• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మందకృష్ణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

కోనసీమ: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగపై చర్యలు తీసుకోవాలని సఖినేటిపల్లి మండలం ఎస్సీ వెల్ఫేర్ సభ్యులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఎస్సై దుర్గా శ్రీనివాస్‌కు ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షుడు ప్రతాప్ పిర్యాదు చేశారు. మందకృష్ణపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.

February 21, 2026 / 02:34 PM IST

వ్యర్థ నిర్వహణ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్

TPT: స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లె లోని వ్యర్థ నిర్వహణ ప్లాంట్‌ను శనివారం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనితీరును పరిశీలించి, వ్యర్థాల వేరు వేరు సేకరణ, శుభ్రత పరిరక్షణపై అధికారులకు సూచనలు చేశారు. స్థానిక ప్రజలకు వ్యర్థాల వర్గీకరణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

February 21, 2026 / 02:34 PM IST

టెక్నాలజీతో నేరాలకు చెక్: ఐజీ అశోక్ కుమార్

WG: పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్నా సాంకేతికతతో అధిగమిస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ జివిజీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం అచంటలో ఆయన మాట్లాడారు. నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాలు, ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, డ్రంక్ అండ్ డ్రైవ్, బైక్ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.

February 21, 2026 / 02:34 PM IST

మేరికపూడిలో పొలంబడి కార్యక్రమం

GNTR: ఫిరంగిపురం మండలంలోని మేరికపూడి గ్రామంలో శనివారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వాసంతి పాల్గొని రైతులకు పంట పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఎంపిక చేసిన 30 మంది రైతులకు శనగ పంటలో కనిపించే ఎండు తెగులు, వివిధ చీడపీడల నివారణ చర్యలు, పోషక యాజమాన్యంపై సూచనలు చేశారు.

February 21, 2026 / 02:33 PM IST

టీమిండియా ఫాస్ట్ బౌలర్‌కు గాయం

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పాండ్యా కొట్టిన బంతి.. సిరాజ్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో అతడికి చికిత్సను అందించాడు. అనంతరం సిరాజ్ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే, సిరాజ్ గాయం తీవ్రతపై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు.

February 21, 2026 / 02:33 PM IST

కరెంటు షాక్‌తో అడవిపంది మృతి

KDP: మైదుకూరు మండలం గంజిగుంట ఫారెస్ట్ పరిధిలో విద్యుత్ షాక్‌తో అడవిపంది శనివారం మృతి చెందింది. ఫారెస్ట్ ఆఫీసర్ చలపతి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించగా, పంది కాళ్లు, మాంసం లభ్యమయ్యాయి. కరెంటు తీగలు అమర్చిన పొలం యజమానిని అధికారులు విచారిస్తున్నారు. రైతులు పొలాల వద్ద విద్యుత్ తీగలు ఏర్పాటు చేయరాదని, వన్యప్రాణులు మృతి చెందితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరు.

February 21, 2026 / 02:32 PM IST

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందింపు

NRPT: గుండుమాల్ మండలం భక్తి మల్ల గ్రామంలో ఎస్ఈ నవీన్ కుమార్ శనివారం ‘ప్రజా బాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసి, రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. సర్పంచ్ జ్యోతి శ్రీకాంత్, బానోదయ్, అరుణ్, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 21, 2026 / 02:32 PM IST

క్రికెట్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న MLA

ASF: కాగజ్ నగర్ మండలం భట్టుపల్లిలో గత వారం రోజులుగా జరుగుతున్న ట్రై విలేజ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవాల్లో శనివారం MLA హరీష్ బాబు పాల్గొన్నారు. విన్నర్స్‌గా నిలిచిన అందవెల్లి, రన్నర్‌గా నిలిచిన భట్టుపల్లి జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. మాజీ MPTC పిరిసింగుల తిరుపతి, కౌన్సిలర్ చిప్పకుర్తి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 02:31 PM IST

‘ఆశా కార్మికులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి’

ఖమ్మం జిల్లాలో ఆశా కార్యకర్తలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పిన్నింటి రమ్య డిమాండ్ చేశారు. డీఎంహెచ్‌వో రాంబాబుకు వినతిపత్రం అందజేసిన ఆమె.. పీహెచ్‌సీల్లో కొందరికే పారితోషికాలు ఇచ్చి, మిగిలిన వారిని విస్మరించడం సరికాదన్నారు. ఈ నెల 23న ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

February 21, 2026 / 02:30 PM IST

నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యం: కలెక్టర్

కర్నూలు : పౌరుల బాధ్యతాయుత సహకారంతోనే నదుల సంరక్షణ ఫలప్రదమవుతుందని, నదులను కాపాడటం ప్రతి పౌరుని కర్తవ్యం అని జిల్లా కలెక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. శనివారం వినాయక ఘాట్ సమీపంలో కెసి కెనాల్‌లో కొనసాగుతున్న శుభ్రత పనులను నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

February 21, 2026 / 02:30 PM IST

ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం: MLA

ADB: గ్రామస్తులందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అని బోథ్ MLA అనిల్ జాదవ్ అన్నారు. శనివారం తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో నిర్వహించిన సాయిబాబా ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.

February 21, 2026 / 02:30 PM IST

రెగ్యులేటర్ పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ

కృష్ణా: గుడివాడ మండలం మోటూరు గ్రామంలో రెగ్యులేటర్ పునః నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఈ రెగ్యులేటర్ పునః నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాంతీయ రైతులకు నీటి సరఫరా మెరుగుపడి వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

February 21, 2026 / 02:28 PM IST

‘వసతి గృహాల్లో పడకేసిన పర్యవేక్షణ’

NGKL: జిల్లాలోని వసతి గృహాల్లో పర్యవేక్షణ కరువైందని బీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సాయిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఈ మేరకు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఉమాపతికి వినతిపత్రం అందజేశారు. అధికారులు సమయపాలన పాటించకపోవడం వల్ల విద్యార్థులు రాత్రివేళల్లో బయట తిరుగుతున్నారని, మెనూ సరిగ్గా అమలు కావడం లేదని ఆరోపించారు.

February 21, 2026 / 02:27 PM IST

గోవింద్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి

MHBD: కురవి మండలం పెద్దతండలో గోవింద్ స్మారక విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. గుగులోతు విజయ్- దుర్గ కుమారుడు గోవింద్ సంవత్సరం క్రితం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన జ్ఞాపకార్థం గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఈరోజు ఆవిష్కరించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై గోవింద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

February 21, 2026 / 02:26 PM IST

మాజీ ఎమ్మెల్యేకు ‘మోదీ 2.0’ పుస్తకం అందజేత

NGKL: కల్వకుర్తికి చెందిన స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు శివకుమార్ ఇటీవల జాతీయ యువజన అవార్డు సాధించినందుకు గాను అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు శనివారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శివకుమార్.. మాజీ ఎమ్మెల్యేకు వివేకానంద సేవా కార్యక్రమాల బ్రోచర్‌తో పాటు ‘నరేంద్ర మోదీ 2.0’ పుస్తకాన్ని అందజేశారు.

February 21, 2026 / 02:25 PM IST