ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తన స్వగృహంలో పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం వైద్యశాఖ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యంపై నిర్వహిస్తున్న ‘స్వస్థ్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ శిబిరాల పోస్టర్లను విడుదల చేశారు. పిల్లల పోషణ కోసం ఐసీడీఎస్ నిర్వహిస్తున్న మాసోత్సవాల పోస్టర్లను కూడా ఆవిష్కరించారు.
SKLM: జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశం ఈ నెల 21వ తేదీన ఉదయం 10.30 గంటలకు నగరంలోని ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్టు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్.ఎన్.వి. శ్రీధర్ రాజా ఇవాళ తెలిపారు. కార్యక్రమం అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ASF: జిల్లా కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో బుధవారం జాతీయ సమైక్యత దినోత్సవం వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా MLA కోవ లక్ష్మి ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి, తెలంగాణ సాయుధ పోరాట యోధులకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాధనలో అమరులైనవారి త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర ప్రగతి కోసం మనం అందరం ఐక్యంగా కృషి చేయాలన్నారు.
SRD: సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్‌లో ఊర కుక్కలు పెట్రేగిపోయాయి. వ్యక్తి, పశువులపై బుధవారం దాడి చేసి గాయపరచాయి. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకులం బాట్ని అధ్యాపకుడు యేసురాజు బైకు ఆపి గురుకులంలో వెళ్లే క్రమంలో కుక్క వచ్చి కాలికి కరిచిందని తెలిపారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లారు. అదేవిధంగా గ్రామంలోని ఓ రైతుకు చెందిన గేదె, దూడపై దాడి చేసింది.
NZB: ఏరుగట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో వార్త సేకరణకు వెళ్లిన జర్నలిస్టుపై ముసుగు దుండగులు దాడికి పాల్పడిన ఘటనపై ఆర్మూర్ ప్రెస్ క్లబ్, నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బుధవారం ఆర్మూర్ పట్టణంలో సబ్ కలెక్టర్, ఏసీపీలకు వినతి పత్రాలు అందజేసి, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
NRPT: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన నిజం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది భారత్లో విలీనమైన రోజును గుర్తు చేసుకున్నారు.
NRPT: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినస్తాన్ని పురస్కరించుకొని అప్పంపల్లి గ్రామంలో బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుడు తిరుపతయ్య విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరేష్ కుమార్ రెడ్డి, శ్యామ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, పెంటా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
KMM: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వివిధ లైసెన్స్‌లో హక్కు మంజూరుకు ఈనెల 29న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఈవో కె.దామోదర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు తానీషా కల్యాణ మండపంలోని కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని సూచించారు. గతంలో దేవస్థానానికి బాకీ, తగాదాలు ఉన్నవారు అనర్హులని పేర్కొన్నారు.
NZB: ప్రజాపాలన దినోత్సవం వేడుకల సందర్భంగా నిజామాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. సిద్ధార్థ కళాక్షేత్ర, నవీపేట, కంజర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బాలికలు, బోర్గాం (పి) ఉన్నత పాఠశాల, డిచ్‌పల్లి మానవతా సదన్ చిన్నారులు చూడ చక్కని నృత్యాలు ప్రదర్శించారు.
E.G: సీతానగరం మండలం మిర్తిపాడులో వెంకటరామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన పార్టీ ‘నా సేన కోసం- నా వంతు’ రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని నూతన పాలకవర్గం సభ్యులకు అభినందించారు. సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.
KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 రోడ్ నెంబర్ 13లో నెల రోజులుగా మంచినీటి పైపులైను లీకేజ్ అవుతుందని HIT టీవిలో ప్రచురితమయ్యింది. కథనానికి స్పందించి ఇవాళ పంచాయతీ కార్యదర్శి చేపూరి లక్ష్మీ నరసయ్య పారిశుద్ధ్య కార్మికులచే అక్కడ ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు.పైపులైను లీకేజీని రెండు రోజుల్లో శాశ్వత పరిష్కారం చేపడతామని కార్యదర్శి తెలిపారు.
KMR: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మండల కేంద్రంలో మైథిలి ఫంక్షన్ హాల్‌లో బుధవారం మద్నూర్ మండల జర్నలిస్టుల సంఘం నూతన కార్యవర్గ సన్మాన సభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమాజంలో జర్నలిస్టులకు కీలక బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు.
ASR: ప్రపంచంలో తొలి వాస్తు శిల్పి, సృష్టికర్త విశ్వకర్మ అని జాయింట్ కలెక్టర్ అభిషేక్ అన్నారు. పాడేరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా విశ్వకర్మ చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేశారు. విశ్వకర్మ పూజా ప్రాముఖ్యతను వివరించారు. విశ్వ కర్మ జయంతిని వస్తు తయారీదారులు, ఇంజనీర్లు, జరుపుకుంటారన్నారు.
కృష్ణా: మహిళలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. బుధవారం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టిన స్వస్త్ నారీ – సశక్త్ అభియాన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ పాల్గొన్నారు.
HNK: పరకాల పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనం వద్ద బుధవారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై, జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.