• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైసీపీ పాలనలో ఊహించని విధ్వంసం: చంద్రబాబు

AP: వైసీపీ పాలనలో ఊహించని విధంగా విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని పునఃనిర్మాణం చేయాలని మూడు పార్టీలు భావించినట్లు తెలిపారు. ‘YCP వ్యతిరేక ఓటు చీలకూడదని ఎన్నికల్లో ఒక్కటయ్యాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో పని చేస్తున్నాయి. దారుణమైన ఆర్థిక వ్యవస్థ మనకు వారసత్వంగా వచ్చింది. ఈరోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి’ అని తెలిపారు.

March 6, 2026 / 01:20 PM IST

కమ్మర్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

NZB: కమ్మర్‌పల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సొంత ఇల్లు లభించినందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

March 6, 2026 / 01:20 PM IST

ఉమాపై నమోదైన మూడు కేసులు కొట్టివేత

NTR: గత ప్రభుత్వ హయాంలో నమోదైన మూడు కేసుల విచారణలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఊరట లభించింది. విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం జరిగిన వాదనలు విన్న అనంతరం కేసుల్లో సరైన ఆధారాలు లేవని గుర్తించిన న్యాయస్థానం మూడు కేసులను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో దేవినేని ఉమాతోపాటు టీడీపీ నేతలకు ఊరట లభించింది.

March 6, 2026 / 01:20 PM IST

‘ఈనెల 15లోగా పన్నులు వసూళ్లు చేయాలి’

AKP: ఇంటి పన్నుల వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జడ్పీ సీఈవో నారాయణమూర్తి ఆదేశించారు. ఈ మేరకు పాయకరావుపేట ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 6, 2026 / 01:19 PM IST

ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు

CTR: పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో శుక్రవారం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ చల్లా బాబు ప్రజా ధర్బార్ నిర్వహించారు. సదుం, సోమల, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని చల్లా బాబు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

March 6, 2026 / 01:17 PM IST

TEA BREAK: భారత్ స్కోర్ ఎంతంటే? 

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ బ్యాటర్లు తడబడుతున్నారు. దీంతో భారత్ టీ బ్రేక్ సమయానికి 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 99 రన్స్ చేసింది. దీప్తి శర్మ(4), జెమీమా(15) క్రీజులో ఉండగా.. అంతకుముందు స్మృతి(4), షఫాలీ(35), ప్రతిక(18), కెప్టెన్ హర్మన్(19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ 2, డార్సీ, ల్యూసీ చెరో వికెట్ తీశారు.

March 6, 2026 / 01:17 PM IST

అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

SRPT: ఆత్మకూరు మండలం కోటి నాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారంగా మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

March 6, 2026 / 01:17 PM IST

‘మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరు కృషి చేయాలి’

VKB: మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యతతో కృషి చేయాలని వికారాబాద్ పట్టణ సీఐ రఘుకుమార్ కోరారు. ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్‌లో వాకర్స్‌కు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగంతో యువత నిండు ప్రాణాలను కోల్పోయి భవిష్యత్తును కోల్పోతుందన్నారు.

March 6, 2026 / 01:16 PM IST

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక ప్రతిజ్ఞ

BDK: అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యచరణ పై ఎంపీడీవో ముత్యాల రావు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ ప్రగతి ప్రణాళిక మీద మార్చి 6 నుండి జూన్ 12 వరకు చేయవలసిన పనులు మీద తగు సూచనలు చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మీద ఈ సమావేశానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు.

March 6, 2026 / 01:16 PM IST

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేద్దాం: ప్రిన్సిపల్

GDWL: నేటితరం విద్యార్థినులు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించాలి అని ప్రిన్సిపాల్ డా. A. మీనాక్షి పిలుపునిచ్చారు. శుక్రవారం గద్వాలలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎన్ఎస్ఎస్ (NSS), ఎకో క్లబ్ ఆధ్వర్యంలో క్లీన్ & గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 6, 2026 / 01:15 PM IST

మంత్రిని కలిసిన కలెక్టర్ ఆదర్శ్ సురభి

WNP: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి దామోదర రాజనర్సింహను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లాలోని పలు పరిపాలన, అభివృద్ధి అంశాలపై కలెక్టర్ మంత్రితో మాట్లాడారు.

March 6, 2026 / 01:15 PM IST

విద్యార్థులతో ఓపెన్ హౌస్ కార్యక్రమం

కడప: బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ రంగా రావు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, మహిళల భద్రత, పోక్సో చట్టం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు.

March 6, 2026 / 01:14 PM IST

వార్డు అభివృద్ధికి అభివృద్ధికి కృషి చేస్తా: కౌన్సిలర్

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన వీరేష్ యాదవ్ను శుక్రవారం స్థానిక ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కౌన్సిలర్‌ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్ మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, నేతలు తదితరులు ఉన్నారు.

March 6, 2026 / 01:13 PM IST

ఆర్కే వ్యాలీ సీఐగా సి. శంకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

కడప: జిల్లాలోని ఆర్కే వ్యాలీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సి. శంకర్ రెడ్డిని నియమిస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆర్కే వ్యాలీ సీఐగా పనిచేసిన ఉలసయ్యను కడప వీఆర్‌కు బదిలీ చేశారు. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సీఐగా ఉన్న సి. శంకర్ రెడ్డి శుక్రవారం ఆర్కే వ్యాలీ సీఐగా బాధ్యతలు స్వీకరించారు.

March 6, 2026 / 01:12 PM IST

ప్రజా పాలన సన్నాహక సభలో పాల్గొన్న ఎమ్మెల్యే

KMM: ఉమ్మడి జిల్లాలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అమలుపై నిర్వహించిన కీలక సన్నాహక సమావేశానికి వైరా శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యచరణను వైరా నియోజకవర్గంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

March 6, 2026 / 01:12 PM IST