»Whatsapp Banned Over 47 Lakh Indian Accounts In March
WhatsApp: 47 లక్షల భారతీయ వాట్సాప్ ఖాతాలపై నిషేధం.. ఎందుకంటే ?
మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తన వినియోగదారుల భద్రతా నివేదికను మార్చి 2023కి విడుదల చేసింది. వాట్సాప్ ద్వారా నిషేధించబడిన భారతీయ ఖాతాల సంఖ్య, వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులు నివేదికలో ఉన్నాయి.
WhatsApp:ప్రముఖ మెటా(Meta) యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తన వినియోగదారుల భద్రతా నివేదికను మార్చి 2023కి విడుదల చేసింది. వాట్సాప్ ద్వారా నిషేధించిన భారతీయ వాట్సాప్ అకౌంట్ల సంఖ్య, యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన పూర్తి వివరాలు నివేదికలో సంస్థ వెల్లడించింది. తాజా రిపోర్టు ప్రకారం.. మార్చి 2023లో దేశంలోని వాట్సాప్‌లో 47 లక్షలకు పైగా భారతీయ అకౌంట్లను మెటా నిషేధించింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్ 4(1)(D)కి అనుగుణంగా ఈ అకౌంట్ల(Accounts)పై వాట్సాప్ నిషేధం విధించింది. అంతకుముందు ఫిబ్రవరిలో 45 లక్షలు, జనవరిలో 29 లక్షలు, డిసెంబర్లో 36 లక్షలు, 2022 నవంబర్‌లో 37 లక్షల ఖాతాలు నిషేధించబడినట్లు కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. నిషేధించబడిన వాట్సాప్ ఖాతాలు భారతీయ చట్టాలను లేదా వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘించిందనట్లు కంపెనీ తెలిపింది. మార్చి నెలలో 4,715,906 కంటే ఎక్కువ మంది భారతీయ వినియోగదారుల వాట్సాప్ ఖాతాలను నిషేధించింది. వీటిలో వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదుల కారణంగా దాదాపు 1,659,385 ఖాతాలు నిషేధించబడ్డాయి.
జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలలలో WhatsApp 4,597,400 కంటే ఎక్కువ భారతీయుల ఖాతాలను నిషేధించింది. అదనంగా వాట్సాప్‌కు 4,720 ఫిర్యాదు నివేదికలు అందాయని తాజా నివేదికలో పేర్కొంది. వీటిలో 4,316 నిషేధాలపై కంపెనీకి అప్పీల్ చేయగా, వాట్సాప్ 553 మందిపై మాత్రమే చర్య తీసుకుంది. IT నిబంధనల ప్రకారం.. 5 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులతో ఉన్న పెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ప్రతి నెలా సమ్మతి నివేదికలను ప్రచురించాలి. ఇందులో వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ప్రభుత్వం గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (GAC)ని ప్రారంభించింది. ఇది కొత్త పోర్టల్(Portal)లో వారి ఫిర్యాదులను నమోదు చేయడం ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.