• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రంజాన్ ఉపవాస దీక్షలో పాల్గొన్న ఎంపీ

VZM: గరివిడిలోని మసీదులో జరిగిన పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసిన ఆయన, అల్లా దీవెనలు అందరికీ మెండుగా లభించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

March 4, 2026 / 02:40 PM IST

లైన్ మెన్ దినోత్సవం.. విద్యుత్ సిబ్బందికి సన్మానం

JGL: భీమారంలో ‘లైన్ మెన్ దినోత్సవం’ సందర్భంగా విద్యుత్ శాఖ లైన్‌మెన్లను సర్పంచ్ స్వాతి సంజీవ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధిలో విద్యుత్ సిబ్బంది పాత్ర కీలకమని, ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో వారు చూపుతున్న అంకితభావాన్ని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

March 4, 2026 / 02:36 PM IST

నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో హోలీ సంబరాలు

NLG: నల్గొండలోని టూటౌన్ పోలీస్ స్టేషన్లో హోలీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. SI సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మనగుడి జనార్ధన్, ప్రధాన కార్యదర్శి తరాల పరమేష్, స్థానిక ప్రముఖులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. అందరూ పరస్పరం రంగులు చల్లుకుంటూ హర్షాతిరేకంగా శుభాకాంక్షలు తెలియజేసి ఐక్యతను ప్రదర్శించారు.

March 4, 2026 / 02:34 PM IST

కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

WGL: కొమ్మాల జాతర సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గం తన అడ్డా అని, వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె సుస్మిత పటేల్ పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. సుస్మిత తనకంటే ధైర్యవంతురాలని, కార్యకర్తలకు సమస్య వస్తే ఎంతటివారినైనా ఎదుర్కొంటుందని భరోసా ఇచ్చారు.

March 4, 2026 / 02:33 PM IST

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక షెడ్యూల్

GDWL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గద్వాల కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా తెలిపారు. 5 దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న గ్రామ, 16న మండల, మే 2న నియోజకవర్గ, మే 22న జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించి, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుతామని చెప్పారు.

March 4, 2026 / 02:32 PM IST

ట్రాన్స్‌ఫార్మర్‌లు కాపాడేందుకు పకడ్బందీ చర్యలు: SE

PDPL: వర్షాకాలంలో పిడుగులు, మెరుపుల నుంచి విద్యుత్తు లైన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లను కాపాడేందుకు పెద్దపల్లి సర్కిల్లో పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఎస్ఈ గంగాధర్ తెలిపారు. కీలక ప్రాంతాల్లో 122 లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేశామని, అధిక వోల్టేజ్‌ను భూమిలోకి మళ్లించి బ్రేక్ డౌన్‌లను నివారిస్తాయని పేర్కొన్నారు. తద్వారా అంతరాయం లేని విద్యుత్ అందుతుందన్నారు.

March 4, 2026 / 02:32 PM IST

రైలు ప్రయాణికురాలికి ‘108′ అండ

WGL: హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న పింకీ సహా అనే మహిళ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆమె పరిస్థితి విషమంగా మారింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది కాజీపేట రైల్వే స్టేషన్‌కు వెంటనే చేరుకుని ఈఏంటి చైతన్య, పైలట్ కుమారస్వామి తక్షణమే స్పందించి ఆమెకు అత్యవసర చికిత్స అందించారు.

March 4, 2026 / 02:32 PM IST

‘రైతు భరోసా నిధులు విడుదల చేయాలి’

MHBD: యాసంగి రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని CPI స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుధాకర్ రెడ్డి అన్నారు. కురవిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మార్క్ ఫెడ్ సంస్థతో మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తూ రైతు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

March 4, 2026 / 02:31 PM IST

‘ప్రమాదంలో గాయపడిన వారిని ఆదుకోండి’

నెల్లూరు 53 డివిజన్ పరిధిలోని కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిద్రమత్తులో భారీ ట్యాంకర్ ఇంట్లో దూసుకుని వెళ్లి మౌలాలి మస్తానమ్మకు గాయాలైన విషయం తెలిసిందే. వారికి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని చెప్పారు. పేదవారు కావడంతో వైద్య ఖర్చులకు కష్టతరంగా ఉందని పాలకులు స్పందించి వారికి అండగా నిలవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

March 4, 2026 / 02:30 PM IST

ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు

JGL: వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేట గ్రామంలోని నాగపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆశీస్సులు పొందారు.

March 4, 2026 / 02:30 PM IST

బోనకల్ పీహెచ్సీలో అపరిశుభ్రత.. రోగుల అవస్థలు

KMM: బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఆసుపత్రి ప్రాంగణంలో పిచ్చిమొక్కలు, ఎండిన ఆకులు కుప్పలుగా పడి ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య సూత్రాలు చెప్పాల్సిన చోటే అపరిశుభ్రత రాజ్యమేలడంపై ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే వ్యర్థాలను తొలగించి ప్రాంగణాన్ని శుద్ధి చేయాలని కోరారు.

March 4, 2026 / 02:30 PM IST

మంత్రి సవితకు వినతుల వెల్లువ

సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి ఎస్.సవితను పలువురు సందర్శకులు, కూటమి నాయకులు కలిశారు. తమ ప్రాంతాల్లోని పలు సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. బాధితుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి, వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

March 4, 2026 / 02:30 PM IST

హెల్మెట్ వినియోగంపై అవగాహన

KRNL: తుగ్గలి(మం) జొన్నగిరి ప్రధాన రహదారిపై ఎస్సై మల్లికార్జున ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ.. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

March 4, 2026 / 02:30 PM IST

లింగాలపాడులో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన

NTR: నందిగామ మండలం లింగాలపాడులో పల్లె పండగ 2.Oలో భాగంగా MGNREGS నిధులతో నిర్మిస్తున్న CC రోడ్డును మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్.వి.యస్. ప్రసాదరావు పరిశీలించారు. పనులు నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ, డిప్యూటీ ఎంపీడీఓ(PR), సిబ్బంది పాల్గొన్నారు.

March 4, 2026 / 02:30 PM IST

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ UPDATE

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఎలాంటి విజువల్స్ లీక్ కాకూడదని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్‌ను విడుదల చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ పోస్టర్ అభిమానుల్లో ఒక్కసారిగా భారీ ఇంపాక్ట్ ఇచ్చేలా ఉండబోతుందని టాక్.

March 4, 2026 / 02:30 PM IST