• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కొంగోడులో పర్యటించిన జడ్పీ సీఈవో

KKD: జడ్పీ సీఈవో వీవీఎస్ లక్ష్మణరావు శుక్రవారం కరప మండలం కొంగోడులో పర్యటించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పంచాయతీ చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం పంచాయతీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ ఎండీవో శ్రీనివాసరావు, కార్యదర్శి వీరభద్రరావు పాల్గొన్నారు.

September 19, 2025 / 11:06 AM IST

సచివాలయం అడ్మిన్‌పై కమీషనర్‌కు ఫిర్యాదు

KRNL: సీపీఎం నగర కార్యవర్గ సభ్యుడు విజయ రామాంజనేయులు మాట్లాడుతూ.. మున్సిపల్ సేవల కోసం లంచం తప్పనిసరి అయిందా అని ప్రశ్నించారు. జొహరాపురం 40వ సచివాలయంలో ఇంటి పన్ను వేయించుకునేందుకు రూ. 5 వేల నుంచి రూ.10 వేలు లంచం అడుగుతున్నారని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

September 19, 2025 / 11:05 AM IST

నిజాయితీని చాటుకున్న ఆర్టీసీ కండక్టర్

WGL: తన బస్సులో ఓ ప్రయాణికురాలు మర్చిపోయిన రూ. 30 వేలవిలువచేసే ఒకమొబైల్ ఫోన్‌ను ప్రయాణికురాలికి తిరిగి అప్పగించి కండక్టర్ వేణు తన నిజాయితీని చాటుకున్నాడు. కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట డిపో బస్సు నిజామాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా రమ్య అనే మహిళ ఫోన్‌ను మర్చిపోయి దిగి వెళ్లిపోగ గమనించిన కండక్టర్ డీఎంకు సమాచారాన్ని అందించి తిరిగి అందచేశాడు.

September 19, 2025 / 11:03 AM IST

డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాం: పరమేశ్వర్ రెడ్డి

MDCL: హబ్సిగూడ డివిజన్‌లోని రామ్‌రెడ్డి నగర్, వాసవి నగర్ కాలనీల్లో డ్రైనేజీ, ట్రంక్ లైన్ సమస్యలపై కాలనీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వాసులు, మహిళలతో కలిసి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పరమేశ్వర్ రెడ్డి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చూపుతానన్నారు.

September 19, 2025 / 11:03 AM IST

అంగన్వాడీ ఉద్యోగుల ముందస్తు అరెస్ట్

NGKL: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఛలో ప్రగతి భవన్ కార్యక్రమానికి తరలి వెళ్తారనే ఉద్దేశంతో అచ్చంపేట పోలీసులు అంగన్వాడీ ఉద్యోగులను శుక్రవారం ఉదయం ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. యూనియన్ మండల కార్యదర్శి భారతి తదితరులను అరెస్ట్ చేసి స్టేషన్‌‌లో ఉంచారు. పోలీసుల బలవంతపు అరెస్టులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

September 19, 2025 / 11:02 AM IST

వ్యవసాయ సహాయ సంచాలకుడు మృతి

NDL: వ్యవసాయ సహాయ సంచాలకుడు ఆంజనేయులు బ్రెయిన్ హేమరేజ్ కారణంగా ివాళ తెల్లవారుజామున హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందారు. బండి ఆత్మకూరు వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆయన ఆరోగ్యం విషమించినట్లు తెలియజేశారు. పలువురు అధికారులు, సహచరులు సంతాపం తెలిపారు.

September 19, 2025 / 11:02 AM IST

సుంకేసుల బ్యారేజీకి తగ్గిన వరద

GDWL: రాజోలి మండలంలోని సుంకేసుల బ్యారేజీకి వరద ప్రవాహం శుక్రవారం తగ్గింది. ప్రస్తుతం బ్యారేజీకి 20,250 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 15,602 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, కేసీ కెనాల్‌కు 2,445 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తం 18,047 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది.

