తమిళ హీరో విశాల్, దుషారా విజయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘మకుటం’. తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు దుషారా పోస్ట్ పెట్టారు. ‘ఈ షూటింగ్ సమయంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. ప్రతిక్షణం చాలా మధురంగా అనిపించింది. గర్వంగా భావిస్తున్నా. ఇవన్నీ సాధ్యం చేసిన చిత్రబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
AKP: మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాకవరపాలెం మెడికల్ కళాశాల వద్ద వైసీపీ శ్రేణులు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త గణేష్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని దుయ్యపట్టారు.
NRML: లక్ష్మణ్చందా మండలం వడ్యాల్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆర్‌జెడీ సత్యనారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 100% హాజరు పెంపు, గ్రంథాలయ తరగతులు పకడ్బందీగా నిర్వహణ, ల్యాబ్ మెటీరియల్–డిజిటల్ బోధన వినియోగం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు.
NLR: యువతకు ఉపాధి కల్పించేందుకు కోవూరులో ఉన్న భూముల్లో పరిశ్రమలు పెట్టాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అసెంబ్లీలో కోరారు. ఇఫ్కో కోసం సేకరించిన 2776 ఎకరాల్లో ఇప్పటి వరకు గమేశా, కోకాకోలా కంపెనీలు మాత్రమే వచ్చాయన్నారు. మిగిలిన భూముల్లోనూ పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూములు 126 ఎకరాలు 13 ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయన్నారు.
AP: మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. అయితే, నిరసనలకు అనుమతి లేదంటూ పలువురు YCP నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. మాజీమంత్రి చెల్లుబోయిన వేణు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లికి నోటీసులు ఇచ్చారు. మాజీమంత్రి విడుదల రజిని, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, భార్గవరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.
కృష్ణా: ప్రమాద బాధితునికి అండగా ఉంటామని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. చల్లపల్లి నారాయణరావు ఎస్టీ కాలనీకి చెందిన కుంభా రవితేజ అనే 23ఏళ్ల ఆటో డ్రైవర్ ఈ ఏడాది మార్చిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితం అయ్యాడు. అతని వైద్యం కోసం చల్లపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో రూ.20వేలు సహాయాన్ని శుక్రవారం వెంకట్రామ్ చేతులమీదుగా అందచేశారు.
E.G: ఛలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పిలుపులో భాగంగా శుక్రవారం రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు. ఈ నేపథ్యంలో భరత్ ఆయన ఇంటి వద్దనే కూర్చొని నిరసన తెలిపారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు.
AP: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఈరోజు టీడీపీలో చేరనున్నారు. సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాజశేఖర్ పసుపు కండువా కప్పుకోనున్నారు. గత అసెంబ్లీ సమావేశాల చివరి రోజు వైసీపీకి, శాసన మండలి సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా, వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. అయితే, ఆయన రాజీనామాను మండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించలేదు.
VZM: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మాజీ CM వైఎస్ జగన్ వ్యాఖ్యానించడాన్ని రాష్ట్ర ప్రజలు తప్పు పడుతున్నారని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలన్నారు.
TG: గుజరాత్‌లోని సబర్మతి తీరం తరహాలో HYD మూసీని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, నెట్ జీరో సిటీగా మార్చడమే లక్ష్యమన్నారు. కాలుష్య నివారణకు పరిశ్రమలను సిటీ వెలుపలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని, నగరంలో తయారీ పరిశ్రమలను చైనా ప్లస్ వన్‌గా మారుస్తామన్నారు.
ఆస్ట్రేలియా ‘A’తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత్-A బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ 150 పరుగులు చేయగా, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 140 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 520/7 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా స్కోరును అధిగమించడానికి మరో 12 పరుగులు మాత్రమే అవసరం.
తమిళ హీరో, TVK పార్టీ అధినేత విజయ్ దళపతి ఇంట్లో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఆయన నివాసంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి టెర్రస్‌పై తిరుగుతుండగా.. విజయ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన విజయ్ అభిమానులలో ఆందోళన కలిగించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
VZM: కొత్తవలస మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సచివాలయం-4లో ఎంపీఈఓ కుమారి రైతులు మోదమోంబ ఆగ్రో ఏజెన్సీస్‌లో యూరియా పంపిణీ చేశారు. యూరియా కోసం రైతులు సచివాలయం వద్ద బారులు తీరారు. ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఎస్సై పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
GNTR: జిల్లాలో సెలక్షన్ గ్రేడ్ హోదా కలిగిన తెనాలి మున్సిపాలిటీలో ఇన్‌ఛార్జ్ అధికారుల పాలన కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ బదిలీ అయిన తరువాత అసిస్టెంట్ కమిషనర్ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పదవీ విరమణ చేయడంతో ప్రస్తుతం ఎంఈ అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఇలా ఎన్నాళ్లు కొనసాగుతుందోనని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
SKLM: ఉల్లాస్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన “అక్షర ఆంధ్ర” రెండు రోజుల శిక్షణ తరగతులు శుక్రవారం పలాస మండల ఎంపీడీవో కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎంపీడీవో మెట్ట వైకుంఠరావు మాట్లాడుతూ.. ఉల్లాస్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత పెద్దలకు చదువు నేర్పడం ఎలా అనే అంశంపై మెలుకవలు నేర్చుకోవాలన్నారు.