• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు

టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు సాధించాడు. జింబాబ్వేతో నిన్న జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన అర్ష్‌దీప్.. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.. అర్ష్‌దీప్ 81 మ్యాచ్‌ల్లో 126 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

February 27, 2026 / 02:49 PM IST

గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

PLD: రాజాపేట ఏపీ గురుకుల పాఠశాలలో (బాలురు) 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటన విడుదలైంది. 5వ తరగతిలోని 80 సీట్లతో పాటు 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 24న జరగనుంది. ఎంపికైన వారికి వసతి, ఉచితంగా అందిస్తారు.

February 27, 2026 / 02:48 PM IST

‘పారిశుద్ధ్యంలో కోదాడ పట్టణాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం’

SRPT: కోదాడ పట్టణ పారిశుద్ధ్యానికి ప్రజలు సహకరించాలని కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు గోపిరెడ్డి నగర్‌లో కౌన్సిలర్ తుమ్మల నాగేంద్రమ్మతో కలిసి దోమల మందు పిచికారీలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పారిశుద్ధ్యంలో కోదాడ పట్టణాన్ని జిల్లాలో అగ్ర స్థానంలో నిలుపుతామన్నారు.

February 27, 2026 / 02:48 PM IST

వెదురుకుప్పంలో సేవల కేంద్రం ప్రారంభం

CTR: వెదురుకుప్పం మండల కేంద్రంలో దిగువ పల్లాలు గ్రామానికి చెందిన బోడిరెడ్డి మోహన్ రెడ్డి తన సొంతంగా ఫోటో స్టూడియో, సాధారణ సేవల కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన సేవలు ఒకే చోట అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు.

February 27, 2026 / 02:46 PM IST

మెడికవర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

HYD: డయాలసిస్ కోసం వచ్చిన సాగర్ మృతిచెందడంతో పుప్పాలగూడలోని మెడికవర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఘటనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు వైద్యులతో ప్రత్యేక బృందం పోస్టుమార్టం నిర్వహించారు.

February 27, 2026 / 02:44 PM IST

నాన్న ఆరోగ్యంగా ఉన్నారు: బొత్స కూతురు

AP: మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురై HYDలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆయన కుమార్తె అనూష స్పందించారు. ‘మా నాన్న పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. బీపీ ఎక్కువగా ఉండడంతో టెస్టులు చేస్తున్నారు. మండలి అయ్యాక రేపు వెళ్లాలనుకున్నాం కానీ.. నీరసంగా ఉండడంతో ఒకరోజు ముందే హైదరాబాద్ చేరుకున్నాం’ అని తెలిపారు.

February 27, 2026 / 02:44 PM IST

మార్చి 16 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు: కలెక్టర్

కోనసీమ: ఉన్నత చదువులకు తొలి మెట్టైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై వివరాలు శుక్రవారం తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు.

February 27, 2026 / 02:44 PM IST

నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన

E.G: ప్రజల సంక్షేమం, నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ ముసాయిదాపై అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత ఆదాయ వనరులు, పన్నులు, పన్నేతర ఆదాయ వనరులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లకు సంబంధించిన పద్దులపై సుదీర్ఘంగా చర్చించారు.

February 27, 2026 / 02:44 PM IST

ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే

BDK: బూర్గంపాడు గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ గంగా పార్వతి సమేత అగస్త్యేశ్వర స్వామి వారి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ట, మహోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాంత ప్రజల సుఖశాంతి, ఐశ్వర్యాల కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.

February 27, 2026 / 02:43 PM IST

భోజన నాణ్యతను పరిశీలించిన సర్పంచ్

BDK: విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను సర్పంచ్ ప్రేమేందర్ నాయక్ పరిశీలించారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని ప్రధానోపాధ్యాయురాలు భద్రమ్మ కోరగా, సర్పంచ్ సానుకూలంగా స్పందించి త్వరలోనే పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 02:43 PM IST

‘రాజమండ్రి నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన’

తూ.గో: ప్రజల సంక్షేమం, నగరాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో బడ్జెట్ ముసాయిదాపై అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంత ఆదాయ వనరులు, పన్నులు, పన్నేతర ఆదాయ వనరులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లకు సంబంధించిన పద్దులపై సుధీర్ఘంగా చర్చించారు.

February 27, 2026 / 02:42 PM IST

కారు కొంటే రూ.10 వేలు.. కొత్త సెస్‌

TG: రాష్ట్రంలో వాహన కొనుగోలుదారులకు అదనపు భారం పడనుంది. ప్రభుత్వం మార్చి 1 నుంచి రోడ్డు భద్రత సెస్ అమలు చేయాలని నిర్ణయించింది. ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రమాద నివారణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాల చట్టం యాక్ట్ 1963కు సవరణలు చేసిన నేపథ్యంలో ఈ కొత్త సెస్ అమల్లోకి రానుంది.

February 27, 2026 / 02:42 PM IST

‘జనసేన సభ్యత్వ నమోదుతో రూ.5 లక్షల ప్రమాద బీమా’

కోనసీమ: జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం ఈనెల 26 నుంచి ప్రారంభమైందని ఆ పార్టీ మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య తెలిపారు. చొప్పెల్ల గ్రామంలో పార్టీ నియమించిన నాయకులతో శుక్రవారం సభ్యత్య కార్యక్రమాన్ని నిర్యహించారు. కొణిదల పవన్ కళ్యాణ్ సభ్యత్వ రుసుమును రూ.400కు తగ్గించారని, సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పించనున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 02:39 PM IST

ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

SRCL: వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

February 27, 2026 / 02:39 PM IST

గుంటూరులో అంగన్వాడీల నిరసన

GNTR: కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 3వ రోజుకు చేరుకున్నాయి. కనీస వేతనం రూ. 26 వేలు, గ్రాట్యుటీ, మే నెల సెలవులు కల్పించాలని సీఐటీయూ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దీక్షలో పాల్గొన్న అంగన్వాడీలు, సమస్యల పరిష్కారం కోసం మార్చి 2న చేపట్టే ‘చలో విజయవాడ’ను విజయవంతం చేయాలని యూనియన్ అధ్యక్షురాలు రమణ పిలుపునిచ్చారు.

February 27, 2026 / 02:37 PM IST