• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నరసాపురం టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్

W.G: నర్సాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి రామరాజు ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, క్షేత్రస్థాయిలో వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 04:48 PM IST

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

HYD: గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆవరణలో అపస్మారక స్థితిలో పడి ఉన్న దాదాపు 45-50 ఏళ్ల వ్యక్తిని చూసిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించారు. అయితే ట్రీట్మెంట్ పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

February 27, 2026 / 04:48 PM IST

‘జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’

SKLM: ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 18వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ అన్నారు . శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నరసన్నపేటలో ఏప్రిల్ 4, 5 తేదీలలో జరిగే మహాసభలకు కార్మికులు, రైతులు తరలిరావాలని కోరారు. జిల్లాలో భూమి,నిర్వాసితుల సమస్యలు, ఉపాధి హామీ అమలు వంటి అంశాలపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

February 27, 2026 / 04:45 PM IST

‘వినతులు తక్షణమే పరిష్కరించాలి’

PPM: పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర హాలులో శుక్రవారం జరిగిన ‘గిరిజన పీజీఆర్ఎస్’ కార్యక్రమానికి స్పందన లభించింది. ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గిరిజనుల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. అయిదు ప్రధాన వినతులు అధికారుల దృష్టిలోకి వచ్చాయన్నారు. ఈ సందర్బంగా పిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

February 27, 2026 / 04:45 PM IST

‘పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలి’

 KDP: పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేసి బాధితులకు న్యాయం చేయాలని జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నాడు ముద్దునూరు పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్లో ఉన్న రికార్డులను సక్రమంగా ఉన్నాయా లేదా పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై సంబంధిత సీఐ నగేష్ బాబు‌తో సమీక్ష నిర్వహించారు.

February 27, 2026 / 04:45 PM IST

‘ఢిల్లీ JNU వీసీని తొలగించాలి’

MDK: ఢిల్లీ JNU యూనివర్సిటీ VC శాంతి దూలపూడి పండిత్‌లను వెంటనే తొలగించాలని ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా కార్యదర్శి చింతకాయల అజయ్ కుమార్ అన్నారు. మెదక్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన చేపట్టారు. గత వారం రోజుల క్రితం ఢిల్లీలోని JNU యూనివర్సిటీలో కొంత మంది మతోన్మాద సంఘాల నాయకులు సమస్యలపై ప్రశ్నించిన విద్యార్థులపై అలాగే అధ్యాపకులపై దూషించారన్నారు.

February 27, 2026 / 04:42 PM IST

రామయ్య సేవలో శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్ తురైరాజా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు అర్చకులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. ముత్యాల గర్భాలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

February 27, 2026 / 04:42 PM IST

హోంబలే ఫిల్మ్స్ కీలక ప్రకటన

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టింది. భారతీయ కథలను ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో ఇకపై తమ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా సొంతంగానే విడుదల చేయనుంది. ప్రస్తుతం హోంబలే చేతిలో ‘కాంతార-2’, ‘సలార్-2’, ఎన్టీఆర్-నీల్ ‘డ్రాగన్’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.

February 27, 2026 / 04:42 PM IST

18 ఏళ్లు పోరాడినా న్యాయం జరగలేదు: ఆయేషా తండ్రి

AP: 18 ఏళ్లు పోరాడినా న్యాయం జరగలేదని ఆయేషా తండ్రి ఇక్బాల్ ఆరోపించాడు. ‘ఆడపిల్ల హత్యకు గురైతే సాక్ష్యం లేదని కేసు మూసేశారు. దర్యాప్తును నీరుగార్చడం వల్లే న్యాయం జరగలేదు. అనుమానితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. డిసెంబర్ 27 ఆయేషా సంస్మరణ దినంగా ప్రకటించాలి. ఆయేషా పేరుపై ట్రస్ట్ ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్ చేశాడు.

February 27, 2026 / 04:41 PM IST

ప్రతి వ్యక్తికి గుర్తింపుతో పాటు భద్రత

ELR: జనసేన పార్టీ సభ్యత్వం ప్రతి వ్యక్తికి గుర్తింపుతో పాటు భద్రతను కూడా కల్పిస్తుందని, కొత్త తరం నాయకులను తీర్చిదిద్దే సంకల్పంతో పార్టీ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు సమావేశంలో ఆయన మాట్లాడారు.కేవలం 100 మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీ గత ఎన్నికల నాటికి 6 లక్షల సభ్యత్వాన్ని సాధించిందన్నారు.

February 27, 2026 / 04:41 PM IST

పిడుగురాళ్లలో ఉపాధ్యాయుల ధర్నా

PLD: పిడుగురాళ్లలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 30% మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి, పెండింగ్ డీఏలు చెల్లించాలని కోరారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.

February 27, 2026 / 04:41 PM IST

‘అన్ని సమస్యలను పరిష్కరిస్తా’

ADB: ప్రజలకు ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచ్ చునార్కర్ సతీష్ అన్నారు. శుక్రవారం వాంకిడి మండల కేంద్రంలోని రాంనగర్ కాలనిలో ఉన్న నీటి చేతిపంపు చెడిపోయి కొన్ని నెలలుగా అలాగే ఉంది. దీంతో సమస్య ఆయన దృష్టికి రావడంతో చేతిపంపుకు మరమ్మతులు చేసి నీటిని సరఫరా చేశారు. ఈ మేరకు ప్రజలు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

February 27, 2026 / 04:39 PM IST

‘భూదాన్ భూములు నిరుపేదలకే దక్కాలి’

KMM: వెలుగుమట్ల భూదాన్ భూములు నిరుపేదలకే దక్కాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం అత్యంత దుర్మార్గమని చెప్పారు. అర్హులైన పేదలకు న్యాయం చేయాలన్నారు.

February 27, 2026 / 04:39 PM IST

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం: MLA

MHBD: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పత్ర కీలకమని ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు. కేసముద్రం రైతు వేదికలో మండల ప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. కార్యాలయాల్లో పనులకు నిమిత్తం సతులకు బదులు పతులు వెళ్ళొద్దని, ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో పయనించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

February 27, 2026 / 04:39 PM IST

రేపు లక్ష్మీకాసుల హారంతో శ్రీవారి గరుడ సేవ

CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వేంకటరమణ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి గరుడసేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. గరుడ వాహనసేవలో పట్టణంలోని తూర్పు మొగశాల వద్ద గల శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వెండి కాసుల హారం ఆలయం నుంచి సాయంకాలం మూడు గంటలకు శోభాయాత్రగా పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 04:38 PM IST