• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జిల్లాలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

మార్కాపురంలోని కలెక్టరేట్లో ఈ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. కావున ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

February 23, 2026 / 07:56 AM IST

నేడు జిల్లా కలెక్టరేట్‌లో ఫిర్యాదుల పరిష్కార వేదిక

PLD: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

February 23, 2026 / 07:56 AM IST

పెద్దమల్లారెడ్డి—జేబీఎస్‌కు ఎక్స్ ప్రెస్ బస్సు ప్రారంభం

KMR: పెద్దమల్లారెడ్డి నుంచి HYD జేబీఎస్‌కు ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసు ప్రారంభం కావడం గ్రామ ప్రజలకు ఊరటగా మారింది. ప్రతిరోజూ ఉదయం 6:10 గంటలకు బయలుదేరి రామాయంపేట మీదుగా ఉదయం 8:30 గంటల వరకు జేబీఎస్ చేరుకుంటుంది. ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కోసం వెళ్లేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది.

February 23, 2026 / 07:55 AM IST

తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటలు

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. భక్తులు సర్వదర్శనం కోసం 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 76,506 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,049 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

February 23, 2026 / 07:55 AM IST

బ్యాంకులో భారీ గోల్డ్ మాయం.. కేసు నమోదు

GNTR: వెంకటపాలెం యూనియన్ బ్యాంకులో కస్టమర్లు దాచుకున్న బంగారం మాయమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు 328 గ్రాముల బంగారం కనిపించకుండా పోయినట్లు ఈ నెల 2న బ్యాంకు మేనేజర్ గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఒక మహిళా ఉద్యోగి లాకర్ నుంచి రెండు పౌచ్‌లను బయటకు తీసుకెళ్లిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

February 23, 2026 / 07:54 AM IST

శుభకార్యంలో విషాదం.. భోజనం చేస్తూ వృద్ధుడు మృతి

GNTR: కొల్లిపర గ్రామానికి చెందిన కొల్లి రామిరెడ్డి (85) ఆదివారం రాత్రి గుదిబండివారిపాలెంలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరయ్యారు. అక్కడ భోజనం చేస్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించగా, తీవ్ర గుండె నొప్పితో అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

February 23, 2026 / 07:52 AM IST

నేడే పరీక్ష.. ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉ.9 నుంచి మ.12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు 08554-277626 నంబరుకు కాల్ చేసి సమాచారం పొందవచ్చు.

February 23, 2026 / 07:50 AM IST

కన్న కూతురిపై అత్యాచారం చేయించిన తల్లి

కూతురిపై తల్లే తన ప్రియుడితో అత్యాచారం చేయించింది. ఈ ఘటన చెన్నైలోని సాలిగ్రామంలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న తల్లికి అది తప్పు అని చెప్పిన కూతురు.. ఆ తర్వాత మాట్లాడటం మానేసింది. అయితే బాలికకు జ్వరం రాగా.. మాత్రలని చెప్పి నిద్రమాత్రలిచ్చి తన ప్రియునితో అత్యాచారం చేయించింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. పోలీసులు తల్లిని, ప్రియుడిని అరెస్ట్ చేశారు.

February 23, 2026 / 07:48 AM IST

ఏయూపై జరిగిన దాడులను ఖండించాలి

AKP: ఏయూలో బీజేపీ శ్రేణులు చేసిన విధ్వంసాన్ని విద్యావేత్తలు, ప్రజలు ఖండించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి సీపీఎం కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. బస్సులలో జనాలను తీసుకువచ్చి ఏయూ అధికారులు, పోలీసులపై దాడులకు దిగడం దారుణం అన్నారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

February 23, 2026 / 07:47 AM IST

జిల్లాలో ఘనంగా జాతీయస్థాయి కళా ఉత్సవాలు

GNTR: జాతీయ నృత్య, సంగీత కళా ఉత్సవం గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. నృత్యాలు మన సంస్కృతి, సాంప్రదాయాల ప్రతిబింబమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి, మలినేని కాలేజీ ఛైర్మన్ పెరుమాళ్లు, అపెక్స్ సొల్యూషన్స్ డైరెక్టర్ నరేంద్ర పాల్గొన్నారు.

February 23, 2026 / 07:47 AM IST

‘రేంజ్ పరిధిలోనే పెద్దపులి సంచారం’

ASF: సిర్పూర్(టి) అటవీశాఖ రేంజ్ పరిధిలోనే పెద్దపులి సంచరిస్తోంది. దీంతో అటవీశాఖ అధికారులు వాటి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. రేంజ్ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులులను అధికారులు, టైగర్ ట్రాకర్స్, వాచర్స్ నిత్యం ట్రాకింగ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతాలకు పశువులు,మేకలు తీసుకెళ్లద్దని, ఒంటరిగా వెళ్లొద్దని వద్దని సూచిస్తున్నారు.

February 23, 2026 / 07:47 AM IST

నేడు యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం

KMR: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 1:00 వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణి కి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

February 23, 2026 / 07:46 AM IST

ప్రారంభం అయిన ఇంటర్ పరీక్షలు

TPT: నాయుడుపేటలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైయ్యాయి. ఇంటర్ మీడియట్ పరీక్షలకు సంబంధించి నాయుడుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురకుల కళాశాల, శ్రీవేమ, విశ్వం కళాశాలల్లో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాలలో మొత్తం 1200మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

February 23, 2026 / 07:45 AM IST

నేటి నుంచే జామి ఎల్లారమ్మ తల్లి జాతర

VZM: జామిలోని శ్రీ ఎల్లారమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ జాతర మహోత్సవాలలో భాగంగా సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం అమ్మవారి జాతర, బుధవారం చిన్న తీర్థం జరుగుతుంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

February 23, 2026 / 07:42 AM IST

“బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలి”

BHPL: కుమ్మెర జాతరలో FEB 18న అగ్రకుల రెడ్ల దాడిలో రెండు నెలల పసిపాప మౌనిక మరణాన్ని నిరసిస్తూ BHPL జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి ST, SC, JAC, DSP ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. దోషుల పై బలమైన సెక్షన్లు పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్షించాలని, మౌనిక కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

February 23, 2026 / 07:40 AM IST