September 19, 2025 / 11:02 AM IST

జగన్‌కు పరిణితి లేక అసెంబ్లీకి రావడం లేదు: పల్లా

AP: జగన్‌కు పరిణితి లేక అసెంబ్లీకి రావడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. అపోజిషన్ వస్తేనే అసెంబ్లీ బాగుంటుందని అన్నారు. అసెంబ్లీలో నెంబర్ ముఖ్యం కాదని.. ప్రజాసమస్యలను లేవనెత్తడమే ముఖ్యమని తెలిపారు. స్వపక్షంలో విపక్షంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని అన్నారు. జగన్ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు.

September 19, 2025 / 11:02 AM IST

గుర్తుతెలియని వ్యక్తి మృతిదేహం లభ్యం

NZB: నవీపేట్ మండలంలోని నాగపూర్ గ్రామం శివారు గుట్ట ప్రాంతంలో శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. పశువుల కాపరులు గుట్ట ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా సుమారు పది రోజుల క్రితమే సదరు వ్యక్తి మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు.

September 19, 2025 / 11:01 AM IST

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం

SRD: తన జన్మదినం పురస్కరించుకొని కలియుగదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

September 19, 2025 / 11:00 AM IST

‘గోల్డెన్ అవర్’ సద్వినియోగం చేసుకోండి: ఎస్సై

GDWL: సైబర్ నేరాల బాధితులు ‘గోల్డెన్ అవర్’ను సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం ఎస్సై వెంకటస్వామి సూచించారు. డబ్బు పోగొట్టుకున్న వెంటనే గంటలోపు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అపరిచితులు ఫోన్ చేసి ఓటీపీలు, లింకులను పంపితే క్లిక్ చేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

September 19, 2025 / 11:00 AM IST

R&B ఇంజనీర్లకు ప్రమోషన్.. మంత్రి శుభాకాంక్షలు

HYD: రాష్ట్ర R&B ఇంజనీర్ల అసోసియేషన్ నూతన కార్యవర్గానికి HYDలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. CM రేవంత్ రెడ్డి సహకారంతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రూల్స్ ఆమోదం పొందినట్టు వివరించారు. ఒకేసారి 118 మంది AEE లు DE లుగా, 72 మంది DE లు EE లుగా, 29 మంది EE లు SE లుగా, ఆరుగురు SE లు CE లుగా, CE లు ENC లుగా ప్రమోషన్ […]

September 19, 2025 / 10:59 AM IST

టమాటా ప్రోసెసింగ్ యూనిట్ కలేనా..?

చిత్తూరు జిల్లా టమాటా పంటకు పెట్టింది పేరు. ఆసియాలోనే అతి పెద్ద టమాటా మార్కెట్‌గా పేరు గడించింది. రోజుకు 1,500 టన్నుల పంటకు ఇక్కడ వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఇంత ఉన్నా రైతులు మాత్రం నష్టాలతో పంటను సాగు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పాలకులు టమాటో ప్రొసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా కార్యరూపం మాత్రం దాల్చలేదు.

September 19, 2025 / 10:58 AM IST

తెలంగాణ జాగృతిలో చేరికలు

MDK: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన పలువురు తెలంగాణ జాగృతిలో చేరారు. పట్టణానికి చెందిన తుజాల లావణ్య గౌడ్ పలువురు కార్యకర్తలతో కలిసి జాగృతి సీనియర్ నాయకురాలు శైలజ గౌడ్ ఆధ్వర్యంలో జాగృతిలో చేరారు. వారికి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట కవిత కండువా కప్పి ఆహ్వానించారు. జాగృతి సేవలు విస్తృత పరిచేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

September 19, 2025 / 10:58 AM IST

‘ఆల్కహాల్’ మరో క్రేజీ హీరోయిన్

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు మెహర్ తేజ్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘ఆల్కహాల్’. ఇప్పటికే ఈ సినిమాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక NM కథానాయికగా నటిస్తుండగా.. తాజాగా మరో హీరోయిన్ రుహాణి శర్మ భాగం అయ్యారు. ఇందులో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్నాయి.

September 19, 2025 / 10:58 AM IST