ADB: ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఐఈవో జాదవ్ గణేష్ తెలిపారు. అయితే జిల్లాలో ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వెల్లడించారు. మొత్తం 8,549 మంది విద్యార్థులకు గాను 8,180 మంది హాజరయ్యారని, 369 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
TPT: రైల్వే కోడూరులో మార్చి 5న శ్రీ సాయి డిగ్రీ & పీజీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 15 కంపెనీలు పాల్గొని 630 కిపైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. పదో తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు హాజరుకావచ్చు. ఆసక్త కలిగి అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
HYD: సికింద్రాబాద్ రైల్వే టాస్క్ ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.79,230 విలువైన 70 బాటిళ్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు.
NGKL: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పేరు మార్పును ఉపసంహరించుకొని యథావిధిగా అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ డిమాండ్ చేశారు. అమ్రాబాద్ మండలంలోని వెంకటేశ్వర్ల బావి, మల్కమామిడి, మన్ననూర్ గ్రామాలను సందర్శించి పని ప్రదేశంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కాకినాడ: ఏలేశ్వరంలో జనసేన నాయకుడు బంక కోదండరాం ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. రాష్ట్ర కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వం వల్ల లభించే బీమా, ఇతర ప్రయోజనాలను కార్యకర్తలకు వివరించారు. పార్టీ శ్రేణులు తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆశయాలను బలోపేతం చేయాలన్నారు
NLG: గుడిపల్లి మండలం ఘనిపల్లి అగ్నిప్రమాద బాధితులకు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నేతృత్వంలో ఇందిరమ్మ ఇల్లు కల్పిస్తామని మండల పార్టీ నాయకులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం తహసీల్దార్ మధుసుహాసిని, ఎంపీడీవో అండాలు, ఆర్ఐ సత్య రాజ్, సర్పంచ్ మల్లిక వెంకటేశ్వర్లు బాధితుడు భిక్షం కుటుంబాన్ని పరామర్శించారు.
బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గురువారం చీరాలలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తీరును ప్రతి గదికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. ప్రశ్నాపత్రం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా, కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
RR: శంకర్ పల్లి మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ చాకలి అశోక్ ఇవాళ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం బొకే అందజేశారు. ఈ సందర్భంగా రెండో సారి స్వతంత్ర అభ్యర్థిగా, కౌన్సిలర్‌గా గెలిచిన అశోక్‌ను ఎమ్మెల్యే అభినందించారు. వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
‘కోర్ట్’ సినిమా జోడీ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘బ్యాండ్ మేళం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా.. తాజాగా సెకండ్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 28న మాస్ మహారాజా రవితేజ ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక దర్శకుడు సతీష్ జివ్వాజి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కాకినాడ: కోరంగి అభయారణ్యంలో పర్యావరణ పరిరక్షణకు కీలకమైన నీటి పిల్లులను కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజర్ ఎస్.ఎస్.ఆర్. వరప్రసాద్ కోరారు. వీటిని వేటాడితే వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ అరుదైన జీవుల సంతతిని పెంచేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న లైబ్రరీ భవన నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్ తదితరులు గురువారం పరిశీలించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవ వల్ల లైబ్రరీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు వారు తెలిపారు.
TG: నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు కన్నెర్ర చేశారు. గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర లేకపోవడం.. ఈనామ్ సర్వర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ పనిచేయకపోవడంతో అధికారులు లాట్ నంబర్ కేటాయిండం లేదు. దీంతో నిజామాబాద్ మార్కెట్‍లో పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మార్కెట్‍లోని కార్యాలయం ఆద్దాలను ధ్వంసం చేసి మరీ నిరసన తెలిపారు.
BDK: పాల్వంచ మండలం, గుడిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి, గోదాదేవి సమేత శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టా మహోత్సవం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక దేశానికి సుప్రీమ్ న్యాయమూర్తి ఎస్ తురాయి రాజా పాల్గొన్నారు. వారికి సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ ఆహ్వానం పలికారు.
NTR: విజయవాడలోని లోటస్ ల్యాండ్‌మార్క్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక ట్రాక్టర్లు పట్టపగలే అధిక లోడుతో రాకపోకలు సాగిస్తున్నాయి. నగర పరిధిలో ఉదయం వేళ ట్రాక్టర్లకు అనుమతి లేకపోయినా, యథేచ్ఛగా నడుస్తుండటంపై స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక లోడు కారణంగా ఇటుకలు రోడ్డుపై జారిపడి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భయాందోళన చెందుతున్నారు.
MBNR: భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం ఒక ప్యాకెట్ ధర 151 రూపాయలు పెట్టి బుక్ చేసుకోవాలని రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ గురువారం అన్నారు. జిల్లా కార్యాలయంలో అందుకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవాలని సూచించారు. నేరుగా ఇంటికే తలంబ్రాలు చేరవేస్తారని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9154298637 సంప్రదించాలన్నారు.