GNTR: ఈ నెల 8న అమరావతిలోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరగనుంది.సీఎం చంద్రబాబు పాల్గొనే ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధి కోసం 36 ఎంఓయులు చేసుకోవడంతో పాటు, 4 ఎన్ఆర్ఎల్ఎం క్లస్టర్లు ప్రారంభించనున్నారు.అలాగే డ్వాక్రా సంఘాలకు చెక్కులు, అర్హులైన మహిళలకు వాహనాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రులు సవిత, గుమ్మడి సంధ్యారాణి గురువారం వెల్లడించారు.
JGL: బుగ్గారం మండలం చిన్నాపూర్లో దాడి ఘటనపై ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. దమ్మ లక్ష్మి ఫిర్యాదు మేరకు గట్టు గంగారం బస్ స్టాండ్ వద్ద దమ్మ తిరుపతిని కులం పేరుతో దూషించినట్లు తెలిపారు. అనంతరం గట్టు గంగారం తన తమ్ముడు గట్టు గంగాధర్, కుమారుడు గట్టు గణేష్తో కలిసి గ్రామ శివారులోని ఓ షెడ్ వద్ద తిరుపతిపై దాడి చేసి గాయపరిచినట్లు పేర్కొన్నారు.
AKP: అక్రమంగా నిల్వ చేసిన 100 టేకు దుంగలను ఫారెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. మాకవరపాలెం మండలంలోని సీతన్నఆగ్రహారం వెళ్లే రహదారి పక్కన ఉన్న తోటల్లో టేకు దుంగలు నిల్వ చేసినట్టు అందిన సమాచారంతో గురువారం తనిఖీలు చేసి వీటిని స్వాధీనం చేసుకున్నారు. అపరాధ రుసుము విధిస్తామని ఫారెస్ట్ బీట్ అధికారి మోహనరావు తెలిపారు.
ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పింఛన్ సేవలపై డిప్యూటీ కమిషనర్ సమీక్ష నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు సకాలంలో అందేలా చూడాలని, వెరిఫికేషన్ ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు. పారదర్శకతతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో వార్డు అధికారులు, ఆర్‌ఓలు (ROs) పాల్గొన్నారు.
KMR: నస్రుల్లాబాద్ మండలం దుర్కికి చెందిన చిన్న మొగులయ్య నిన్న రాత్రి ఇంట్లో రొట్టె ముక్కలు తిని, గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక బయటకు వచ్చి రోడ్డుపై పడి మృతి చెందాడు. రొట్టె ముక్క వలన..? ఇతర కారణాల అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేశామని గురువారం ఎస్సై రాఘవేంద్ర తెలిపారు.
రోజురోజుకు సైబర్ క్రైమ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ దోచుకుంటున్నారు. హ్యాకర్లు ఇప్పుడు మనుషుల మనస్తత్వాలను కూడా అంచనా వేస్తూ పిన్ నంబర్లను హ్యాక్ చేస్తున్నారు. వరుస అంకెలు: 1234, 4321, 5678 వంటివి హ్యాకర్లు మొదట ప్రయత్నించే నంబర్లు. ఒకే అంకె: 1111, 2222, 0000, 5555 వంటివి అస్సలు పెట్టకూడదు. ఇవి అత్యంత బలహీనమైన పిన్ నంబర్లు.
PDPL: గోదావరిఖని 8వ కాలనీకి చెందిన తమ్మిశెట్టి అమృతమ్మ గుండెపోటుతో మృతి చెందారు. గురువారం పుట్టెడు దుఃఖంలో కుటుంబ సభ్యులు నేత్ర దానానికి అంగీకరించారు. హైదరాబాద్ LV ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ మృతురాలి కార్నియాను సేకరించి హైదరాబాద్ ఐ బ్యాంకుకు తరలించారు. ఆ తల్లి నేత్రాలు మరో ఇద్దరికి ఉపయోగపడటం పట్ల కుటుంబ సభ్యులను అభినందించారు.
ADB: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టి.జి.ఎం.డి.సి) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్ట్ అధికారి వంగా వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ను శాలువాతో సత్కరించి మొక్కను అందజేశారు. జిల్లాలోని అందుబాటులో ఉన్న ఖనిజ సంపద పలు అంశాలపై చర్చించారు.
PPM: కురుపాం MLA తోయక జగదీశ్వరీ గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును విజయవాడలో ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కావడంతో రైతుల అభివృద్ధికు మరిన్ని రాయితీలను అందించాలని కోరనట్లు ఆమె తెలిపారు.
WGL: ఈనెల 14న నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్ ను ఈనెల 28కి వాయిదా వేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఆస్తి పంపకాలు, డబ్బుకు సంబంధించిన సివిల్ కేసులు తదితర పెండింగ్ వివాదాలను ఇందులో పరిష్కరించుకోవచ్చని గురువారం అధికారులు తెలిపారు.
KKD: పిఠాపురం మండలం పి.దొంతమూరు గ్రామ శివారు పామాయిల్ తోటలో అక్రమంగా నిల్వ ఉంచిన 92 కేజీల గంజాయిని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. పక్కా ప్రణాళికతో నిఘా పెట్టి గంజాయిని పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ELR: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే వాట్సాప్ గవర్నెన్స్ పై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. పదేళ్లుగా వినియోగంలో లేని ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాలను వెంటనే రద్దు చేయాలన్నారు. ఆయా ఖాతాల్లోని నిధులను ప్రభుత్వ ప్రధాన ఖాతాకు జమ చేయాలన్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత అమ్మాయిలు ఇవాళ్టి నుంచి ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్‌లో తలపడనున్నారు. మ్యాచ్ పెర్త్ వేదికగా ఉ.10:50 గంటలకు ప్రారంభమవుతుంది. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 6 సిరీస్‌ల్లో భారత్ ఒక్కటే గెలిచింది. మరో 2 డ్రా కాగా.. 3 కంగారూల సొంతమయ్యాయి. ఈ పర్యటనలో ఇప్పటికే T20, వన్డే సిరీస్‌లను కోల్పోయిన భారత్ ఇందులోనైనా రాణించాలని చూస్తోంది.
WG: భీమవరం వన్ టౌన్ పరిధిలోని మారుతీ టాకీస్ సమీపంలో గులాబీ సెంటర్ వద్ద తప్పిపోయి ఏడుస్తున్న ఏడేళ్ల చిన్నారిని గురువారం పోలీసులు సురక్షితంగా తల్లి చెంతకు చేర్చారు. డయల్ 112 ద్వారా సమాచారం అందుకున్న సీఐ నాగరాజు తక్షణమే స్పందించి పాపను అనునయించారు. అనంతరం ఆ చిన్నారి సర్రాజు వీధికి చెందిన సోడాదాసి మాధవి కుమార్తెగా గుర్తించి ఆమెకు అప్పగించారు.
KMR: తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGEWIDC) కామారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఈఈ అశోక్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విద్యాసంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై చర్చించారు.