GDWL: సైబర్ నేరాల బాధితులు ‘గోల్డెన్ అవర్’ను సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం ఎస్సై వెంకటస్వామి సూచించారు. డబ్బు పోగొట్టుకున్న వెంటనే గంటలోపు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అపరిచితులు ఫోన్ చేసి ఓటీపీలు, లింకులను పంపితే క్లిక్ చేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.