• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు

BHNG: భయాందోళనలో చెందకుండా, ఇంటర్మీడియట్ విద్యార్థులు, సకాలంలో హాజరై పరీక్షలు రాయాలని, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. ఆలేరు పట్టణంలో బుధవారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష నిర్వహణను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ చేశారు.

February 25, 2026 / 08:02 PM IST

స్వచ్ఛ సర్వేక్షన్‌-2026 లక్ష్యంగా పనిచేయాలి: మేయర్‌

KNR: కరీంనగర్‌ నగర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, స్వచ్ఛ సర్వేక్షన్‌-2026లో ఉత్తమ ర్యాంకు సాధించాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి వార్డులో వంద శాతం చెత్త సేకరణ జరగాలన్నారు.

February 25, 2026 / 08:01 PM IST

చారిత్రక వారసత్వం..శ్రీరంగాపురం ఆలయ విశిష్టత

WNP: వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మితమైన శ్రీరంగపూర్ శ్రీరంగనాథస్వామి ఆలయం దక్షిణ కాశీగా పేరుగాంచింది. శ్రీరంగం తమిళనాడు వెళ్లలేని భక్తుల కోసం వనపర్తి రాజులు ఇక్కడ రంగనాథస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ గర్భాలయంలో స్వామివారు శేషతల్పంపై పవళించిన భంగిమలో దర్శనమిస్తారు. విజయనగర శిల్పకళా రీతిలో నిర్మించిన ఈ ఆలయం, సంస్థానాధీశుల భక్తికి నిదర్శనం.

February 25, 2026 / 08:01 PM IST

పీ-4 ద్వారా 65 శాతం వెరిఫికేషన్ పూర్తి

ఏలూరు జిల్లాలో పీ-4 కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 65% బంగారు కుటుంబాల ధ్రువీకరణ పూర్తయిందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. అమరావతి నుంచి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి పియూష్ కుమార్ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో గుర్తించిన 71,910 బంగారు కుటుంబాల్లో, ఇప్పటికే 5,554 మంది మార్గదర్శకులు 43,814 కుటుంబాలను దత్తత తీసుకున్నారన్నారు.

February 25, 2026 / 08:01 PM IST

‘ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేయవద్దు’

ADB: ప్రజలు వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేయాల్సిన అవసర లేదని, ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు జిల్లా వైద్యాధికారి మనోహర్ అన్నారు. బుధవారం గాదిగూడ మండలంలోని ఝరి PHCలో ఉచిత మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించారు. వైద్యులు రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.

February 25, 2026 / 08:00 PM IST

నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరికి కృతజ్ఞతలు

NDL: రాయలసీమ విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థులు నంద్యాల ఎంపీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డా. బైరెడ్డి శబరికి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న పునర్వికకు పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 50 లక్షల వైద్య సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సేవా గణేష్ నాయక్ సన్ని, కుమార్, మహేంద్ర మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 08:00 PM IST

స్వచ్ఛ మంగళగిరి 2.0 పోస్టర్లను ఆవిష్కరన

GNTR: మంగళగిరి నియోజకవర్గాన్ని పరిశుభ్రతలో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో “స్వచ్ఛ మంగళగిరి 2.0” పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. మొదటి దశ ప్రజల్లో మంచి చైతన్యం తెచ్చిందని, రెండో దశలో మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిని పూర్తిస్థాయిలో స్వచ్ఛంగా మార్చాలన్నారు.

February 25, 2026 / 08:00 PM IST

డెలివరీ బాయ్ అనుభవాన్ని అసెంబ్లీలో పంచుకున్న ఎమ్మెల్యే

కృష్ణా: డెలివరీ బాయ్‌గా తన అనుభవాలను అసెంబ్లీలో పెనమలూరు MLA బోడె ప్రసాద్ బుధవారం పంచుకున్నారు. ఇతర దేశాల్లో డెలివరీ బాయ్ ఉద్యోగాన్ని చిన్నతనంగా చూడకుండా అందరూ చేస్తారని అదే స్ఫూర్తిని ఇక్కడ యువతలో నింపాలని తాను డెలివరీ బాయ్‌గా చేసినట్లు తెలిపారు. డెలివరీ బాయ్స్‌కి కంపెనీల వద్ద టాయిలెట్స్, నుంచోడానికి నీడ వంటి సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

February 25, 2026 / 08:00 PM IST

ఈ నెల 28నే పింఛను పంపిణీ

ASR: ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చ్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఈ నెల 28న పంపిణీ చేస్తారని అరకులోయ ఎంపీడీవో అడప లవరాజు పేర్కొన్నారు. కావున ఫించను లబ్ధిదారులు శనివారం వారి ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని అన్నారు. మండలంలో ఉన్న 6359 ఫించన్లకు రూ.2.75 కోట్లు మంజూరైనట్లు బుధవారం తెలిపారు. సిబ్బంది ఈ నెల 27న పింఛను అమౌంట్ బ్యాంకు నుండి వితడ్రా చేయాలన్నారు.

February 25, 2026 / 07:59 PM IST

రైతు భరోసా విడుదలకు వినతి

NRPT: పంటలు వేసి రెండు నెలలు గడిచినా రైతు భరోసా నిధులు విడుదల కాలేదని సీపీఐఎం కార్యదర్శి వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల ఆలస్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొత్తపల్లి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

February 25, 2026 / 07:56 PM IST

బైక్‌ను ఢీ కొట్టిన ట్రాక్టర్.. మహిళ మృతి

MNCL: రామకృష్ణాపూర్ రాజీవ్ చౌక్ నుంచి విఠల్ నగర్ వెళ్లే దారిలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ట్రాక్టర్, బైక్‌ని ఢీ కొట్టడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు మందమర్రి పట్టణం 2వ జోన్ కు చెందిన చంటి మల్లీశ్వరిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

February 25, 2026 / 07:55 PM IST

దావత్ -ఈ -ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యేలు

HYD: కార్వాన్ నియోజకవర్గం పరిధిలోని టోలీచౌకి సాలార్ బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన దావత్ -ఈ -ఇఫ్తార్ విందులో AIMIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, MLA కౌసర్ మొహియుద్దీన్ పాల్గొన్నారు. ముందుగా మత పెద్దలతో కలిసి ప్రతేక్య ప్రార్థనలు (దువా) నిర్వహించారు. AIMIM పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

February 25, 2026 / 07:55 PM IST

అయిజ బస్టాండ్‌లో అధికారుల తనిఖీ

GDWL: అయిజ బస్టాండ్ పరిసరాలను రీజినల్ మేనేజర్ సంతోష్, గద్వాల డిపో మేనేజర్ సునీత పరిశీలించారు. శుభ్రత, డ్రైనేజీ, బస్సుల రాకపోకల నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలపై సమీక్షించారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్టాండ్ వద్ద ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

February 25, 2026 / 07:51 PM IST

భూసేకరణ వేగవంతం చేయండి: కమిషనర్

RR: AOC కారిడార్ రహదారి అభివృద్ధి పనుల్లో భాగంగా ఆర్కేపురం ఆర్ఓబి నుంచి ఎల్బీనగర్ జోన్ TKR కమాండ్ వరకు, అక్కడి నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు చేపట్టనున్న నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.

February 25, 2026 / 07:50 PM IST

ప్రశాంతంగా ముగిసిన తొలిరోజు ఇంటర్ పరీక్షలు

VKB: జిల్లాలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు మొత్తం 272 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. ​మొత్తం విద్యార్థులు 8,672 మందిలో 8,400 మంది హాజరయ్యారు. ​ఈరోజు పరీక్ష ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు.

February 25, 2026 / 07:50 PM IST