• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తుని-అన్నవరం మధ్య రానున్న కొత్త ఎయిర్ పోర్టులు

KKD: రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 9 ఎయిర్ పోర్టులు నిర్మించే ప్రణాళికలో భాగంగా తుని – అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గు చూపింది. తొలుత కరప మండలం గురజానాపల్లిలోని సాల్ట్ భూములను పరిశీలించినా, సాంకేతిక కారణాలతో తుని ప్రాంతాన్ని ఎంపిక చేస్తూ డీపీఆర్ సిద్ధం చేశారు.భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఇక్కడే నిర్మాణం చేయనున్నారు.

February 21, 2026 / 12:21 PM IST

‘బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలి’

AKP: బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టాలని కోటవురట్ల డిప్యూటీ ఎంపీడీవో కూర్మారావు విజ్ఞప్తి చేశారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర‌ కార్యక్రమంలో భాగంగా ‌కోటవురట్లలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కూర్మారావు మాట్లాడుతూ.. ప్రజలు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. చెత్తను ‌ ఎప్పటికప్పుడు తొలగించి సంపద కేంద్రాలకు తరలించాలన్నారు.

February 21, 2026 / 12:20 PM IST

ఇంటింటా తడి–పొడి చెత్త సేకరణలో కలెక్టర్

GNTR: పరిశుభ్రమైన పరిసరాలే మన లక్ష్యమని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్రా–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మేడికొండూరు మండలం పేరిచర్లలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద మొక్కలు నాటి, గ్రామంలో చెత్త ఊడ్చే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

February 21, 2026 / 12:19 PM IST

పలమనేరులో “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర” ర్యాలీ

CTR: పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి ఆధ్వర్యంలో “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర” ర్యాలీ శనివారం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వరకు కొనసాగింది. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని కోరారు. ప్రతి వార్డులో శానిటేషన్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు.

February 21, 2026 / 12:18 PM IST

రేపు బైరెడ్డిపల్లికి ఎమ్మెల్యే పర్యటన

CTR: పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి బైరెడ్డిపల్లిలో ఆదివారం పర్యటించనున్నట్లు ఎంపీడీవో ఉపేంద్ర తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖల పురోగతి నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు.

February 21, 2026 / 12:15 PM IST

డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వసతుల లేమి..!

NZB: ధర్పల్లి మడల కేంద్రంలో పంపిణీ చేసిన 48 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. రెండు నెలల క్రితం ఇళ్లు కేటాయించగా, ఇటీవల గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని, అధికారులు వెంటనే స్పందించి వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

February 21, 2026 / 12:15 PM IST

మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

MDK: జిల్లాలోని మీడియా ప్రతినిధులకు 2026-28 సంవత్సరాలకు కొత్త అక్రిడిటేషన్‌ల జారీ కోసం నూతన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ (DMAC) ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సంఘాలు తమ ప్రతినిధి పేరును లెటర్ ప్యాడ్‌పై రాసి ఈనెల 23న ఉదయం 11 గంటలలోపు అందజేయాలని సూచించారు.

February 21, 2026 / 12:14 PM IST

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి

ప్రకాశం: జరుగుమల్లిలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా చెత్త ఊడ్చి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

February 21, 2026 / 12:11 PM IST

ఘనంగా మాతృభాషా దినోత్సవం

CTR: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శనివారం పుంగనూరు కొత్తయిండ్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా విజ్ఞాన వికాస సమితి అధ్యక్షలు రెడ్డప్ప రెడ్డి యాదవ్ నిర్వహించారు. ఈసందర్భంగా అయన విద్యార్థులను ఉద్దేశించి అయన ప్రశాంగించారు. అమ్మ వంటి మాతృభాషను ఎన్నటికీ మరవకూడదన్నారు. తెలుగు భాష యొక్క ఔన్నత్యం గురించి వివరించారు.

February 21, 2026 / 12:11 PM IST

వ్యవసాయ బావిలో మృతదేహం లభ్యం

JGL: కోరుట్ల పట్టణ శివారు డీ- 40 కెనాల్ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో ఓ మృతదేహం లభించింది. ఆ మృతదేహం మేడిపల్లి మండలం కంట్లకుంట గ్రామానికి చెందిన గుండంపల్లి శంకర్‌గా పోలీసులు గుర్తించారు. కాగా శంకర్ ఈ నెల 13న మెట్‌పల్లిలో అత్తగారింటికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి రాలేదని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిరంజీవి తెలిపారు.

February 21, 2026 / 12:11 PM IST

అగ్రికల్చర్ జేడీ నివాసంలో ఏసీబీ దాడులు

SRPT: గరిడేపల్లి మండలం పొనుగోడులో ఇవాళ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ సుందర్ కిరణ్ కుమార్ (మాజీ DRDA PD) నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయన స్వగృహం, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

February 21, 2026 / 12:10 PM IST

గడువు పెంపు.. రైతులకు GOOD NEWS

TG: రాష్ట్రంలో పత్తి రైతులకు ఊరట లభించింది. ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్ల గడువును సీసీఐ పొడిగించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ, రైతులందరూ ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియ వేగంగా జరిగేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

February 21, 2026 / 12:10 PM IST

DDU-GKYలో ఉచిత నర్సింగ్ శిక్షణ

మహబూబ్ నగర్లో DDU-GKY & స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నిరుద్యోగ యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నారని కో-ఆర్డినేటర్ రవికుమార్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఎంపికైన వారికి ఉచిత శిక్షణ, వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. దరఖాస్తులు ఈ నెల 23వ తేదీకి ముందే చేయాలని, 9949698592లో సంప్రదించాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 12:09 PM IST

IND vs SA.. చెరోవైపు అన్నదమ్ములు

T20 WC: సూపర్-8లో భాగంగా రేపు భారత్ vs సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఇందులో అన్న ఆల్బీ మోర్కెల్(SAస్పెషలిస్ట్ కన్సల్టెంట్), తమ్ముడు మోర్నే మోర్కెల్(IND బౌలింగ్ కోచ్) కూడా కోచ్‌గా తలపడనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కలిసి ఆడిన బ్రదర్ జోడీలు ఎన్నో ఉన్నా కోచ్‌లుగా ప్రత్యర్థి స్థానంలో తలపడటం దాదాపు ఇదే తొలిసారి. మరి ఈ అన్నదమ్ముల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

February 21, 2026 / 12:09 PM IST

ఘనంగా ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలు

KDP: బద్వేలులో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే డా. సుధ శుభాకాంక్షలు తెలిపారు. యద్దారెడ్డి స్వగృహంలో మాజీ కుడా చైర్మన్ గురుమోహన్ అభినందనలు తెలియజేశారు. ఆనంద నిలయంలో వైసీపీ నాయకులు సింగనమల వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు.

February 21, 2026 / 12:08 PM IST