ప్రకాశం: సీఎం చంద్రబాబు దోర్నాల మండలంలో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల శంఖస్థాపన, మార్కాపురం బహిరంగ సభ పర్యటన సందర్భంగా కనిగిరి టీడీపీ కార్యాలయంలో ప్రముఖ నేతలు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని మండల పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
మణిపురి చిత్రం ‘బూంగ్’ ప్రతిష్టాత్మక BAFTA 2026 అవార్డు గెలవడంపై ప్రధాని మోదీ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. మణిపూర్‌కు ఇది గర్వకారణమని ఆయన పేర్కొనగా.. నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ట్రం అట్టుడుకుతున్నప్పుడు స్పందించని ప్రధాని, ఇప్పుడు క్రెడిట్ తీసుకోవడం బాధ్యతారాహిత్యమని ఫైరవుతున్నారు. సమస్యల నుంచి దృష్టి మళ్లించడమేనని మండిపడుతున్నారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు రాసిన విద్యార్థులు ఉత్సాహంగా బయటికి వచ్చారు. పరీక్షలు బాగా రాశామని సంతోషం వ్యక్తం చేశారు. రెండు పరీక్ష కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 620 మంది హాజరు కావాల్సి ఉండగా 591 మంది హాజరయ్యారు. 29 మంది గైరా హాజరైనట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవీందర్ గౌడ్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కామారెడ్డిని అనారోగ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని వైద్యాధికారిని కోరారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని గ్రీన్ భారత్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం మంగళవారం ప్రారంభమైంది. మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఒకటో సచివాలయం రోడ్డులో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆసక్తి గల మహిళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కేంద్రాన్ని సందర్శించి శిక్షణ పొందవచ్చని నిర్వాహకుడు ఆదినారాయణ తెలిపారు.
NZB: జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం బుధవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బీ.ఫార్మా, డీ. ఫార్మా, ఎం. ఫార్మా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. వయస్సు 18 నుంచి 35 లోపు అర్హులని వెల్లడించారు.
ATP: జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న RDT సంస్థకు FCRA రెన్యువల్ కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడుతున్నామని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 10 నుంచి లక్షలాది మందితో ప్రధానికి పోస్ట్ కార్డులు పంపుతామని ప్రకటించారు.
ATP: జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న RDT సంస్థకు FCRA రెన్యువల్ కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడుతున్నామని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 10 నుంచి లక్షలాది మందితో ప్రధానికి పోస్ట్ కార్డులు పంపుతామని ప్రకటించారు.
WNP: రాబోయే రోజుల్లో ప్రజల భూసమస్యల పరిష్కారంలో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని, కాబట్టి నూతన లైసెన్సు సర్వేయర్లు నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఇవాళ జిల్లా సర్వేశాఖ ఆధ్వర్యంలో ఐడీవోసీ సమావేశ మందిరంలో నూతన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
AP: దివంగత సీఎం వైఎస్సార్ ఉన్నప్పుడే తిరుమలలో ఈ రకమైన చర్యలు మొదలయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమల శ్రీవారివి ఏడు కొండలు కాదు.. రెండు కొండలు మాత్రమే అని వైఎస్సార్ హయాంలో జీవో ఇచ్చారని తెలిపారు. దీనిపై రెండేళ్ల పాటు ఆందోళనలు జరిగేతే వెనక్కి తగ్గారని గుర్తు చేశారు. వేంకటేశ్వరస్వామికి అపచారం చేస్తే ఈ జన్మలోనే శిక్ష తప్పదని ఆరోపించారు.
VZM: మరణించిన తర్వాత కూడా జీవించాలంటే అవయవ దానం చేయాలని అఖిలభారత శరీర అవయవ దాతల సంఘం ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ పిలుపునిచ్చారు. రాజాం, పొందూరు, చీపురుపల్లి కళాశాలల్లో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. అవయవ దానం ద్వారా మరికొందరికి ప్రాణాలు నిలుపవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు.
E.G: “హే చాయ్ తాగరా భాయ్” అంటూ ఆనందంగా ‘టీ’ తాగే వారు నేడు జంకుతున్నారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన ఉమ్మడి జిల్లాను వణికిస్తోంది. లాలాచెరువు ప్రాంతంలో పాలు తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో, మనం తాగే టీ, కాఫీలు క్షేమమేనా? అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. నిత్యం చాయ్, బిస్కెట్‌కు అలవాటు పడిన జనం, కల్తీ భయంతో ఇప్పుడు ‘టీ’ తాగాలంటేనే భయపడుతున్నారు.
VZM: కొత్తవలస మండలం చీపురువలస గ్రామానికి చెందిన కారుకొండ నూకరాజు కూతురు ఆర్థిక స్థోమతతో కుంగిపోయింది. ఆమె కూతురు పెళ్లి విషయాన్ని తండ్రికి తెలపగా, తనతోపాటు పదోతరగతి కలసి చదువుకొన్న తోటి విద్యార్థులకు తన కూతురు బాధను స్నేహితులకు చెప్పడంతో రూ.1,20,116 నగదును సమకూర్చి వివాహా నిమిత్తం మంగళవారం అతనికి అందజేశారు.
W.G: పెనుమంట్ర-2 సచివాలయం పరిధిలో మంగళవారం 104 వాహనం ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి, స్థానికులకు మధుమేహం, రక్తపోటు వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో, ఏఎన్ఎం లక్ష్మి, అంగన్వాడీ సిబ్బంది, మేల్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
‘ది కేరళ స్టోరీ 2’పై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా రాష్ట్ర ప్రతిష్టను, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందన్న పిటిషన్‌పై విచారణ చేపట్టింది. కేరళను తప్పుగా చిత్రీకరించడం వల్ల ఉద్రిక్తతలు తలెత్తే ఛాన్స్ ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సెన్సార్ సర్టిఫికేట్‌పై నిర్ణయం తీసుకునే ముందు, ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని కోర్టు నిర్మాతలను ఆదేశించింది.