• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో బెల్లంపల్లి విద్యార్థిని

MNCL: అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో ప్రతిభ చూపడం అద్భుతమని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తెలిపారు. నేపాల్లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో బెల్లంపల్లికి చెందిన లాస్య శ్రీ, శ్రీనిథ్ సాయి, ప్రమోద్ కుమార్ భారతదేశం తరఫున బహుమతులు సాధించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సబ్ కలెక్టర్ సూచించారు.

February 25, 2026 / 08:29 AM IST

జిల్లా స్థాయిలో మొదటి స్థానం.. అభినందించిన ఎంఈవో

VKB: బొంరాస్పేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి అఖిల్ ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ విభాగంలో వికారాబాద్ జిల్లా స్థాయిలో మొదటి స్థానం కైవసం చేసుకోవడం పట్ల మంగళవారం ఎంఈవో హరిలాల్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్, భవాని, కాశయ్య, మల్లయ్య, అనిల్ కుమార్ కలిసి విద్యార్థిని అభినందించారు.

February 25, 2026 / 08:29 AM IST

గన్నవరం రైతు బజార్‌లో నేటి కూరగాయల ధరలు

కృష్ణా: గన్నవరం రైతు బజార్‌లో బుధవారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట రూ.14, వంకాయ రూ. 18-20, పచ్చిమిర్చి రూ. 38, కాకర రూ. 32, బీర రూ. 24గా ఉన్నాయి. ఫ్రెంచ్ బీన్స్ రూ. 53, క్యాప్సికం రూ. 59, కీర దోస రూ. 41, చింతకాయలు రూ. 65గా అమ్ముడవుతున్నాయి. కాలిఫ్లవర్ ఒక్కటి రూ.15–20, కాబేజీ రూ.15, క్యారెట్ రూ.27, బంగాళాదుంప రూ.22, ఉల్లిపాయలు రూ. 23గా విక్రయిస్తున్నారు.

February 25, 2026 / 08:24 AM IST

ప్యాలెస్‌ను తలపిస్తున్న కాకినాడ ESI ఆసుపత్రి

కాకినాడ సాంబమూర్తి నగర్‌లోని ESI ఆసుపత్రి మంగళవారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా మారింది. సంస్థ 75 వసంతాల వేడుకలతో పాటు దేశంలోని వంద పడకల ఆసుపత్రుల్లో ఉత్తమ సేవలకు గాను రెండో స్థానం దక్కించుకున్న సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి సాధించిన ఈ గుర్తింపు పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 25, 2026 / 08:22 AM IST

నేడు భోగేశ్వర, చెన్నకేశవ స్వాముల హుండీ కానుకల లెక్కింపు

ATP: పామిడి పట్టణంలోని ప్రముఖ శైవవక్షేత్రమైన భోగేశ్వరాలయం, లక్ష్మీ చెన్నకేశవ ఆలయాల హుండీ కానుకలు బుధవారం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో క్రిష్ణయ్య మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి లెక్కింపు ఉంటుందన్నారు. లెక్కింపులో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా పంచ, పైపంచ ధరించి పాల్గొనాలని ఆయన కోరారు.

February 25, 2026 / 08:20 AM IST

‘ఆలయంలో నిధుల తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి’

NLR: వలేటివారిపాలెం – చుండి మధ్య 167బి జాతీయ రహదారి పక్కనే ఉన్న జనార్ధన స్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి తవ్వకాలు చేపట్టారు. ఆలయ పక్కన ఉన్న మండపంలో సుమారు 10 అడుగుల లోతున గుంత తీయడం స్థానికంగా కలకలం రేపింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

February 25, 2026 / 08:20 AM IST

ట్రాక్టర్ బోల్తా ఇద్దరికి తీవ్ర గాయాలు

PPM: మక్కువ మండలం వెంకంపేట వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో డ్రైవర్ ముఖంపై తీవ్ర గాయం కాగా, మరొకరికి ఛాతీ మీద గాయమైంది. వీరు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

February 25, 2026 / 08:19 AM IST

ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరీ.. నిందితులు అరెస్ట్

GNTR: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ..10 కేజీల వెండి, 42 సవర్ల బంగారం, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సత్తెనపల్లి రాకేష్, ఆశీర్వాదంపై గతంలో 34 కేసులు ఉన్నాయని, ఈ కేసులో 8మందిని గుర్తించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

February 25, 2026 / 08:15 AM IST

పాము, కుక్క కాట్లకు అందుబాటులో వ్యాక్సిన్లు

W.G: పాము, కుక్క కాటుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మాట్లాడుతూ.. యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు 420, పాము కాటు వ్యాక్సిన్ 400 అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

February 25, 2026 / 08:15 AM IST

మరింత విస్తరించనున్న HMDA.. ఆ గ్రామాలన్నీ..!

VKB: HMDA పరిధి ప్రస్తుతం 10,472 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, దీనిని మరింత విస్తరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని చిట్టిగూడ, యావాపూర్ గ్రామాలు, మొయినాబాద్ మండల పరిధిలోని టేకులపల్లి, ఎక్తాలా గ్రామాలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి కొత్తగా చేర్చనున్నట్లు వెల్లడించింది.

February 25, 2026 / 08:14 AM IST

గాంధీ ఆసుపత్రి సమీపంలో మృతదేహం లభ్యం

HYD: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి సమీపంలోని కాథలిక్ సమాధి ప్రాంగణం వద్ద ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆధార్ కార్డు ఆధారంగా అతను ఏలూరు జిల్లా భీమడోలు నివాసి మున్నంగి కోటిరెడ్డి (60)గా గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సంబంధికులు పోలీసులను సంప్రదించాలని కోరారు.

February 25, 2026 / 08:14 AM IST

రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ

PDPL: రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని BRS జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. అధికారుల అండతో అధికార పార్టీ భారీ అక్రమాలకు పాల్పడిందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డివిజన్లలో బ్యాలెట్ పత్రాల వరుస క్రమంలో పొంతన లేదని, దొంగఓట్లు వేయించారన్నారు. 56వ డివిజన్‌లో కరెంట్ తీసి అక్రమాలు చేశారని మండిపడ్డారు.

February 25, 2026 / 08:12 AM IST

ఆటోను ఢీకొట్టిన కారు.. తప్పిన పెను ప్రమాదం

KNR: ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సిరిసిల్ల నుంచి గొల్లపల్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత పరారవుతున్న కారును వెంకటాపూర్ గ్రామస్థులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. అనంతరం గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

February 25, 2026 / 08:12 AM IST

డయేరియా ఘటనపై సీఎం మరోసారి ఆరా

AP: శ్రీకాకుళంలో డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు మరోసారి ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. రోడ్ రిపేర్ వల్ల డయేరియా వ్యాపించిందని, మొత్తం 65 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరగా 8 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. తాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. డ్రైనేజీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు.

February 25, 2026 / 08:12 AM IST

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణకు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్

PLD: జిల్లాలో సంప్రదాయ వృత్తులతోపాటు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ప్రత్యేక శిక్షణ అందించాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను మంగళవారం ఆదేశించారు. డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఈ సాంకేతికతపై అవగాహన కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, వివిధ సంస్థల సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలన్నారు.

February 25, 2026 / 08:10 AM IST