టీమిండియాలోకి పునరాగమనం చేసిన తర్వాత ఇషాన్ కిషన్ దుమ్మురేపుతున్నాడు. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ మూడో స్థానానికి దూసుకెళ్లాడు. మరోవైపు, వరుసగా విఫలమవుతున్నప్పటికీ అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే, పాక్ ప్లేయర్ ఫర్హాన్ నుంచి అభిషేక్ టాప్ ప్లేస్‌కు ముప్పు ఏర్పడింది. అతడు T20 WCలో తన ప్రదర్శనతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు.
NGKL: బల్మూర్ మండలం మంగలికుంటపల్లి గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ వెంకటయ్య యాదవ్ పనులు ప్రారంభించారు. పంచాయతీ భవనానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన వెంకటేశ్వరరావు, కృష్ణ రావులను ఈ సందర్భంగా నాయకులు అభినందించారు.
MDK: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం అని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండించింది. చేగుంటలో నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటని ఘటనకు పాల్పడ్డ వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చేగుంట మండలం ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు మొహమ్మద్ రఫీ అన్నారు.
NLG: నార్కట్ పల్లి మండలం, గోపలాయపల్లి గుట్టపై శ్రీ వారిజాల వేణు గోపాలస్వామి ఆలయంలో బుధవారం సుదర్శన హోమాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ప్రతి నెల రోహిణి నక్షత్రం సందర్భంగా గుట్టపై హోమాన్ని నిర్వహిస్తారు. పలువురు దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి హోమంలో పాల్గొన్నారు. భక్తులు విచ్చేసి హోమాన్ని తిలకించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరిపారు.
TG: రాజ్యసభ సీటు కోసం ఢిల్లీకి పోనని రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి అన్నారు. దక్షిణాదికి జాతీయ కిసాన్ అధ్యక్ష పదవి ఇవ్వాలని గతంలో AICCని అడిగానని తెలిపారు. అనుకోని కారణాల వల్ల తనకు ఆ పదవి రాలేదని చెప్పారు. రాజ్యసభ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కోరారు. రాజ్యసభ కావాలని CM, PCC చీఫ్‌ను అడుగుతానని వెల్లడించారు.
ATP: గుత్తి ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ స్వాతి బుధవారం తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయని వివరించారు. ఎమ్మెస్సీ మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
బియ్యప్పిండి చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. తేమను పోనివ్వకుండానే మృతకణాలను, జిడ్డును తొలగిస్తుంది. స్పూన్ బియ్యప్పిండి, తేనె కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగితే మంచి స్క్రబ్‌లా పనిచేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు బియ్యంపిండికి తగినంత పెరుగుతో కలిపి వాడాలి. బియ్యప్పిండి, ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ప్యాక్‌లా వేస్తే జిడ్డు తగ్గుతుంది.
SDPT: అక్కన్నపేట మండలంలోని జనగామలో ఆర్థిక అక్షరాస్య త కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యత, సైబర్ నేరాల నివారణ, బ్యాంకింగ్ సేవలపై వివరించారు. KYC, e-KYC, CKYC, డిజిటల్ KYC ప్రక్రియలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ చందు లక్ష్మి, సెక్రటరీ మహేందర్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ సంజయ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.
ELR: నూజివీడు(మం) సుంకొల్లు, సిద్ధార్థనగర్‌లలో మామిడి తోటలను ఉద్యాన అధికారులు బుధవారం పరిశీలించారు. శాస్త్రవేత్త కే. రాధా రాణి మాట్లాడుతూ.. మామిడి పూత పిందె కట్టి నిలిచేందుకు 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి ఆర్. హేమ, రైతులు పాల్గొన్నారు.
టాలీవుడ్ నటి వైష్ణవి చైతన్య కోలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా రాబోతున్న చిత్రంలో ఆమెను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో అజిత్ కుమార్ ‘వలిమై’లో చిన్న పాత్ర పోషించిన వైష్ణవి.. ఇప్పుడు పూర్తిస్థాయి హీరోయిన్‌గా తమిళ ప్రేక్షకులను అలరించనున్నట్లు టాక్.
MNCL: జన్నారం మండలం కవ్వాల్ హాస్టల్ తండాలోని కట్టె స్తంభాలు, ఈదురు గాలులకు ఒక పక్కకు ఒరిగిపోయాయి. ఎనిమిదేళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. పొలాలకు వెళ్లే మార్గంలో ప్రాణాపాయం పొంచి ఉందని, తక్షణమే స్పందించి శాశ్వత సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు కొత్త హెడ్‌కోచ్‌గా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ పైబస్ నియమితులయ్యాడు. కోచ్ జొనాథన్ ట్రాట్ కాంట్రాక్ట్ ముగియడంతో, అతడి స్థానంలో రిచర్డ్‌ను నియమించినట్లు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది. రిచర్డ్‌కు కోచ్‌గా మంచి రికార్డు ఉంది. అతడు 2013 నుంచి 2019 వరకు వెస్టిండీస్ జట్టుకు(కోచ్/డైరెక్టర్) సేవలందించాడు.
MDCL: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అల్వాల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యారు. శ్రీ చైతన్య, నారాయణ, వైభవ్ , లయోలా తదితర కాలేజీల్లో పరీక్షలు నిర్వహించగా, కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో మొదటి రోజు పరిక్ష ప్రశాంతంగా ముగిసింది.
అన్నమయ్య: ఓబులువారిపల్లి(మం) ముక్కవారిపల్లి పంచాయతీ సంజీవపురం గ్రామానికి చెందిన చింత సుజనా కుమారి పెద్దకర్మకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంఛార్జ్ & KUDA ఛైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, వారి సతీమణి ముక్కా వరలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
SRD: సంగారెడ్డి పట్టణంలోని ఇంటర్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ పారితోష్ పంకజ్ బుధవారం తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు.