• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సావర్గవ్‌లో తాగునీటి సమస్యపై గ్రామసభ

KMR: జుక్కల్ మండలం సావర్గవ్‌ గ్రామంలో తాగునీటి ఎద్దడి నివారణకు శుక్రవారం సర్పంచ్ రవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. బోరుబావుల మరమ్మతులు చేపట్టాలని, పైపులైన్ల లీకేజీలను అరికట్టి నీటి వృథాను అరికట్టాలని నిర్ణయించారు. తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా మోటార్లకు మరమ్మతులు చేయించాలని తీర్మానించారు. అలాగే దళితవాడలో మురుగుకాలువల నిర్మాణానికి నిధులు ఇవ్వాలన్నారు.

February 20, 2026 / 04:20 PM IST

వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలి: పయ్యావుల

AP: YCP సభ్యుల తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. దేవుడి ఫొటోలు పట్టుకుని చెప్పులతో సభలోకి వచ్చారని ధ్వజమెత్తారు. సభలో ప్రతిరోజూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా YCP తీరు ఉందన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగడమేంటని నిలదీశారు. హిందూ సమాజానికి YCP సభ్యులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 04:20 PM IST

భూసేకరణ అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష

ATP: అనంతపురం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ శుక్రవారం భూసేకరణ, భూమి బదలాయింపు అంశాలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారులతో కలిసి వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పురోగతిని ఆయన చర్చించారు. పెండింగ్‌లో ఉన్న భూమి బదలాయింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

February 20, 2026 / 04:20 PM IST

ప్రజలకు సమాధానం చెప్పాలి: రాజగోపాల్

TG: రాష్ట్రంలో నేతల పనితీరుపై కాంగ్రెస్ అధిష్టానం ప్రశంసించడంపట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయన్నారు. కానీ ‘నిజంగా ప్రజల మనసులో ఏం ఉంది? మనం ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చాం అన్నది ముఖ్యం’ అని అన్నారు. అన్నింటిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

February 20, 2026 / 04:15 PM IST

అసెంబ్లీలో మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే

కృష్ణా: అసెంబ్లీలో శుక్రవారం MLA యార్లగడ్డ వెంకట్రావు APకి ప్రత్యేక స్టాంప్ చట్టం తీసుకురావాలని సూచించారు. పాసుపుస్తకాలపై జగన్ ఫోటోలు వేసుకోవడాన్ని ఆయన విమర్శించారు. రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు పంపిణీపై హర్షం వ్యక్తం చేస్తూ, విజయవాడ రూరల్‌లో 10 ఎకరాల భూమితో కృష్ణా యూనివర్సిటీ ఫైలు వేగవంతం చేయాలని కోరారు. MRO రికార్డు ట్యాంపరింగ్‌పై విచారణ చేయాలని కోరారు.

February 20, 2026 / 04:15 PM IST

BREAKING: YCP MLCలకు నోటీసులు

AP: రాజీనామా చేసిన YCP MLCలకు మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. ఈనెల 26న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్‌కు నోటీసులు పంపించారు. మరోవైపు ఈనెల 25న విచారణకు రావాలని జయమంగళం వెంకట రమణకు సూచించారు.

February 20, 2026 / 04:13 PM IST

భారత్–సింగపూర్ నౌకాదళాల మధ్య సహకారం బలోపేతం

VSP: భారత నౌకాదళాధిపతి దినేష్ కే. త్రిపాఠి సింగపూర్ నౌకాదళాధిపతి షాన్ వాట్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల నౌకాదళాల మధ్య కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ముఖ్యంగా ‘సింబెక్స్ విన్యాసాలు, అలాగే ‘ఎక్సర్‌సైజ్ పసిఫిక్ రీచ్ 2025’లో సబ్‌మరైన్ శోధన–రక్షణ సహకారంపై దృష్టి సారించారు.

February 20, 2026 / 04:12 PM IST

‘ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి’

MHBD: తొర్రూరు మండలంలోని హరిపిరాల గ్రామంలో ఇవాళ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. యాకుబ్ ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. జీరాంజీ చట్టాన్ని రద్దుచేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ. 600 పెంచాలని కోరారు.

February 20, 2026 / 04:11 PM IST

రెజ్లింగ్ క్రీడాకారుడిని అభినందించిన పీవో

BDK: ఐటీడీఏ పీవో రాహుల్‌ను, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాశీ హుస్సేన్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల యూపీలో జరిగిన ఫెడరేషన్ కప్ రెస్లింగ్ పోటీల్లో వెంకటప్రసాద్ 97 కేజీల విభాగంలో నవీన్ 100 కేజీల విభాగంలో సత్తా చాటారు. బెస్ట్ ర్యాంకుల్లో నిలిచి ఖేలో ఇండియా జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు.

February 20, 2026 / 04:11 PM IST

గుండ్లగుంటపల్లిలో పౌష్టికాహార పంపిణీ

NGKL: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని ఊర్కొండ సర్పంచుల సంఘం అధ్యక్షుడు రమేష్ నాయక్ అన్నారు. గుండ్లగుంటపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. నాణ్యమైన ఆహారం ద్వారా మాతాశిశు మరణాలను అరికట్టడమే ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ రజని, ఉపసర్పంచ్ కొండల్ పాల్గొన్నారు.

February 20, 2026 / 04:10 PM IST

ఏసీబీకి చిక్కిన వ్యవసాయాధికారి

ప్రకాశం: కంభంలో ఇవాళ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పురుగు మందుల షాపు లైసెన్స్ మంజూరు కోసం ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా కంభం మండల వ్యవసాయాధికారి షేక్ మహమ్మద్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ దాడులను అధికారులు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

February 20, 2026 / 04:10 PM IST

ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య.. నోటిఫికేషన్ విడుదల

PLD: ఆర్టీఈ (RTE) చట్టం కింద 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు నూజెండ్ల ఎంఈవో రవిచంద్ర శుక్రవారం తెలిపారు. అర్హులైన పేద విద్యార్థులు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు cse.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు.

February 20, 2026 / 04:09 PM IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

HYD: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెక్రటేరియట్లో జరిగిన సమీక్షలోని నిర్ణయాలపై కంటోన్మెంట్ MLA శ్రీగణేశ్ అధికారులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

February 20, 2026 / 04:09 PM IST

ఇచ్చిన హామీ నెరవేర్చిన కౌన్సిలర్

KNR: మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే ఆడపిల్లల వివాహానికి రూ. 10,116 ఇస్తానని హుజరాబాద్ 21వ వార్డు కౌన్సిలర్ పంజాల రాజ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఎన్నికలో ఆయన గెలవడంతో ఇచ్చిన హామీ మేరకు వార్డుకి చెందిన పోగు తేజస్వినికి వివాహం నిశ్చయం కాగా ఇవాళ నగదును అందజేశారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలందరూ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్‌ను అభినందించారు .

February 20, 2026 / 04:08 PM IST

కార్మిక కోడ్లపై సర్కార్ కీలక నిర్ణయం

AP: కేంద్రం తెచ్చిన నాలుగు కొత్త కార్మిక కోడ్ల అమలుపై రాష్ట్ర కార్మికశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సంస్కరణలపై స్టేక్ హోల్డర్ల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలను ఆహ్వానించింది. చట్టాల సరళీకరణ, ఆధునీకరణ ద్వారా కార్మికుల హక్కులను రక్షిస్తూనే.. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. మార్చి 15లోగా ఈ సూచనలు అందజేయాలని ప్రభుత్వం కోరింది.

February 20, 2026 / 04:07 PM IST