• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్

AP: మండలిలో మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ‘రూ.వెయ్యి లోపు కిలో నెయ్యి దొరికితే కల్తీ అని అన్నారు. హెరిటేజ్‌ 750 ఎంఎల్‌ నెయ్యి రిలయన్స్‌లో రూ.456కి దొరుకుతుంది. హెరిటేజ్‌లో లీటర్‌ ఆవు నెయ్యి రూ.608కి దొరుకుతుంది. మరి మీరు అమ్మేది కల్తీనా?’ అని ప్రశ్నించారు. హెరిటేజ్ వెబ్‌సైట్ ఎందుకు మార్చారో చెప్పాలన్నారు.

February 24, 2026 / 02:07 PM IST

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి: హరీశ్ రావు

SDPT: రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో పరీక్షలు రాసే విద్యార్థులకు మాజీ మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలని, భయపడద్దని సూచించారు. కష్టపడి చదివిన దాన్ని ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. మీ మంచి భవిష్యత్‌కు ఇది పునాది లాంటిదని, పరీక్షలు బాగా రాయాలని కోరారు.

February 24, 2026 / 02:05 PM IST

‘పటిష్ట బందోబస్తు మధ్య ఇంటర్ పరీక్షలు’

GDWL: ఇంటర్ పరీక్ష సెంటర్ల వద్ద ఎవరైనా అల్లరి చేసినా లేదా కాపీయింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

February 24, 2026 / 02:05 PM IST

మండలం ఏర్పాటులో గందరగోళం.. ప్రజలకు తిప్పలు

SRPT: అనంతగిరి మండలంలో రెవెన్యూ, పోలీస్ పరిధుల మధ్య సమన్వయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2016లో 19 గ్రామాలతో మండలం ఏర్పడినా, తిమ్మాపురం, తమ్మరబండపాలెం వంటి గ్రామాల్లో గందరగోళం నెలకొంది. రెవెన్యూ పనులకు ఒకే చోట, పోలీస్ సేవల కోసం మరోచోట వెళ్లాల్సి వస్తుంది. ఈ విభజన సమస్యను పరిష్కరించి పాలనను క్రమబద్దీకరించాలని స్థానికులు కోరుతున్నారు.

February 24, 2026 / 02:03 PM IST

ఆధునిక గోదాముకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

KNR: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో 18,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన భారీ గోదాము నిర్మాణానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు పంట నిల్వ సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యమని అన్నారు.

February 24, 2026 / 02:01 PM IST

కనిగిరి టీడీపీ కార్యాలయంలో నేతల భేటీ

ప్రకాశం: సీఎం చంద్రబాబు దోర్నాల మండలంలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల శంఖస్థాపన, మార్కాపురం బహిరంగ సభ పర్యటన సందర్భంగా కనిగిరి టీడీపీ కార్యాలయంలో ప్రముఖ నేతలు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని మండల పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

February 24, 2026 / 02:01 PM IST

మణిపూర్ మూవీకి అవార్డు.. మోదీ ట్వీట్‌పై నెటిజన్ల ఆగ్రహం

మణిపురి చిత్రం ‘బూంగ్’ ప్రతిష్టాత్మక BAFTA 2026 అవార్డు గెలవడంపై ప్రధాని మోదీ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. మణిపూర్‌కు ఇది గర్వకారణమని ఆయన పేర్కొనగా.. నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ట్రం అట్టుడుకుతున్నప్పుడు స్పందించని ప్రధాని, ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడం బాధ్యతారాహిత్యమని ఫైరవుతున్నారు. సమస్యల నుంచి దృష్టి మళ్లించడమేనని మండిపడుతున్నారు.

February 24, 2026 / 02:01 PM IST

బుచ్చిలో పరీక్షకు 29 మంది గైర్హాజరు

NLR: బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు రాసిన విద్యార్థులు ఉత్సాహంగా బయటికి వచ్చారు. పరీక్షలు బాగా రాశామని సంతోషం వ్యక్తం చేశారు. రెండు పరీక్ష కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 620 మంది హాజరు కావాల్సి ఉండగా 591 మంది హాజరయ్యారు. 29 మంది గైరా హాజరైనట్లు అధికారులు తెలిపారు.

February 24, 2026 / 02:00 PM IST

కలెక్టర్‌ను కలిసిన జిల్లా వైద్యాధికారి

కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవీందర్ గౌడ్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కామారెడ్డిని అనారోగ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని వైద్యాధికారిని కోరారు.

February 24, 2026 / 02:00 PM IST

మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ

సత్యసాయి: పుట్టపర్తిలోని గ్రీన్ భారత్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం మంగళవారం ప్రారంభమైంది. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఒకటో సచివాలయం రోడ్డులో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల మహిళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేంద్రాన్ని సందర్శించి శిక్షణ పొందవచ్చని నిర్వాహకుడు ఆదినారాయణ తెలిపారు.

February 24, 2026 / 02:00 PM IST

రేపే మెగా జాబ్ మేళా

NZB: జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం బుధవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బీ.ఫార్మా, డీ. ఫార్మా, ఎం. ఫార్మా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. వయస్సు 18 నుంచి 35 లోపు అర్హులని వెల్లడించారు.

February 24, 2026 / 02:00 PM IST

మార్చి 10 నుంచి పోస్ట్ కార్డుల ఉద్యమం: అనంత

ATP: జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న RDT సంస్థకు FCRA రెన్యువల్ కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడుతున్నామని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 10 నుంచి లక్షలాది మందితో ప్రధానికి పోస్ట్ కార్డులు పంపుతామని ప్రకటించారు.

February 24, 2026 / 02:00 PM IST

వచ్చే నెల 10 నుంచి పోస్ట్ కార్డుల ఉద్యమం: అనంత

ATP: జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న RDT సంస్థకు FCRA రెన్యువల్ కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడుతున్నామని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 10 నుంచి లక్షలాది మందితో ప్రధానికి పోస్ట్ కార్డులు పంపుతామని ప్రకటించారు.

February 24, 2026 / 02:00 PM IST

‘భూ సమస్యల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర కీలకం’

WNP: రాబోయే రోజుల్లో ప్రజల భూసమస్యల పరిష్కారంలో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని, కాబట్టి నూతన లైసెన్సు సర్వేయర్లు నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఇవాళ జిల్లా సర్వేశాఖ ఆధ్వర్యంలో ఐడీవోసీ సమావేశ మందిరంలో నూతన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

February 24, 2026 / 02:00 PM IST

అపచారం చేస్తే శిక్ష తప్పదు: సీఎం చంద్రబాబు

AP: దివంగత సీఎం వైఎస్సార్ ఉన్నప్పుడే తిరుమలలో ఈ రకమైన చర్యలు మొదలయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల శ్రీవారివి ఏడు కొండలు కాదు.. రెండు కొండలు మాత్రమే అని వైఎస్సార్ హయాంలో జీవో ఇచ్చారని తెలిపారు. దీనిపై రెండేళ్ల పాటు ఆందోళనలు జరిగేతే వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. వేంకటేశ్వరస్వామికి అపచారం చేస్తే ఈ జన్మలోనే శిక్ష తప్పదని ఆరోపించారు.

February 24, 2026 / 01:58 PM IST