JN: ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. కొడకండ్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులతో వైస్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
KRNL: ఎస్‌ఎంఏ టైప్-1తో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే బాలిక చికిత్సకు సాయం చేసేందుకు మంత్రి లోకేష్ ముందుకొచ్చారు. ఈ స్థితిలోనూ ధైర్యంగా పునర్విక పోరాడుతున్న తీరును కొనియాడారు. ఆమె ఇంజక్షన్‌కు రూ.16 కోట్లు అవసరమని అయితే, ఇప్పటికే దాతలు స్పందించి రూ.10 కోట్లు సమకూర్చడం హర్షణీయమన్నారు. మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చడం తన బాధ్యతన్నారు.
KMM: వెలుగుమట్ల గ్రామ సర్వే నం. 147,148,149 భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు, స్వాధీన చర్యలు పూర్తిగా చట్టబద్ధమైన వని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇవాళ తెలిపారు. 31 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి ఆక్రమణలో ఉండగా, సంబంధిత భూమి మొత్తం విలువ సుమారు 250 కోట్లకు పైగా ఉంటుందని భారీ స్థాయి ఆస్తులను కాపాడగలిగామని ఆయన తెలిపారు.
NZB: ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు. పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో టేస్టింగ్ సాల్ట్ కృత్రిమ రంగులవాడుతున్నట్లు గమనించామన్నారు.
PDPL: గోదావరిఖని పట్టణంలో బుధవారం ఆర్ఎంపీ డాక్టర్ల మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా జవహర్ నగర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అన్వర్ ఇటీవల ఒక వ్యక్తికి సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా సదరు RMP వైద్యుడిని నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య యాదవ్ శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో 54వ డివిజన్ కార్పోరేటర్ ముస్తఫా పాల్గొన్నారు.
SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులకు బంగారు పతకాలు లభించాయి. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుండి 21 తేదీ వరకు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం 8 పతకాలు (4-బంగారు, 4-కాంస్య) సాధించడం పట్ల బుధవారం జిల్లా ఎస్పీ మహేష్ అభినందించారు.
GNTR: జిల్లాలో ‘అక్షర ఆంధ్రా’ కార్యక్రమం కింద అభ్యర్థులందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బుధవారం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో 90,426 మంది అభ్యాసకులు నమోదు చేసుకోగా, 9,043 మంది వాలంటీర్లు వీరికి విద్యాబోధన చేస్తున్నారని వివరించారు.
ADB: భీంపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ బుధవారం సందర్శించారు. స్టేషన్‌కు వచ్చిన ఆయనకు పోలీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్నందున ఆసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.
జింబాబ్వేతో రేపు జరగనున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా ఆడించాలని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపాడు. ఇషాన్ కిషన్‌ను వన్ డౌన్‌లో పంపించాలన్నాడు. దీంతో లెఫ్ట్&రైట్ ఓపెనింగ్ జోడీతో బౌలర్లపై ఆధిపత్యం సాధించవచ్చన్నాడు. ఒకవేళ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కకపోతే.. వన్ డౌన్‌లో సూర్య రావాలని సూచించాడు.
BDK: మణుగూరు పగిడేరు గ్రామంలో వేల్పుల శ్రీరాములు సుమలత దంపతుల కుమార్తె ప్రతానం వేడుకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధువును ఆశీర్వదించి, ఆమె భవిష్యత్తు సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగింది.
AKP: వైసీపీ రాష్ట్ర ఐటీ వింగ్ సెక్రటరీగా అనకాపల్లికి చెందిన బర్రే స్వరూప్ అఖిల్‌ను నియమించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు అందినట్లు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు, భరత్‌కు అఖిల్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
ఎస్‌ఎంఏ టైప్-1తో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక అనే బాలిక చికిత్సకు సాయం చేసేందుకు మంత్రి లోకేష్ ముందుకొచ్చారు. ఈ స్థితిలోనూ ధైర్యంగా పునర్విక పోరాడుతున్న తీరును కొనియాడారు. ఆమె ఇంజక్షన్‌కు రూ.16 కోట్లు అవసరమని.. అయితే, ఇప్పటికే దాతలు స్పందించి రూ.10 కోట్లు సమకూర్చడం హర్షణీయమన్నారు. మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చడం తన బాధ్యత అన్నారు.
NRPT: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో కొనసాగుతున్న సర్పంచుల శిక్షణ తరగతుల శిబిరాన్ని బుధవారం ఎస్పీ డాక్టర్ వినీత్తో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు మెచ్చేలా పరిపాలన అందించాలని చెప్పారు. వీధి దీపాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
MDK: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో రాజ్పల్లి జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రతిరోజూ రాత్రి 8 నుంచి 10 గంటల వరకు విద్యార్థుల ఇళ్లను సందర్శిస్తూ, వారి చదువును పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక సమయసారిణిని అందజేయడమే కాకుండా, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
JGL: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 30 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. జనరల్ కోర్సుల్లో 6,879 మంది, ఒకేషనల్లో 1,029 మంది హాజరుకాగా 253 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఎస్కేఎన్ఆర్ జూనియర్ కళాశాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ బి.ఎస్.లత పలు కేంద్రాలు సందర్శించారు. ఒక విద్యార్థి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు.