WNP: కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ సందేశాలను పంపిస్తున్నారని, వాటికి ఎవరు స్పందించవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తెలియజేశారు. +84 అనే సిరీస్ నెంబర్ నుంచి పలువురు తహశీల్దార్లకు కలెక్టర్ ఫోటోతో నకిలీ సందేశాలు వెళ్లిన నేపథ్యంలో కలెక్టర్ ఈ ప్రకటన విడుదల చేసినట్లు వెల్లడించారు. దీంతో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ATP: ఓబుళాపురం మైనింగ్‌లో సీబీఐ సీజ్ చేసిన లక్ష మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని వైసీపీ హయాంలో అక్రమంగా తరలించారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. అక్రమంగా తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు.
KMM: దేశ సేవకు అంకితమైన ఉద్యమ ఊపిరి కొండ లక్ష్మణ్ బాపూజీ అని మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని మధిర మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారని, ఆయన సేవలు మరువలేనిదని పేర్కొన్నారు.
W.G: తణుకులోని వారణాసి వారి వీధిలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్ చెందిన నాగేంద్ర సహాని, మహారాష్ట్రకు చెందిన సందీప్ మీరా రామ్ తెలుపు రంగు కారులో వచ్చి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిలో నాగేంద్ర సహాని ఫోటో పోలీసులు విడుదల చేశారు.
సత్యసాయి: చిలమత్తూరు పంచాయతీ ఒకటవ వార్డులో టీడీపీ నాయకులు శనివారం స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ వీరయ్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎప్పుడు నిరుపేదలకు అండగా ఉంటుందని తెలిపారు. లబ్ధిదారులు స్మార్ట్ కార్డులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
E.G: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సముద్ర పర్యటనకు సంబంధించి ప్రశ్న సభలో రావడం దానిని ఆమోదించడం ఆనందం కలిగిస్తుందని నిడదవోలు MLA, మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చీరాలలో సముద్ర పర్యాటనను ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
AP: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే సుజనాచౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కావట్లేదు. రుషికొండ ప్యాలెస్‌పై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి సస్పెండైన.. ఉద్యోగి సాయిప్రసాద్‌ను విధుల్లోకి తీసుకున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP: వచ్చే నెల 16న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. అనంతరం శ్రీశైలం మల్లికార్జునస్వామిని మోదీ దర్శించుకోనున్నారు. కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతలు రోడ్ షోలో పాల్గొంటారు. జీఎస్టీ సంస్కరణలపై మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
KKD: తాటిపర్తిలో ప్రసిద్ధిగాంచిన అపర్ణాదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు అపర్ణాదేవి కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అపర్ణాదేవి ఆలయం దేశంలో ఎక్కడా లేదు ఒక తాటిపర్తి గ్రామంలోనే ఉండటంతో ఈ ఆలయానికి ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. అమ్మవారికి కుంకుమపూజ కార్యక్రమాలు నిర్వహించారు. రుద్రాక్ష మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
SRD: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణం ఫల పరిశోధన కేంద్రంలోని ఆయన విగ్రహానికి అదనపు కలెక్టర్ మాధురి శనివారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ది కీలక పాత్ర అని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, అధికారులు పాల్గొన్నారు.
KNR: సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ చందుతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు పట్టికను, అవుట్ పేషెంట్ రిజిస్టరులను ఇతర రికార్డులను వెరిఫై చేశారు. ఎన్‌సీడీ క్లినిక్‌లో అసంక్రమిత వ్యాధుల రికార్డులను పరిశీలించారు .
HYD: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై HYD వేదికగా BRS పార్టీ బాకీ కార్డు విడుదల చేసింది. కౌలు రైతుల హామీ ఎక్కడ..? పెన్షన్ల పెంపు ఎక్కడ..? మహిళలకు రూ.2,500..? రెండు లక్షల ఉద్యోగాలు..? ఎక్కడ అంటూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బాకీ కార్డు విడుదల చేశారు. చెప్పింది ఒకటి చేసింది ఒకటి అన్నట్లుగా ఉందని విమర్శలు గుప్పించారు.
TG: కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట BRS నేతలు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కాంగ్రెస్ 22 నెలల పాలనలో ప్రజలకు ఎంత బాకీ పెట్టారో అని లెక్కలతో సహా వివరించారు. ‘ఓటు కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడగాలి’ అని సూచించారు. నేపాల్, శ్రీలంకలో ప్రజలు తిరగబడ్డట్లు.. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు.
WGL: నల్లబెల్లి మండలానికి చెందిన విద్యార్థిని దీక్షిత ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. ఈ సందర్భంగా శనివారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆమెను సన్మానించి, స్వీటు తినిపించి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దీక్షిత ఉన్నత విద్యను అభ్యసించి, పేదలకు ఉచిత వైద్యం అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
E.G: గోకవరం తానా వద్దగల దేవి చౌక్‌లో కొలువైయున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు శనివారానికి 6వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దేవి చౌక్‌లోని అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తుల అమ్మవారి దర్శించుకోవడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు.