చైతూ..ట్రూత్ అండ్ డేర్ సెగ్మెంట్ లో ఇంటర్వ్యూర్ ఓ ప్రశ్న అడిగారు. మీ జీవితంలో అతిపెద్ద పశ్చాత్తాపం ఏంటీ అని అడిగారు. దీనికి చైతూ తన జీవితంలో అలాంటిది ఏం లేదని సమాధానమిచ్చాడు. జీవితంలో ఎదురయ్యే ప్రతీ ఘటన తనకు పాఠమే నన్నాడు.
దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో దారుణం చోటు చేసుకుంది. ఓ గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. తోటి గ్యాంగ్‌స్టర్లు అతడిని కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లుని హోల్డ్‌లో పెట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజి' సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాడు. అయితే వీటి కంటే ముందే.. రీమేక్ షూటింగ్ ఫినిష్ చేశారు. అయితే ఇంకా ఈ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ టైటిల్ వినిపిస్తోంది.
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన వినియోగదారుల భద్రతా నివేదికను మార్చి 2023కి విడుదల చేసింది. వాట్సాప్ ద్వారా నిషేధించబడిన భారతీయ ఖాతాల సంఖ్య, వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులు నివేదికలో ఉన్నాయి.
గౌతమ్ గంభీర్ పై విరాట్ కోహ్లీ స్వీట్ రివేంజ్ తీర్చుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో జెయింట్స్ జట్టు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
బాలీవుడ్‌లో వచ్చిన కశ్మీర్ ఫైల్స్ సినిమా సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో జరిగిన అరాచకాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారని.. ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు. అదే రేంజ్‌లో వివాదాలు కూడా ఈ సినిమాను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు కూడా ఓ సినిమా గురించి ఇదే రేంజ్‌లో రచ్చ జరుగుతోంది. అసలు కేరళ స్టోరీ ఎందుకు వివాదం అవుతోంది?
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సహకారంతో నిమ్స్ ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో ఈ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. అవయవ మార్పిడి ఆరోగ్య శ్రీలో చేర్చడంతో పేదలకు కిడ్నీ, కాలేయం వంటి ఖరీదైన అవయవ మార్పిడిలు కూడా ఉచితంగా అందుతున్నాయి.
ఐపీఎల్ 2023 చాలా ఉత్సాహంగా సాగుతోంది. ఈ ఐపీఎల్ 16లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. లక్నో జెయింట్స్ ని స్వల్ప తేడాతో ఓడించింది.
ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడవుతాయని మీరు వినే ఉంటారు. ఈ విషయంలో భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, సాధారణంగా, మనలో ఎవరూ శరీరానికి సరిపడా ప్రొటీన్‌ని తీసుకోరు. ఆహారంలో ప్రోటీన్ కంటెంట్‌ను పెంచడం లేదా తగ్గించడం అవసరం లేదు.
తెలుగు రాష్ట్రాల(Telugu States)కు వర్షాల ముప్పు పొంచి ఉంది. మరో మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(Rain) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
అతడి ఆరోగ్య పరిస్థితిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అతడి పరిస్థితి విషమంగా ఉందనే ప్రచారం జరిగింది. అయితే అవన్నీ అవాస్తవమని వైద్యులు తేల్చి చెప్పారు.
ఏప్రిల్ నెలలో 20వ తేది ఒక్కరోజే రూ.68,228 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు(GST Collections) ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజులో జీఎస్టీ వసూళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది.