మార్చి నెలలో చమురు వినియోగం (India's fuel demand) భారీగా పెరిగింది. ఏడాది ప్రాతిపదికన గత మార్చి నెలలో చమురు వినియోగం 5 శాతం పెరిగి 4.83 మిలియన్ బ్యారెళ్లకు లేదా 20.5 మిలియన్ టన్నులకు పెరిగింది.
Vivo నుంచి సరికొత్త 5జీ మోడల్ T2(Vivo T2) ఈరోజు(ఏప్రిల్ 11న) దేశీయ మార్కెట్లోకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ చిప్ సెట్ సపోర్టుతో 4,500mAh బ్యాటరీతో వచ్చిన ఈ మోడల్ ధరను 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కు రూ.18,999గా ప్రకటించారు. ఈ క్రమంలో ఈ మోడల్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు విపరీతంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Weather Station) వెల్లడించింది. ఏప్రిల్ 12వ తేది నుంచి రాష్ట్రంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
పాకిస్తాన్ లోని వారి కంటే భారత్ ముస్లీంల జీవన విధానం బాగుందని, అలాగే అక్కడ మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉందని, కానీ భారత్ లో అలా కాదని నిర్మలా సీతారామన్ అన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వార్తలో ఉంటారు. ఈసారి డ్యాన్స్ చేసి వార్తల్లోకి వచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలోకి టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేరగా.. వెల్ కం చెప్పి స్టెప్పులు వేశారు.
సాయి ధరమ్ తేజ్(Sai dharam Tej) నటించిన మిస్టికల్ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ ట్రైలర్(Virupaksha movie Trailer) ఈరోజు(ఏప్రిల్ 11న) విడుదలైంది. వీడియో చూస్తే ఉత్కంఠతో కూడిన సీన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటుంది. కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
DK Aruna : బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఇటీవల సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ స్వాగతం పలికారు. కలిసి పనిచేద్దామంటూ ఆయనకు స్వాగతం పలికారు. ఫోన్ చేసి మరీ బీజేపీలో చేరమని ఆమె కోరడం గమనార్హం.
న్యాచురల్ స్టార్ నాని(Nani)నటించిన దసరా మూవీ(Dasara movie) విడుదలై 10 రోజులైనా కూడా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. యునైటెడ్ స్టేట్స్(USA)లో కలెక్షన్ల హావా సృష్టిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నాని దసరా చిత్రం 2 మిలియన్ డాలర్ల వసూళ్లు వసూళ్లు దాటేసి రికార్డు క్రియేట్ చేసింది.
మైక్రోవేవ్‌లు ఆహారాన్ని త్వరగా వేడి చేయడంలో సహాయపడినప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మైక్రోవేవ్‌లో ప్రతి ఆహారాన్ని వేడి చేయడం మానుకోవాలి. ఎందుకంటే ఆహారంలోని పోషకాలను ఇది తగ్గిస్తుంది. ఇది క్యాన్సర్‌కు కారణమవుతుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి.
రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఒకరోజు దీక్ష చేపట్టారు. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లట్ చర్యలు తీసుకోవడం లేదని.. అందుకు నిరసనగా దీక్షకు దిగారు.
టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్(TFCC Nandi Awards 2023) సౌత్ ఇండియా 2023 ఈ ఏడాది ఇవ్వనున్నట్లు నిర్వహకులు స్పష్టం చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం దుబాయ్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు 2021, 22 ఏడాదిలో విడుదలైన చిత్రాల వారు అప్లై చేసుకోవాలని కోరారు.