• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కల్తీ పాల ఘటన బాధితులను పరామర్శించిన మంత్రి

E.G: రాజమండ్రి కిమ్స్ ఆస్పత్రిలో కల్తీ పాల ఘటన బాధితులను మంత్రి కందుల దుర్గేష్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యులను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కల్తీ ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

February 26, 2026 / 10:43 AM IST

నిధుల విడుదలపై మంత్రి పయ్యావులకు వినతి

ATP: కూడేరు మండలం అంతరగంగ గ్రామంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా నిర్మిస్తున్న రాములవారి దేవస్థానానికి పెండింగ్ నిధులను విడుదల చేయాలని టీడీపీ నేత శ్రీకాంత్ కోరారు. గురువారం ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆలయ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని వివరించారు.

February 26, 2026 / 10:43 AM IST

నిజామాబాద్ అదనపు కలెక్టర్ బదిలీ

NZB: జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న అంకిత్ (2019 బ్యాచ్) కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ CS రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అంకిత్‌ను భద్రాద్రి కొత్త గూడెం కలెక్టర్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

February 26, 2026 / 10:43 AM IST

కొత్త వాహనాలు కొనేవారికి SHOCK

TG: కొత్త వాహనాలు కొనేవారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాహనాలపై ‘రహదారి భద్రత పన్ను’ విధిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన మార్చి 1 నుంచి అమలులోకి రానుంది. వాహన రకాన్ని బట్టి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్నును తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

February 26, 2026 / 10:43 AM IST

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజలు

PPM: సీతానగరంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపులు పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు తెచ్చిన వివిధ రకాల పుష్పాలు తులసి మాలలతో స్వామివారిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసచార్యులు మాట్లాడుతూ.. స్వామివారిని విశ్వాసంతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అని తెలియజేశారు.

February 26, 2026 / 10:40 AM IST

గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు రికార్డుల తనిఖీ

JGL: రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామ పంచాయతీలో బుధవారం డీఎల్పీవో, ఎంపీవోలు పారిశుధ్య పనులు, రికార్డులను తనిఖీ చేశారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గౌతమి అధికారులను శాలువాతో సత్కరించారు. పంచాయతీ కార్మికులకు ప్రోత్సాహకంగా సబ్బులు, నూనెలు, బెల్లం పంపిణీ చేశారు.

February 26, 2026 / 10:40 AM IST

కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగిన కుటుంబం

మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లా పురానీబస్తీలో విషాదం నెలకొంది. ఆన్‌లైన్ గేమ్‌లో సర్వం కోల్పోయిన శంకర్ లాల్ కుటుంబం.. కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగారు. ఈ క్రమంలో కూతురు స్వాతి, శంకర్ లాల్ మృతి చెందారు. భార్య రాజకుమారి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

February 26, 2026 / 10:39 AM IST

అనంతపురంలో బీజీపీలోకి భారీగా చేరికలు

ATP: జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. యువమోర్చా నాయకులు తేజశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో దివాకర్ నాయక్, రజక శ్రీకాంత్, చక్రధర్ రెడ్డి, మనిదీప్, సురేంద్ర పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రాజేష్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని రాజేష్ తెలిపారు.

February 26, 2026 / 10:39 AM IST

నేడు డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు

KNR: జమ్మికుంటలో ఈరోజు ఉదయం 11 గంటలకు సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో వినాయక ఫంక్షన్ హాల్లో మోటారు వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు.హెవీ గూడ్స్, ఆటో ట్రాక్టర్ డ్రైవర్లు శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ఉచిత కళ్లజోడు కమిషనర్ చేతుల మీదుగా పంపిణీ చేస్తారని అన్నారు.

February 26, 2026 / 10:39 AM IST

రేపు దివ్యాంగులకు మెగా జాబ్ మేళా

HYD: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ విత్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్ ఆధ్వర్యంలో యూత్ 4 జాబ్స్ సహకారంతో దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా ఈనెల 27న సికింద్రాబాద్‌లోని NIEPID క్యాంపస్‌లో జరగనుంది. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, దివ్యాంగ ధృవీకరణ పత్రం లేదా UDID కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలన్నారు.

February 26, 2026 / 10:38 AM IST

గత ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టింది: మంత్రి

AP: వైసీపీ హయాంలో గృహ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వకాలంలో ఇళ్ల పట్టాలిచ్చి భూములు ఇవ్వలేదు. భూములు కొని ఇస్తామని ప్రజలను మభ్య పెట్టారు. పేదలకు అర్బన్‌లో 2 సెంట్లు, రూరల్‌లో 3 సెంట్లు.. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని వెల్లడించారు.

February 26, 2026 / 10:38 AM IST

ఏటూరునాగారం ITDA PO చిత్రా మిశ్రా బదిలీ

MLG: రాష్ట్ర ప్రభుత్వం భారీగా కలెక్టర్‌ను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో ఏటూరునాగారం ITDA ప్రాజెక్టు అధికారి చిత్ర మిశ్రాను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. చిత్ర మిశ్రా 2019లో ఏటూరునాగారం ITDA POగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు చిత్ర మిశ్రాకు శుభాకాంక్షలు తెలిపారు.

February 26, 2026 / 10:35 AM IST

FLASH: GREAT.. 3MIN పరీక్ష కేంద్రం వద్దకు చేర్చిన పోలీస్..!

MDCL: ఉప్పల్లో ఇంటర్మీడియట్ పరీక్షకు వచ్చిన ఓ విద్యార్థినికి సెంటర్ తెలియక ఉప్పల్ చౌరస్తా వద్ద ఆందోళనతో ఏడుస్తూ ఉండగా.. అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ 3656 శ్రీనివాస్ పరిస్థితి తెలుసుకుని వెంటనే స్పందించారు. తన బైక్‌ పై కేవలం 3 నిమిషాల్లోనే విద్యార్థినిని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, ఐడిఏ ఉప్పల్‌కు సురక్షితంగా చేర్చారు.

February 26, 2026 / 10:34 AM IST

వైసీపీ అసత్యాలు చెబుతోంది: నిమ్మల

AP: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వైసీపీ అసత్యాలు చెబుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వైసీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేశారని పేర్కొన్నారు. ఆ సమయంలో జగన్ సీఎంగా ఉన్నారని తెలిపారు.

February 26, 2026 / 10:32 AM IST

ఓ కంటైనర్ లో నిషేధిత గంజాయి పట్టివేత

BDK: చుంచుపల్లి మండలం కంకర మిల్లు సమీపంలో ఓ కంటైనర్‌లో నిషేధిత గంజాయి తరలిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు గురువారం తనిఖీ నిర్వహించారు. ఓ కంటైనర్ను తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు తేలింది. దీంతో ఆ కంటైనర్ను పోలీస్ స్టేషన్‌కు తరలించి డ్రైవర్ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

February 26, 2026 / 10:32 AM IST