• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు తొలగింపుపై కేసు నమోదు

MDK: తూప్రాన్ పట్టణం మూడో వార్డులో సీసీ రోడ్డు తొలగింపు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. మూడో వార్డులో అనుమతి లేకుండా బాలు సీసీ రోడ్డును తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. రోడ్డును తొలగించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించినట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు.

March 5, 2026 / 07:30 PM IST

ద్విచక్ర వాహనంపై నుంచి పడి తీవ్ర గాయాలు

NZB: నవీపేట్ మండలం కమలాపూర్ నుంచి నిజామాబాద్ వెళ్లే రహదారిపై గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు.

March 5, 2026 / 07:30 PM IST

‘ప్రజలు ఐక్యతతో పండుగలు జరుపుకోవాలి’

MBNR: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కౌకుంట్ల మండల కేంద్రంలోని జామియా మసీదులో ముస్లిం సోదరులకు గురువారం సాయంత్రం తెలంగాణ బ్యాంకు ఉద్యోగి శ్రీనివాసులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్నీ మతాల ప్రజలు ఐక్యతతో పండుగలు జరుపుకోవాలని శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అనంతరం ముస్లిం సోదరులు బ్యాంక్ శ్రీనుకు శాలువాతో ఘనంగా సన్మానించారు.

March 5, 2026 / 07:29 PM IST

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

PLD: నరసరావుపేట సమీపంలోని సాతులూరు రైల్వే స్టేషన్ వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మృతుడు కాషాయం రంగు దుస్తులు ధరించి ఉన్నారని, ఆయన భిక్షాటన చేసే వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 5, 2026 / 07:28 PM IST

‘టిడ్కో ఇళ్లను త్వరలో పూర్తి చేస్తాం’

VSP: రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ తరాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 2050 నాటికి పట్టణ జనాభా 50%కు చేరే అవకాశముందని అన్నారు.

March 5, 2026 / 07:28 PM IST

ఈనెల 9న ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవలు రద్దు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి మూడు రోజుల పాటు మహా కుంభాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దుర్గగుడి అధికారులు భక్తులకు కీలక సూచన చేశారు. ఈనెల 8వ తేదీ వరకు అమ్మవారి అంతరాలయ దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈనెల 9వ తేదీ వరకు అన్ని రకాల ఆర్జిత సేవలను సైతం రద్దు చేసినట్లు వెల్లడించారు.

March 5, 2026 / 07:28 PM IST

‘విద్యుత్ సమస్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్’

KNR: విద్యుత్ మెటీరియల్ త్వరగా విడుదల చేయడానికి, మెటీరియల్‌ను త్వరగా డ్రా చేసుకోవడానికి ఈ స్టోర్ల ద్వారా ఆన్లైన్ సౌకర్యం అందిస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. వాట్సాప్ చాట్ ప్రవేశ పెట్టడం జరిగిందని, దీని ద్వారా సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు 7901628348 ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని అన్నారు.

March 5, 2026 / 07:28 PM IST

సీనియర్ అసిస్టెంట్‌కు వినతి

WGL: వృద్ధులకు వికలాంగులకు నూతన పెన్షన్ మంజూరు చేయాలని ఇవాళ MCPIU పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి జన్ను రమేష్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల కాలం నుంచి వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ రాలేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి కోరారు.

March 5, 2026 / 07:28 PM IST

‘మ్యూజియంను త్వరితగతిన పూర్తి చేయాలి’

ASR: ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో శ్రీపూజ అధికారులను ఆదేశించారు. గురువారం చింతపల్లి మండలం లంబసింగిలో నిర్మాణంలో ఉన్న ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంను సందర్శించారు. మ్యూజియం నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి కార్మికుల సంఖ్య పెంచాలన్నారు.

March 5, 2026 / 07:28 PM IST

పోగొట్టుకున్న నగదు అందజేసిన పోలీసులు

ELR: దెందులూరు మండలం కొవ్వలికి చెందిన భగవాన్ సత్తుపల్లి వెళ్లేందుకు గురువారం బస్ ఎక్కే సమయంలో జేబులో ఉన్న రూ.50,000 పోగొట్టుకున్నారు. వెంటనే ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సిఐ అశోక్ కుమార్, ఎస్‌ఐ మధు వెంకట రాజా వెంటనే స్పందించి సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. పోలీసుల వేగవంతమైన చర్యలతో కేవలం గంటలోనే నగదు తిరిగి అందజేశారు.

March 5, 2026 / 07:27 PM IST

ఇఫ్తార్ వేడుకలలో పాల్గొన్న మాజీ మున్సిపల్ ఛైర్మన్

MBNR: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో గురువారం నిర్వహించిన ఇఫ్తార్ వేడుకలలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లా ఆశీస్సులతో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కాంక్షించారు. కార్యక్రమంలో రెండవ పట్టణ సీఐ ఐజాజుద్దీన్, మైనార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

March 5, 2026 / 07:25 PM IST

పిల్లలు, వృద్ధులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌, జగిత్యాల, ఖమ్మంలో 38.9 డిగ్రీలు, మంచిర్యాలలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని, వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

March 5, 2026 / 07:24 PM IST

అభిషేక్ ఔట్… సంజూ శాంసన్ క్యాచ్ మిస్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌లో అభిషేక్ శర్మ కేవలం 9 పరుగులకే ఔట్ అయ్యాడు. విల్ జాక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అలాగే, ఆర్చర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జారవిడిచాడు. ప్రస్తుతం సంజూ(31), కిషన్(15) క్రీజులో ఉన్నారు. భారత్ 5 ఓవర్లలో 55/1

March 5, 2026 / 07:24 PM IST

A2 పాలు, నెయ్యితో పాడిరైతుకు సుస్థిర ఆదాయం: కలెక్టర్

NTR: దేశీయ గోవుల నుంచి ఉత్పత్తి అయ్యే A2 పాలు, నెయ్యి ద్వారా పాడి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. గురువారం వ‌త్స‌వాయి మండ‌లం, కంభంపాడులోని చేకూరి ర‌మేష్‌బాబుకు చెందిన సాయిశ్రీనివాస గోశాల‌ను సంద‌ర్శించారు. దేశీ జాతి ఆవుల నుంచి వచ్చే A2 పాలు, వాటితో తయారు చేసే నెయ్యి, పెరుగు వంటి పాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాం...

March 5, 2026 / 07:23 PM IST

డాక్టర్‌కి మహిళా దినోత్సవ పురస్కారం

VZM: మహిళా సాధికారితకు సమానత్వమే పునాది అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. 2026 సంవత్సరానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారాన్ని స్వప్న హైందవికి ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్, పెనుగొండ కామరాజుతో కలిసి ఓ స్కూల్లో ప్రదానం చేశారు. జననియే జగతికి ఆధారం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

March 5, 2026 / 07:23 PM IST