TG: ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వైద్యులు మానవతా దృక్పథంతో సేవలందించాలని సూచించారు. వైద్య విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. రూ.900 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు.
BHPL: కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో నిర్వహించిన సూర్య భగవాన వాహన సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. జాతర మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్యే కోరారు.
BHPL: టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామంలో వ్యవసాయ అధికారి కళ్యాణి వరి పంట పొలాలను పరిశీలించారు. ప్రస్తుత వాతావరణంలో అగ్గి తెగులు, కాండం పురుగు ఉధృతి పెరుగుదలతో తెల్ల కంకులు ఏర్పడి దిగుబడి తగ్గే అవకాశముందని గుర్తించారు. రైతులు తగిన మందులు సమయానికి పిచికారీ చేసి, జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏవో సూచించారు.
KDP: వ్యవసాయ దొంగతనాలు కమలాపురం(మం) రైతులను కలవరపెడుతున్నాయి. బోర్ల మోటార్లు, స్టార్టర్లు, కాపర్ వైర్లు వరుసగా చోరీకి గురవుతున్నాయి. ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన చర్యలు లేవని రైతులు ఆరోపిస్తున్నారు. వరుస నష్టాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను కోరుతున్నారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న లైబ్రరీ భవన నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవ వల్ల లైబ్రరీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు వారు తెలిపారు.
AP: జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేశారని ఎమ్మెల్యే అఖిలప్రియ అన్నారు. అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ మొదలు పెట్టారని తెలిపారు. మట్టి పనులు చేసి రూ.800 కోట్లు దోచుకున్నారని చెప్పారు. పెద్దిరెడ్డి కంపెనీకి జగన్.. పాలమూరు- రంగారెడ్డి టెండర్లు ఇప్పించారని ఆరోపించారు. రాయలసీమకు అన్యాయం చేసిన ద్రోహి జగన్ అని మండిపడ్డారు.
MBNR: బాలానగర్ మండలం పెద్ద రేవల్లి గ్రామంలో శ్రీ తిరుమలనాథ దేవస్థానం సమీపంలో స్టోన్ కంపెనీ దుమ్ము కారణంగా గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారి మూగజీవాలు చనిపోతున్నాయి. వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరారు.
HNK: ఎల్కతుర్తి మండలంలోని మోడల్ స్కూల్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇంటర్ పరీక్షలు రాసి ఇంటికి వెళ్తున్న విద్యార్థుల బైకులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని MGM ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
PLD: గురజాల మండలం దైద అడ్డరోడ్డు వద్ద బైక్‌పై వెళ్తున్న తేలుకుట్ల గ్రామ టీడీపీ సీనియర్ నాయకుడు బత్తుల ఏడుకొండలపై వైసీపీకి చెందిన నేతలు రాడ్లతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గుంటూరులో చికిత్స పొందుతున్న ఏడుకొండలను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. దాడిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ATP: అనంతపురం నగరంలో జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. అహుడా (AHUDA) ఛైర్మన్, జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా సభ్యత్వ నమోదును పర్యవేక్షించారు. నగర ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభ్యత్వం తీసుకోవడం పార్టీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని వరుణ్ పేర్కొన్నారు.
SRPT: రైతు రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 28వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంటుందని అనంతగిరి మండల వ్యవసాయ అధికారి సతీష్ తెలిపారు. మండలంలో ఇంకా 5,020 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు. రిజిస్ట్రేషన్ లేని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల లబ్ధి అందదని ఆయన స్పష్టం చేశారు. వెంటనే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రైతులకు సూచించారు.
CTR: గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వే తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వం సరి చేస్తుండటంతో రైతుల్లో సంతృప్తి నెలకొందని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు పంపిణీ చేయడంపై అభినందనలు తెలిపారు. సర్వేలో జాప్యం ఏర్పడకుండా త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
అన్నమయ్య: ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా చౌడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 20.70 లక్షల విలువైన నిషేధిత కూల్-లిప్ పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లిలో 150 మంది పోలీసులతో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించి, 24 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. డ్రగ్స్, నిషేధిత పొగాకుపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు.
AP: శాసనమండలి రేపటికి వాయిదా పడింది. తిరుమల లడ్డూ అంశంపై మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇరుపక్షాల నినాదాల మధ్య మండలిని ఛైర్మన్ మోషేన్ రాజు వాయిదా వేశారు. తిరుమల లడ్డూ అంశంపై చర్చించకుండానే వాయిదా పడింది.
CTR: పుంగనూరు తహశీల్దార్ కార్యాలయంలో రేపు మండల స్థాయి విజలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు MRO రాము గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పక హాజరు కావాలని కోరారు.