»Fight Between Ramabanam Hero And Director This Is The Clarity
Ramabanam: ‘రామబాణం’ హీరో, డైరెక్టర్ మధ్య గొడవ.. ఇదే క్లారిటీ!
లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. అలాంటి ఈ ఇద్దరు గొడవ పడ్డారా? అంటే నమ్మలేని విషయమే. కానీ ఇండస్ట్రీలో ఇద్దరి మధ్య గొడవ అటగా.. అంటూ చెవులు కొరుక్కున్నారు. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు గోపిచంద్.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన రామబాణం సినిమా(Ramabanam Movie) మే 5న ఆడియెన్స్ ముందుకి రాబోతోంది. డింపుల్ హయతి(Dimple Hayathi) హీరోయిన్గా నటించిన ఈ సినిమా.. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. గోపీచంద్(Gopichand) అన్నగా జగపతి బాబు నటించాడు. గతంలోను ఈ ఇద్దరి కాంబినేషన్ మంచి హిట్‌గా నిలిచింది. దాంతో రామబాణం పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోపీచంద్, తనకు జయం సినిమాతో లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తేజతో ఇంటర్య్యూ చేశాడు. ఇందులో ఇద్దరు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. రామబాణం గురించి మాట్లాడుతు.. సినిమా సెట్లో డైరెక్టర్‌తో గొడవలు అయ్యాయట.. నిజమేనా? అని గోపీచంద్‌ను అడిగాడు తేజ. ‘గొడవ పడ్డది వాస్తవమే.. మేకింగ్ టైంలో కొన్ని సీన్లు చాలా లెంగ్తీగా అనిపించాయి. అది ఎడిటింగ్‌లో లేపెస్తారని ఎలాగు తెలుసు.. అలాంటప్పుడు షూట్ ఎందుకు? ఈ సీన్స్‌ను ఇంత పెద్దగా తీయాల్సిన అవసరం లేదు చెప్పా. దానికి శ్రీవాస్ లేదు లేదు.. మళ్లీ అవసరమైతే.. ఇంత సెటప్ చేయలేం. ఎలా ఉన్నా పర్వాలేదని, ముందు తీసేద్దాం అని చెప్పాడు. అవసరం లేదనుకుంటే ఎడిటింగ్‌తో లెంగ్త్ తగ్గించవచ్చని అన్నాడు. అయితే నేన్నట్టే ఎడిటింగ్‌లో ఆ సీన్స్ లేచిపోయాయి. దీన్నే మా మధ్య గొడవ అని అనుకున్నారు. ఇదంతా మామూలే.. అసలు తాను ఎవరితోనూ గొడవలు పెట్టుకోనని చెప్పాడు గోపీచంద్. దీంతో హీరో. డైరెక్టర్ మధ్య గొడవ అనే రూమర్‌కు చెక్ పెట్టినట్టయింది.