GNTR: మార్చి 1న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు నూతన భవనాల శంకుస్థాపనలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన ఏర్పాట్లపై సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొని ఏర్పాట్లను వివరించారు.
KMM: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించే జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు.
CTR: పుంగనూరు మండలం పెంచుపల్లి గ్రామం సమీపంలోని పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫారాల్లో కాపర్ వైర్లను గుర్తు తెలియని వారు చోరీ చేస్తున్నట్లు రైతు మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం తన పొలంలో ట్రాన్స్‌ఫారం చోరీ జరిగిందని చెప్పారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
BHPL: ఉమ్మడి జిల్లాలోని 7 పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 1,980 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాటారం పాలిటెక్నిక్‌లో ఈ ఏడాది నుంచి ‘డిప్లమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్’ కొత్త కోర్సు ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ తెలిపారు. పాలిసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది, ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
KMR: జిల్లావ్యాప్తంగా నేడు ఇంటర్ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 7,878 మంది విద్యార్థులకు గాను 7,733 మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం తెలిపారు. జిల్లాలో 98.16% హాజరు నమోదైనట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాశారు.
T20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ టీమిండియా, జింబాబ్వే తలపడనున్నాయి. అయితే సూపర్-8లో టీమిండియాకు వెస్టిండీస్‌తో కన్నా.. జింబాబ్వేతోనే ఎక్కువ ముప్పు ఉందని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. కాగా సూపర్ -8లో సౌతాఫ్రికాతో భారత్ తలపడగా ఓడిపోయింది. దీంతో వెస్టిండీస్, జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి టీమిండియాది.
KKD: పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నేడు శాసనసభలో ప్రస్తావించారు.
GNTR: అనారోగ్యంతో బాధపడుతున్న మంగళగిరి బాప్టిస్ట్‌పేటకు చెందిన కట్టెపోగు అనిల్‌కుమార్‌కు మంత్రి నారా లోకేష్ చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.7 లక్షలు మంజూరైంది. గురువారం బాధితుడి నివాసానికి వెళ్లి మంజూరు పత్రాన్ని టీడీపీ నాయకులు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు తెలిపారు.
ADB: నెరడిగొండ మండల కేంద్రంలోని రైతు వేధికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడ లేని విధంగా పేదింటి బిడ్డకు ఆసరాగా నిలుస్తుందన్నారు.
NRPT: వీర సావర్కర్ వర్థంతి సందర్భంగా గురువారం మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోని వీర సావర్కర్ చౌరస్తా వద్ద విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కమిటీ ఆధ్వర్యంలో సావర్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కమిటీ సభ్యులు హిందుత్వం, దేశం, సమాజం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.
BHNG: ధర్మారెడ్డిపల్లి గ్రామస్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని కాలువలపై బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. వెంటనే బ్రిడ్జి నిర్మించి తమ ప్రయాణ కష్టాలను తీర్చాలని కోరారు.
ATP: రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి భారతీయ జనతా పార్టీలో కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఆయన సేవలను ఉపయోగించుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.
GDWL: పట్టణంలోని 28వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ముందడుగు వేశారు. వేసవిలో నీటి కొరత పెరుగుతుందన్న అంచనాతో పాత బోర్వేర్లను మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. పనిచేయకుండా ఉన్న బోర్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు.
సత్యసాయి: జిల్లా ప్రజల దాహార్తి తీరుస్తున్న సత్యసాయి తాగునీటి పథకాన్ని జిల్లా పరిషత్తులో విలీనం చేయవద్దని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర అసెంబ్లీలో కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. విలీనం చేస్తే గ్రామ పంచాయతీలు నిర్వహణ భారమై ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. సత్యసాయిబాబా ఆశయం దెబ్బతినకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
MBNR: మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షల సందర్భంగా ప్రభుత్వ బాలుర కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ డి. జానకి సందర్శించారు. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.