• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

సత్యసాయి: పుట్టపర్తిలోని గ్రీన్ భారత్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం మంగళవారం ప్రారంభమైంది. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఒకటో సచివాలయం రోడ్డులో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల మహిళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేంద్రాన్ని సందర్శించి శిక్షణ పొందవచ్చని నిర్వాహకుడు ఆదినారాయణ తెలిపారు.

February 24, 2026 / 02:00 PM IST

రేపే మెగా జాబ్ మేళా

NZB: జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం బుధవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బీ.ఫార్మా, డీ. ఫార్మా, ఎం. ఫార్మా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. వయస్సు 18 నుంచి 35 లోపు అర్హులని వెల్లడించారు.

February 24, 2026 / 02:00 PM IST

మార్చి 10 నుంచి పోస్ట్ కార్డుల ఉద్యమం: అనంత

ATP: జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న RDT సంస్థకు FCRA రెన్యువల్ కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడుతున్నామని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 10 నుంచి లక్షలాది మందితో ప్రధానికి పోస్ట్ కార్డులు పంపుతామని ప్రకటించారు.

February 24, 2026 / 02:00 PM IST

వచ్చే నెల 10 నుంచి పోస్ట్ కార్డుల ఉద్యమం: అనంత

ATP: జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న RDT సంస్థకు FCRA రెన్యువల్ కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడుతున్నామని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 10 నుంచి లక్షలాది మందితో ప్రధానికి పోస్ట్ కార్డులు పంపుతామని ప్రకటించారు.

February 24, 2026 / 02:00 PM IST

‘భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకం’

WNP: రాబోయే రోజుల్లో ప్రజల భూసమస్యల పరిష్కారంలో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని, కాబట్టి నూతన లైసెన్సు సర్వేయర్లు నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఇవాళ జిల్లా సర్వేశాఖ ఆధ్వర్యంలో ఐడీవోసీ సమావేశ మందిరంలో నూతన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

February 24, 2026 / 02:00 PM IST

అపచారం చేస్తే శిక్ష తప్పదు: సీఎం చంద్రబాబు

AP: దివంగత సీఎం వైఎస్సార్ ఉన్నప్పుడే తిరుమలలో ఈ రకమైన చర్యలు మొదలయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల శ్రీవారివి ఏడు కొండలు కాదు.. రెండు కొండలు మాత్రమే అని వైఎస్సార్ హయాంలో జీవో ఇచ్చారని తెలిపారు. దీనిపై రెండేళ్ల పాటు ఆందోళనలు జరిగేతే వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. వేంకటేశ్వరస్వామికి అపచారం చేస్తే ఈ జన్మలోనే శిక్ష తప్పదని ఆరోపించారు.

February 24, 2026 / 01:58 PM IST

‘అవయవ దానం ద్వారా మరణించినా జీవించవచ్చు’

VZM: మరణించిన తర్వాత కూడా జీవించాలంటే అవయవ దానం చేయాలని అఖిలభారత శరీర అవయవ దాతల సంఘం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ పిలుపునిచ్చారు. రాజాం, పొందూరు, చీపురుపల్లి కళాశాలల్లో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. అవయవ దానం ద్వారా మరికొందరికి ప్రాణాలు నిలుపవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు.

February 24, 2026 / 01:51 PM IST

కల్తీ పాలు కలకలం.. టీ తాగాలంటనే భయం

E.G: “హే చాయ్ తాగరా భాయ్” అంటూ ఆనందంగా ‘టీ’ తాగే వారు నేడు జంకుతున్నారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన ఉమ్మడి జిల్లాను వణికిస్తోంది. లాలాచెరువు ప్రాంతంలో పాలు తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో, మనం తాగే టీ, కాఫీలు క్షేమమేనా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. నిత్యం చాయ్, బిస్కెట్‌కు అలవాటు పడిన జనం, కల్తీ భయంతో ఇప్పుడు ‘టీ’ తాగాలంటేనే భయపడుతున్నారు.

February 24, 2026 / 01:50 PM IST

పెళ్ళికి అండగా నిలిచిన తోటి విద్యార్థులు

VZM: కొత్తవలస మండలం చీపురువలస గ్రామానికి చెందిన కారుకొండ నూకరాజు కూతురు ఆర్థిక స్థోమతతో కుంగిపోయింది. ఆమె కూతురు పెళ్లి విషయాన్ని తండ్రికి తెలపగా, తనతోపాటు పదోతరగతి కలసి చదువుకొన్న తోటి విద్యార్థులకు తన కూతురు బాధను స్నేహితులకు చెప్పడంతో రూ.1,20,116 నగదును సమకూర్చి వివాహా నిమిత్తం మంగళవారం అతనికి అందజేశారు.

February 24, 2026 / 01:49 PM IST

పెనుమంట్ర-2లో 104 ఉచిత వైద్య శిబిరం

W.G: పెనుమంట్ర-2 సచివాలయం పరిధిలో మంగళవారం 104 వాహనం ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి, స్థానికులకు మధుమేహం, రక్తపోటు వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో, ఏఎన్ఎం లక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది, మేల్ అసిస్టెంట్ పాల్గొన్నారు.

February 24, 2026 / 01:48 PM IST

‘ది కేరళ స్టోరీ 2’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

‘ది కేరళ స్టోరీ 2’పై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా రాష్ట్ర ప్రతిష్టను, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందన్న పిటిషన్‌పై విచారణ చేపట్టింది. కేరళను తప్పుగా చిత్రీకరించడం వల్ల ఉద్రిక్తతలు తలెత్తే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సెన్సార్ సర్టిఫికేట్‌పై నిర్ణయం తీసుకునే ముందు, ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని కోర్టు నిర్మాతలను ఆదేశించింది.

February 24, 2026 / 01:46 PM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

కృష్ణా: మచిలీపట్నానికి చెందిన కర్ల శేషలతకు వైద్య ఖర్చులు నిమిత్తం మంజూరైన రూ.24001 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్ ఈరోజు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. శేషలత వైద్య చికిత్స నిమిత్తం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారన్నారు.

February 24, 2026 / 01:45 PM IST

కల్వకుర్తిలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్ష

NGKL: న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, న్యాయవాదులు కృష్ణయ్య, ప్రశాంత్, జంగయ్య తదితరులు కూర్చున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే న్యాయవాదుల రక్షణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.

February 24, 2026 / 01:43 PM IST

‘గ్రంథాలయ సెస్‌లు విడుదల చేయాలి’

SKLM: జిల్లా గ్రంథాలయ సంస్థకు పట్టణ, గ్రామీణ పంచాయతీల నుంచి రావలసిన ఎనిమిది శాతం గ్రంథాలయ సెస్సులను విడుదల చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకర్రావు కోరారు. సారవకోట మండల కేంద్రంలోని శాఖా గ్రంధాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా గ్రంధాలయ సంస్థలో 70 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందన్నారు.

February 24, 2026 / 01:42 PM IST

నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక: చంద్రబాబు

AP: 2020 JAN, FEBలో టెండర్ల నిబంధనలను మార్చారని CM చంద్రబాబు అన్నారు. 2022 మేలో భోలేబాబా సంస్థపై ఫిర్యాదు, విచారణకు ఆదేశించారని తెలిపారు. 2022 ఆగస్టులో బీటా సిటోస్టిరాల్‌తో నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చిందన్నారు. సీఎఫ్ టీఆర్ఐ ల్యాబ్ రిపోర్టు వస్తే తొక్కిపెట్టారని తెలిపారు. లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని NDDB ఇచ్చిన రిపోర్టునే తాను చెప్పానని పేర్కొన్నారు.

February 24, 2026 / 01:41 PM IST