రాష్ట్ర పర్యటనలో భాగంగా విచ్చేయనున్న సందర్భంగా, గన్నవరం విమానాశ్రయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
HYD: పురగిరి క్షత్రియ పెరికకుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డాక్టర్ బొలిశెట్టి సతీష్ వర్మ అధ్యర్యంలో రేపు (శనివారం) మధ్యాహ్నం 3:00 గంటలకు సమావేశం జరగనుంది. కావున ఈ సమావేశానికి పెరిక కుల సంఘం నాయకులు, యువకులు మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయనా కోరారు.
PLD: పెదకూరపాడులో వ్యవసాయ కూలీలు ప్రమాదపరితంగా ట్రాక్టర్‌ఫై శుక్రవారం సాయంకాలం ప్రయాణం చేస్తున్నారు. ట్రాక్టర్కు ఇరువైపులా ఉన్న డోర్లను తీసివేసి ఓవర్ లోడ్‌తో కూర్చోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానిక ప్రజలన్నారు. రైతులకు, ట్రాక్టర్ యాజమాన్యానికి పోలీస్ అధికారులు అవగాహన కల్పించాలని వారు కోరారు.
NTR: కొండపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎండ్లూరి సుబ్బానాయుడు గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన భౌతికకాయంపై టీడీపీ జెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
PLD: ఈపూరు ప్రసన్నాంజనేయ స్వామివారి తిరుణాల మార్చి 1న ఘనంగా జరగనుంది. భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, ఎస్సై కె. వేణుగోపాల్ శుక్రవారం పరిశీలించి భద్రతా సూచనలు జారీ చేశారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా హాజరుకానున్నారు. భక్తులు పాల్గొని తిరునాళ్ళను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
TG: మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ రీజియన్ లో శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మున్సిపల్ అధికారులు మార్క్ చేసిన చోటే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వీధిదీపాలకు ప్రత్యేక నంబర్ ఇచ్చి డ్యాష్ బోర్డుకు కనెక్ట్ చేయాలన్నారు.
BHNG: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ అనురాగ్ జయంతి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజా ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు పారదర్శకంగా పేదలకు చేరేలా, అర్హులైన వారికి లబ్ది జరిగేలా పని చేయాలని ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్‌కు సూచించారు.
MBNR: సెక్రటేరియట్‌లో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని కొత్తకోట, దేవరకద్ర, భూత్పూర్ మూడు మున్సిపాలిటీలలో అలాగే చిన్న చింతకుంట, అడ్డాకుల, మూసాపేట్ మండల కేంద్రాలలో మినీ షాది ఖానాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
TPT: మామండూరు జలపాతంలో ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందిన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. తిరుపతి మంగళానికి చెందిన దిలీప్(19)సహా ఐదుగురు బీటెక్ విద్యార్థులు మామండూరు జలపాతానికి వెళ్లారు. అక్కడ ఈత రాని దిలీప్ అనుకోకుండా నీటిలో మునిగి మృతి చెందాడు. స్నేహితులు, స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. దీనిపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
PDPL: రామగుండం మండల కేంద్రంలోని టీజీ మోడల్ స్కూల్లో ఆరో తరగతితో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 28తో ముగియనుంది. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సదానందం యాదవ్ తెలిపారు. వోసీ విద్యార్థులకు రూ. 200, ఇతరులకు రూ. 125 ఫీజు ఉంటుందని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న నిర్వహిస్తామన్నారు
SRD: మార్చి 13న సాయంత్రం ఐదు గంటలకు నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగనుంది. గత 27 సంవత్సరాలుగా ప్రతి ఏడాదీ ఇలాంటి విందు నిర్వహిస్తున్నట్లు గూడెం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సమావేశంలో ముస్లిం మత పెద్దలు, సీనియర్ నాయకులు పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు.