ఆ హామీల్లో ప్రధాన అంశం బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని ప్రకటించడం. మత కల్లోలాలు, ఘర్షణలకు తెరలేపుతున్న ఆ సంఘంతో పాటు పీఎఫ్ఐ ను కర్ణాటకలో నిషేధిస్తామని కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది. ఇక ఉచిత విద్యుత్, మహిళలు, నిరుద్యోగులకు భృతి ప్రకటించారు.
మహారాష్ట్రలో రెండు వారాలుగా రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఇప్పటికే శివసేన పార్టీలో చీలిక తీసుకువచ్చిన బీజేపీ తాజాగా ఎన్సీపీపై (NCP) దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే అడ్డదారులు తొక్కుతోంది.
తమిళనాడు సీఎం స్టాలిన్(Tamilnadu CM Stalin) కు గడ్డుకాలం నడుస్తోంది. సీఎం స్టాలిన్ అల్లుడైన జీ-స్వైర్ రియల్ ఎస్టేట్ చైర్మన్ శబరిషన్(Sabarishan) పై ఐదు రోజులుగా ఐటీ దాడులు(IT Raids) కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విషయం బయటపెట్టడంతో ఐటీ శాఖ రంగంలోకి దిగింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ వేగం పెంచింది. వరసగా సప్లిమెంటరీ చార్జిషీట్లు వేస్తోంది. కవిత భర్త అనిల్ పేరును నిన్న చేర్చగా.. ఈ రోజు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరు చేర్చింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీనుది డెడ్లీ కాంబినేషన్. ఈ ఇద్దరు చేసిన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. దాంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అది కూడా సీక్వెల్ కావడంతో సంచనాలతో పాటు అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా అఖండ2 కథ కూడా లీక్ అయిపోయిందనే టాక్ నడుస్తోంది. మరి అఖండ 2 అసలు కథేంటి!?
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఆ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడానికి ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ప్లాన్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాలు కూడా హీటెక్కిస్తున్నారు.
జాతిపిత మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తే.. వైసీపీ ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ గెలిచిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీకే రెబల్ గా మారారు.
ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది గానీ.. పెద్దగా టెక్నాలజీ తెలియని రోజుల్లోనే.. బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేశాడు స్టార్ డైరెక్టర్ శంకర్. జెంటిల్‌మేన్ మొదలుకొని.. లాస్ట్ ఫిల్మ్ రోబో2.0 వరకు శంకర్ సినిమాల్లో వాడే టెక్నాలజీ, గ్రాఫిక్స్ చూస్తే ఫిదా అవాల్సిందే. అందుకే ఈసారి మెగావపర్ స్టార్ రామ్ చరణ్ కోసం మోకో బోట్ కెమెరా వాడుతున్నారు. ఇంతకు ముందే ఈ కెమెరాని సినిమాల్లో వాడినా.. ఇప్ప...
లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. అలాంటి ఈ ఇద్దరు గొడవ పడ్డారా? అంటే నమ్మలేని విషయమే. కానీ ఇండస్ట్రీలో ఇద్దరి మధ్య గొడవ అటగా.. అంటూ చెవులు కొరుక్కున్నారు. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు గోపిచంద్.
సభను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఎందుకంటే తన లోక్ సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభకు భారీ ఎత్తున నిరుద్యోగులు, ప్రజలను తరలించాలని రేవంత్ వర్గం భావిస్తున్నది. ఈ సభతో బల ప్రదర్శన చేయాలని రేవంత్ వర్గీయులు నిర్ణయించినట్లు సమాచారం.