• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఆ సమస్య మహిళల్లోనే ఎక్కువ.. ఎందుకంటే?

TG: ఈ రోజుల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మహిళల్లో అత్యంత సాధారణ సమస్య. సాధారణంగా జీర్ణవ్యవస్థ నుంచి బ్యాక్టీరియా మూత్రనాళంలోకి ప్రవేశించినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. మహిళల్లో పాయువు, మూత్రనాళం రెండూ దగ్గరగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా మహిళల్లో హార్మోన్ల మార్పులు కూడా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి.

February 20, 2026 / 09:21 PM IST

పొగతాగితే ఎముకల దృఢత్వానికి దెబ్బ!

పొగ తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని సిగరెట్ ప్యాకెట్‌పై ఉన్నప్పటికీ ఎవరూ దానిని పట్టించుకోరు. అయితే, ఇది ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ధూమపానం ఎముకల బలాన్ని తగ్గిస్తుంది. పగుళ్లకు గురిచేస్తుంది. దీంతోపాటు ఎముకల నిర్మాణానికి కీలకమైన హార్మోన్లను దెబ్బతీస్తుంది. ధూమపానం ఎముకలను దృఢంగా ఉంచే పోషకాలను కోల్పోయేలా చేస్తుంది’ అని చెప్పారు.

February 20, 2026 / 09:18 PM IST

‘రేపు ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ను విజయవంతం చేయండి’

GNTR: జిల్లాలో శనివారం నిర్వహించనున్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ (SASA) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. ‘జీరో లిటర్ గవర్నెన్స్’ థీమ్‌తో మున్సిపల్, పంచాయతీ శాఖలు సమన్వయంతో పని చేసి కార్యక్రమన్ని విజయవంతం చేయాలన్నారు.

February 20, 2026 / 09:12 PM IST

రేపు ఆలయాల్లో సంప్రోక్షణకు సర్కార్ నిర్ణయం

AP: కూటమి పక్షాల నేతలు, మంత్రులు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించుకున్నారు. ఈ క్రమంలో మండలిలో వైసీపీ మహాపచారంపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు నియోజకవర్గాల్లోని వేంకటేశ్వర ఆలయాల్లో సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్ కేంద్రాల్లో ప్రెస్‌మీట్‌లు నిర్వహించాలన్నారు.

February 20, 2026 / 09:10 PM IST

మంత్రి ఆనంతో భేటీ అయిన ఒంగోలు ఎమ్మెల్యే

ప్రకాశం: తాడేపల్లిలోని ప్రకాశం జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి నివాసంలో ఈనెల 25న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.

February 20, 2026 / 09:10 PM IST

నా దగ్గర ప్లాన్-బి ఉంది: ట్రంప్

అమెరికా సుప్రీంకోర్టు తీర్పును ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వ్యతిరేకించారు. తన దగ్గర ప్లాన్ బి ఉందని చెప్పారు. బ్యాకప్ ప్లాన్‌ను త్వరలో అమలు చేస్తానని స్పష్టం చేశారు. కాగా, అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ దేశం వసూలు చేసిన సుంకాలు దాదాపు 16 లక్షల కోట్లు తిరిగి చెల్లించాల్సిన స్థితిలో అమెరికా ఉంది.

February 20, 2026 / 09:10 PM IST

తమలపాకులతో ప్రయోజనాలు తెలుసా..?

తమలపాకు కేవలం పూజలకే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు కూడా నిలయం. భోజనం తర్వాత తమలపాకును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. తద్వారా గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది సహజసిద్ధమైన మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తూ నోటి దుర్వాసనను అరికడుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చిగుళ్ల వ్యాధులను నివారిస్తాయి.

February 20, 2026 / 09:08 PM IST

ఆశాల సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 23న ‘ఛలో హైదరాబాద్

MDCL: ఆశా కార్యకర్తల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ CITU జిల్లా నాయకులు ఫిబ్రవరి 23న నిర్వహించే “ఛలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి, ఉపాధ్యక్షురాలు కె. కోమలత అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెమోరాండం సమర్పించారు.

February 20, 2026 / 09:07 PM IST

‘వాస్తవిక సమాచారం నమోదు చెయ్యాలి’

PPM: మహిళా సంఘాలు సభ్యులు వివిధ పథకాల్లో తీసుకున్న రుణాలు ఏ ఏ రంగాలలో పెట్టుబడులు పెట్టారో అనే వాస్తవిక సమాచారం సేకరించాలని మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం.సుధారాణి పేర్కున్నారు. శుక్రవారం సాలూరు మండలం బాగువలసలో ఈ నారిలు ద్వారా నిర్వహిస్తున్న జీవనోపాధులు సర్వేను ఆకస్మికంగా పరిశీలించారు. సిబ్బంది ఈ నారీలు చేస్తున్న సర్వే పరిశీలించి సూచనలు చేయాలన్నారు.

February 20, 2026 / 09:06 PM IST

‘పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధ్యం’

BDK: హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన పాఠశాల స్థాయి క్రీడా పోటీలలో పరుగు పందెంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కే. నాగరంజిత్ తన ప్రతిభను చాటిచెప్పాడు. పాక్షికంగా వికలాంగుడు అయినప్పటికీ చదువుల్లోను ఆటల్లోను ముందంజలో ఉండడం అతని ధైర్యసాహసాలకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ అభినందించారు.

February 20, 2026 / 09:06 PM IST

వీడియో ఎడిటర్లకు అవకాశం.. APPLY NOW

Yoodesk Office Solutions సంస్థలో వీడియో కంటెంట్ క్రియేటర్&ఎడిటర్ ఇంటర్న్‌షిప్ అవకాశం అందుబాటులో ఉంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.21,000 వరకు స్టైఫండ్ ఉంటుంది. మార్చి 22వ తేదీ వ‌ర‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

February 20, 2026 / 11:28 PM IST

కాంగ్రెస్ చర్యలను ఖండించిన కిషన్‌రెడ్డి

భారతమండపంలో కాంగ్రెస్ నేతల చర్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ప్రజలు కాంగ్రెస్‌ను అసహ్యించుకుంటున్నారని, ఆ పార్టీ కార్యకర్తల తీరు అత్యంత సిగ్గుమాలిన చర్య అని ఆయన విమర్శించారు. ప్రపంచ దేశాల ముందు భారత దేశ గౌరవాన్ని మంటగలిపారని, రాహుల్ విపక్ష నేతగా ఉండడం దేశ దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు.

February 20, 2026 / 09:02 PM IST

ఆర్టీసీ బస్సు ఢీకొని పురోహితుడు మృతి

KKD: అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుండి తుని వెళ్తున్న బస్సు, స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దేవస్థాన వ్రత విభాగ అదనపు పురోహితుడు రఘునాథ శర్మ (20) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విధి నిర్వహణకు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 20, 2026 / 09:01 PM IST

రేపు పిచ్చాటూరులో స్వర్ణరథం ప్రారంభం

TPT: శనివారం ఉదయం 10:30 గంటలకు పిచ్చాటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా స్వర్ణరథం ప్రారంభోత్సవం జరుగనుంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఎంసీ మాజీ ఛైర్మన్ డి. ఇలంగోవన్ రెడ్డి కోరారు. మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం అందించారు.

February 20, 2026 / 09:01 PM IST

శేష వాహనంపై విహరించిన లక్ష్మీనరసింహుడు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా మూడో రోజు శుక్రవారం సాయంత్రం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. జగత్ రక్షకుడైన శ్రీవారు ఆదిశేషులుపై తిరువీధి సేవలో మంగళ వాయిద్యాలతో, శాస్త్రీయ నృత్యాలతో, కనుల పండగగా ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించి తరించారు.

February 20, 2026 / 09:00 PM IST