• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సైబర్ నేరాలపై అవగాహన

ASR: జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్ధర్ ఆదేశాలతో పెదబయలు ఎస్సై వెంకటేష్ అడుగులపుట్టు గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, మహిళల రక్షణతో పాటు గంజాయి, నాటుసారా (ID Arrack) అనర్థాలపై గ్రామస్తులను అప్రమత్తం చేశారు. నేర రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

February 23, 2026 / 08:11 PM IST

‘అగ్రిగోల్డ్ సమస్య కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలి’

అగ్రి గోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించేందుకు విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని అగ్రి గోల్డ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పార్వతీపురంలో ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ సంస్థ ఈ జనవరి నాటికి మూసి 12 ఏళ్ళు పూర్తి అయిందన్నారు. అయినా కానీ ఆ సమస్య అలాగే ఉందన్నారు.

February 23, 2026 / 08:10 PM IST

జిల్లాలో టెన్త్ పరీక్షా సమయాలు ఇవే..!

ఏలూరు: జిల్లాలో 10 పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 133 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, మొత్తం 14,019 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 08:10 PM IST

ఇకపై ప్రభుత్వ రంగ సంస్థగా మెట్రో!

TG: హైదరాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపై మెట్రో పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థగా మారనుంది. దీంతో ఫేజ్-2 విస్తరణ పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. 

February 23, 2026 / 08:09 PM IST

‘రజక కుటుంబంపై దాడి చేసిన నిందితులను శిక్షించాలి’

MHBD: నాగర్ కర్నూల్ మండలం కుమ్మేర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడి చేసి, రెండు నెలల పసికందు మృతికి కారకులైన అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని రజక సంఘం జిల్లా కార్యదర్శి పున్నం సారయ్య డిమాండ్ చేశారు. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకోవడం సభ్య సమాజం తలదించుకోవలసిన విషయమని మండిపడ్డారు.

February 23, 2026 / 08:08 PM IST

గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు: CI

ADB: గంజాయి కేసులో ఇద్దరు నిందితులు జాధవ్ సాయినాథ్, బనియా గోవింద్ అరెస్ట్ చేసినట్లు CI గురుస్వామి సోమవారం తెలియజేశారు. ఈ మేరకు నిందితులపై బోథ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మాదక ద్రవ్యాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు. ప్రజలు అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

February 23, 2026 / 08:08 PM IST

పోలీస్ దళంలోకి కొత్తగా రెండు శిక్షిత జాగిలాలు

KMM: హైదరాబాద్‌లోని మొయినాబాద్‌ ఐఐటీఏ (IITA) శిక్షణ కేంద్రంలో 8 నెలల పాటు కఠినమైన శిక్షణ పూర్తి చేసుకున్న పింకీ (Pinky), రోక్సీ (Roxy) అనే రెండు పోలీస్ జాగిలాలు విధుల్లో చేరాయి. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ.. నేరాల పరిశోధన, పేలుడు పదార్థాల గుర్తింపు, నిందితుల వేటలో ఈ జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

February 23, 2026 / 08:08 PM IST

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అభివృద్ధి హామీ

MBNR: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి తండాకు బీటీ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నవాబుపేటలో జరిగిన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

February 23, 2026 / 08:07 PM IST

సీఎం సహాయనిధి విభాగాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

BDK: హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎం సహాయనిధి విభాగాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం సందర్శించారు. అశ్వారావుపేట పరిధిలోని ఐదు మండలాలకు చెందిన అనారోగ్య బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బిల్లులను ఆర్థిక సహాయం కోసం సంబంధిత అధికారులకు అందజేశారు. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు.

February 23, 2026 / 08:06 PM IST

క్రీడల్లో కరీంనగర్ పోలీసుల పతకాల వేట

KNR: సైబరాబాద్లో జరిగిన 4వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు 35 పతకాలతో సత్తా చాటారు. ఇందులో 9 స్వర్ణ, 13 రజత, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. ఏసీపీ మాధవి, పీసీలు స్వప్న, శ్రీజ, శ్రీధర్ పలు విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచారు. విజేతలను సీపీ గౌష్ ఆలం అభినందిస్తూ.. విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల్లో రాణించడం గర్వకారణమని కొనియాడారు.

February 23, 2026 / 08:06 PM IST

ఉద్యోగులకు అందని వేతనాలు..!

కడప: YVUలోని 140 మంది ఆప్కాస్ ఉద్యోగులు నవంబర్ 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు నాలుగు నెలలుగా ప్రభుత్వ వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బడ్జెట్ లేదనే కారణంతో ఫైనాన్స్ అధికారులు నిధులను మళ్లిస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో వైద్య సేవలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా నిలిచిపోయాయి.

February 23, 2026 / 08:04 PM IST

‘వెలుగొండ ప్రాజెక్టుకు రూ.2000 కోట్లు కేటాయించాలి’

ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టుకు రూ.2000 కోట్లు నిధులు కేటాయించి, నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు మాల్యాద్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పామూరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల తాగునీరు, సాగునీరు అవసరాలకు వెలుగొండ ప్రాజెక్టే కీలకమన్నారు.

February 23, 2026 / 08:04 PM IST

పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

SRPT: జిల్లాలో ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. 69 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అదనపు బస్సులు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, ప్రశ్నపత్రాల తరలింపులో పటిష్ట భద్రత పాటించాలని అన్నారు.

February 23, 2026 / 08:02 PM IST

డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకరణ

NZB: నిజామాబాద్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్​గా సల్మా తహసిన్ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల పొత్తుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎంఐఎంకు చెందిన 54వ డివిజన్ కార్పొరేటర్ సల్మాను డిప్యూటీ మేయర్​‌గా ఎన్నుకున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

February 23, 2026 / 08:02 PM IST

బ్రహ్మోత్సవాల్లో రేపు ఎదుర్కోళ్ల మహోత్సవం

BHNG: శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ప్రధాన ఘట్టం ఎదుర్కోళ్ల మహోత్సవం ప్రత్యేక సేవలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు మోహిని అలంకార సేవతో వేదపారాయణం ప్రారంభమవుతుంది. రాత్రి 8గంటలకు అశ్వ వాహన సేవ, 8:45 ఎదుర్కోళ్ళు మహోత్సవం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం పొందాలని ఆలయ ఈవో కోరారు.

February 23, 2026 / 08:02 PM IST